సాక్షి, తిరుపతి: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర నిధులు రాబట్టడంలో పనితీరు కనబరుస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు మేజర్ పోర్టులను అభివృద్ధి చేస్తోందని అన్నారు. దేశంలోనే విశాఖపట్నం మేజర్ పోర్టు అని, దాని అభివృద్ధి జరుగుతోందన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఏపీలో మరింత పారిశ్రామికాభివృద్ధి జరగనుందని తెలిపారు.
కాగా తిరుపతిలో రూ.2,900 కోట్ల జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రూ. 500 కోట్లతో ఏపీ ప్రభుత్వం-నేషనల్ హైవే సంస్థ మధ్య ఎంవోయూ కుదిరిందని.. తిరుపతిలో ఇంటర్నేషనల్ సెంట్రల్ బస స్టేషన్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ ఆర్క్ టెక్ నిర్మాణం చేస్తామని అన్నారు. దేశంలో ఏడు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారులు అభివృధ్ది చేస్తున్నామని చెప్పారు.
రూ. 500 కోట్లతో తిరుపతి బస్టాండ్ విస్తరణ చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరామని స్థానిక ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. కపిల తీర్థం నుంచి అంజిమేడు రోడ్డు అభివృధ్ది చేయాలని కోరినట్లు తెలిపారు. తడ శ్రీకాళహస్తి మధ్య స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చాలని, తిరుపతి - తిరుత్తణి-చెన్నై జాతీయ రహదారిను సిక్స్ లైన్ జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని కోరినట్లు వెల్లడించారు.
చదవండి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీలో అత్యధిక పెన్షన్ విధానం
Comments
Please login to add a commentAdd a comment