
పిఠాపురం: రద్దీగా ఉండే 216 జాతీయ రహదారి పక్కన ఎండలో రెండేళ్ల చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ ఉండటం కొందరు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడకు చేరుకుని చిన్నారిని స్టేషన్‌కు తరలించారు. ఎవరైనా వదిలేశారా లాంటి విషయాలు తెలుసుకునేందుకు విఫలయత్నం చేశారు.
దీంతో పాపను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. వారు కాకినాడ ఐసీడీఎస్ సంరక్షణకు తరలించారు. పాప వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా దూరప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ వదిలేసి ఉంటారని భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్సై శంకరరావు విజ్ఞప్తి చేశారు.
చదవండి: అక్రమ సంబంధమే ప్రాణం తీసింది..
కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’
Comments
Please login to add a commentAdd a comment