
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబుతోనే మనం యుద్ధం చేయడం లేదు. ఎల్లో మీడియాతోనూ పోరాటం చేస్తున్నాం’అని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ప్రతీ రోజూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. వీళ్లు ప్రజలకు చేసిన మంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు. బురద చల్లడమే పనిగా పెట్టుకున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. అబద్ధాలు చెప్పడం, వక్రీకరణ చేయడం, దుష్ప్రచారం చేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. పార్టీలో ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా ఖాతా ఉండాలి. అన్యాయం జరిగితే దాని ద్వారా ప్రశ్నించాలి’ అని సూచనలు చేశారు.
కాగా, తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరగుతున్న ఈ సమావేశానికి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

Comments
Please login to add a commentAdd a comment