
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖపట్నంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. చిన్న వాల్తేర్‌లో కోవిడ్ టీకా కేంద్రాన్ని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేశామని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తామన్నారు. మరో రెండు వ్యాక్సిన్లకు అనుమతి లభించిందని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment