సాక్షి, విశాఖపట్నం : విశాఖ షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌కు కమిటీ బుధవారం అందజేసింది. నిర్ణీత సామర్థ్యానికి తగట్టు క్రేన్ నిర్మాణం జరగలేదని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ బృందం నివేదిక అందించింది. షిప్ యార్డ్‌కు అనుపమ క్రేన్ ఇంజనీరింగ్ సంస్థ క్రేన్ సమకూర్చినట్లు తెలిపింది. కాగా హిందూస్తాన్ షిప్ యార్డులో ఆగష్టు 1న క్రేన్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. క్రేన్ ద్వారా లోడింగ్ పనులు పరిశీలిస్తుండగా క్రేన్ కుప్పకూలిపోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. (హిందుస్తాన్ షిప్ యార్డ్‌లో ఘోర ప్రమాదం)
ప్రమాదం జరిగిన వెంటనే ఘటన వివరాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్ కమిషనర్‌ను సీఎం జగన్ ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాల తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment