పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్‌ జగన్‌ | YS Jagan Meets Party Activists And Normal People At Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్‌ జగన్‌

Published Sun, Jun 23 2024 9:35 AM | Last Updated on Sun, Jun 23 2024 5:15 PM

YS Jagan Meets Party Activists And Normal People At Pulivendula

సాక్షి, పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్‌ జగన్‌ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్‌ జగన్‌ స్పీకరిస్తున్నారు.

ఇక, ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్‌సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో క్యాంప్‌ కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తారని దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అవుతారని అభిమానులు అంటున్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement