
సారవకోట: మూగ యువతిపై ఓ యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి ఉడాయించాడు. ఈ ఘటన సారవకోట మండలం పెద్దలంబ పంచాయతీ మూగుపురం గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సారవకోట ఎస్‌ఐ ముకుందరావు తెలిపిన వివరాల ప్రకారం.. మూగుపురం గ్రామానికి చెందిన యడ్ల సూర్యనారాయణ (30) గురువారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో 20 ఏళ్ల మూగ యువతిని తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ఒడిగట్డాడు.
దీంతో ఆమె కేకలు వేయడంతో తల్లితో పాటు చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకోవడంతో సూర్యనారాయణ పరారయ్యాడు. దీనిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పాలకొండ డీఎస్పీ ఎం.శ్రావణి, పాతపట్నం సీఐ రవిప్రసాద్, ఎస్‌ఐ ముకుందరావులు శుక్రవారం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. యువకుడు పరారీలో ఉండడంతో గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సూర్యనారాయణకు గతంలో కూడా ఇలాంటి ఘటనలతో సంబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment