Visakhapatnam: 19-Year-Old White Tiger Dies At Indira Gandhi Zoological Park (IGZP) - Sakshi
Sakshi News home page

సందడి ముగిసింది.. తెల్లపులి కుమారి ఇకలేదు..

Published Tue, May 9 2023 8:34 AM | Last Updated on Tue, May 9 2023 9:27 AM

White Tiger Dies In Indira Gandhi Zoological Park Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇం­దిరాగాంధీ జూ పార్కు­లో తెల్ల పులి కుమారి(19) సంద­డి ఇక ముగిసింది. వృద్ధా­ప్యంతో పాటు అనారో­గ్యం కారణం­­­గా కుమారి సో­మ­వారం మృ­తి చెందింది. వి­శాఖ జూ పార్కులో సుమారు 16 సంవత్సరాలు పాటు సందర్శకులను అ­లరించడంతో పాటు తన సంతతిని ఉత్పత్తి చేసింది. ఎన్‌క్లోజరులో హుషారు­గా తిరుగు­­తూ చెట్లు ఎక్కుతూ, పరుగెత్తుతూ సందర్శకులకు కనువిందు చేసేది. ఇ­ప్పు­డు ఆ కుమారి దూరం కావడంతో జూ అధికారులు సైతం విచా­రం వ్య­క్తం చేస్తున్నారు. 2007 కంటే ముందు ఇందిరాగాంధీ జూ పార్కులో తెల్ల పులు­లు ఉండేవి కాదు.

దీంతో అప్పటి జూ అధికారులు హైదరాబాద్‌లో నెహ్రూ జూలాజికల్‌ పార్కు నుంచి కుమారితో పాటు మరో మగ తెల్ల పు­లి(జత తెల్ల పులులు)ని 2007లో ఇక్కడకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి హు­షారుగా ఎన్‌క్లోజర్‌లో తిరుగుతూ మూడు సార్లు గర్భం దాల్చింది. మొ­త్తం 9 కూనలకు(పిల్లలు) జన్మనిచ్చి జూలో వాటి సంతతిని పెంచింది. వాటిలో­నే కొన్నింటిని జంతు మార్పిడి పద్ధతి ద్వారా ఇక్కడ అధికారులు ఇతర జూ పార్కులకు తరలించి అక్కడ నుంచి కొన్ని జంతువులకు విశాఖ జూకి తీసుకొచ్చారు.

కాన్పూర్‌ జూకి రెండు తెల్ల పులులను ఇచ్చి అక్కడ నుంచి ఒ­క మగ ఖడ్గ మృగాన్ని ఇక్కడకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇతర జూ పార్కులకు తరలించగా, కుమారి మృతి అనంతరం ప్రస్తుతం జూలో ఐదు తెల్ల పులులున్నట్లు ఇన్‌చార్జి క్యూరేటర్, ఏసీఎఫ్‌ మంగమ్మ తెలిపారు. వృద్ధా­ప్యం కారణంగా కొన్ని అవయవాలు కూడా పనిచేయకపోవడంతో కుమా­రి మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైనట్లు ఆమె పేర్కొన్నారు.


చదవండి: మోచా తుపాను మనకు లేనట్టే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement