YS Jagan Pulivendula Tour
-
వైఎస్సార్సీపీ నేత సంకిరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ నివాళి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడో రోజు పర్యటించారు. క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఆయన కలిశారు.పులివెందుల పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నాయకులు నివాళులర్పించారు.పులివెందులలో ఇటీవల మృతి చెందిన సమీప బంధువు మైఖేల్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. -
అధైర్యపడొద్దు.. వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ భరోసా (ఫొటోలు)
-
మళ్లీ మంచిరోజులొస్తాయి.. ధైర్యంగా ముందుకెళ్దాం: వైఎస్ జగన్
వైఎస్సార్, సాక్షి: చెప్పిన మంచి పనులన్నీ చేశాం.. రాష్ట్రంలో ప్రతీ కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, అందుకే ప్రజలకు మన పైనే విశ్వాసం ఉందన్నారు వైఎస్స్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటించిన ఆయన.. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా పార్టీ శ్రేణులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఎవరూ అధైర్యపడొద్దు, రాబోవు కాలం మనదే, ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది, మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, భవిష్యత్ మనదే. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా మన పార్టీ శ్రేణులు అడుగులు వేయాలి. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం, మళ్ళీ మంచిరోజులు వస్తాయి’’ అని వైఎస్ జగన్ అన్నారు. పులివెందులలో జననేత.. ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండిపులివెందుల పర్యటనలో భాగంగా.. వైఎస్ జగన్‌కు అడుగడుగునా ఆత్మీయ స్వాగతం లభించింది. మూడు రోజులపాటు భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. అలాగే.. పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. ‘‘కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు పార్టీ తోడుగా ఉంటుంది’’ అని జగన్ భరోసానిచ్చారు. అలాగే.. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు, నేతలకు అండగా నిలబడాలని ప్రజాప్రతినిధులకు జగన్ సూచించారు. -
ముగిసిన వైఎస్ జగన్ పులివెందుల పర్యటన
వైఎస్సార్, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. మూడు రోజులపాటు సొంత నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారాయన. సోమవారం మధ్యాహ్నాం తన పర్యటన ముగించుకుని సతీసమేతంగా బెంగళూరుకు వెళ్లారు. సోమవారం పులివెందులలో వైఎస్ జగన్.. వైఎస్సార్ జిల్లాతో పాటు కర్నూలు, అనంతపురం, చిత్తూరు.. చుట్టు పక్కల జిల్లాల నుంచి పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ నాయకుల్ని, అభిమానుల్ని కలవడంతో పాటు వాళ్ల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. పార్టీ ఓటమిని తల్చుకుని బాధపడొద్దని, ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. అలాగే అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సంకిరెడ్డి మృతదేహానికి జగన్ దంపతులు నివాళులర్పించారు. సంకిరెడ్డి కుటుంబాన్ని జగన్ ఓదార్చారు. తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో పార్టీ నాయకులతో ఎన్నికల ఓటమిపై సమీక్ష జరిపిన ఆయన.. అధైర్య పడొద్దని, రాబోయే రోజులు పార్టీవేనని, ఉత్సాహంగా పని చేయాలని సూచించారు. మరోవైపు సొంత నియోజకవర్గంలో వైఎస్ జగన్‌కు అడుగడుగునా సాదర స్వాగతం లభించింది. ఆయన్ని కలిసేందుకు కార్యకర్తలు, ప్రజలు పులివెందుల క్యాంప్ కార్యాలయానికి క్యూ కట్టారు. ఎన్నికల ఫలితంతో సంబంధం లేకుండా మీ వెంటే ఉన్నామంటూ నియోజకవర్గం.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రజానీకం నినాదాలతో చాటి చెప్పింది. క్లిక్ చేయండి: పులివెందులలో జననేత -
అధైర్య పడొద్దు.. మంచి రోజులొస్తాయి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తమ బిడ్డ వైఎస్ జగన్మోహన్రెడ్డినీ గుండెలకు హత్తుకుంది పుట్టిన గడ్డ పులివెందుల. ఇచ్చిన ప్రతీ హామీ నెరవేర్చి తాను చేయగలిగేది మాత్రమే చెప్పిన జగన్ ఎప్పటికి తమ నాయకుడే అని చేతల్లో చూపించారు పులివెందుల వాసులు. రాజన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ, సవాళ్లను ఎదుర్కొంటూ... ముందుకు సాగుతున్న జగన్‌కు అండగా ఉంటామని నిరూపించింది. కష్టాలు తాత్కాలికమేనని.. మళ్లీ జగన్ పట్టం కడతారని అంటున్నారు పులివెందుల వాసులు. అందుకే సొంతూరికి వచ్చిన తమ బిడ్డకు అపూర్వ స్వాగతం పలికారు.కడప జిల్లాలో జరుగుతున్న తన రెండో రోజు పర్యటనలో భాగంగా పులివెందులలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పలువురిని కలుసుకున్నారు. రాయలసీమ లోని నాలుగు ఉమ్మడి జిల్లాలైన అనంతపురం చిత్తూరు కర్నూలు కడప ప్రాంతాల నుంచి దాదాపు 5,000 మంది అభిమానులు.. వైఎస్ జగన్ కలిసారు.ఎన్నికల అనంతరం తెలుగుదేశం నేతలు, ఆ పార్టీ ప్రోత్సహిస్తున్న రౌడీ ముఖలు చేస్తున్న దాడుల గురించి వైఎస్ జగన్‌కు వివరించారు. పార్టీ నేతలకు అభిమానులకు తాను అండగా ఉంటానని ఎవరు ఎలాంటి ఆందోళన గురి కావద్దని వైఎస్ జగన్ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకు పులివెందులో వైఎస్ జగన్ వివిధ వర్గాలను కలుసుకుంటున్నారు. -
పులివెందులలో జననేత.. ప్రజలతో మమేకం.. (ఫోటోలు)
-
పులివెందుల క్యాంపు ఆఫీసులో ప్రజలు, అభిమానులతో వైఎస్ జగన్
సాక్షి, పులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం ఉదయం వైఎస్ జగన్ పులివెందులలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు, వినతులను వైఎస్ జగన్ స్పీకరిస్తున్నారు.ఇక, ఆదివారం తెల్లవారుజాము నుంచే క్యాంపు కార్యాలయం వద్దకు వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఆఫీసుకు కార్యకర్తలు వస్తున్న సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో పాటు అభిమానులు పెద్దసంఖ్యలో రావడంతో క్యాంప్ కార్యాలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఇక ఆయన్ను కలిసేందుకు వచ్చిన ప్రజల్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు. వైఎస్ జగన్ పాలనను, చంద్రబాబు పాలనను ప్రజలు తప్పక గమనిస్తారని దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవుతారని అభిమానులు అంటున్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారు. -
పులివెందులలో జగన్‌కు అఖండ స్వాగతం
సాక్షి కడప/రాయచోటి/కడప అర్బన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పులివెందులకు చేరుకున్నారు. పుట్టినగడ్డలో ఆయన అడుగుపెట్టగానే జనం ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా మాజీ సీఎంకు హారతులు పడుతూ మహిళలు దిష్టితీయగా, మరికొందరు పుష్పగుచ్ఛాలు అందించారు. ఆ తర్వాత పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. జగన్‌ను చూడగానే జనమంతా ఒక్కసారిగా ‘సీఎం సీఎం’.. అంటూ ఈలలు, కేకలతో ఉత్సాహం ప్రదర్శించారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ కలుస్తూ అడిగిన వారికి ఫొటో తీసుకునే అవకాశమిస్తూ వారిని ఆప్యాయంగా పలకరించారు. పులివెందుల పర్యటనలో భాగంగా జగన్ తొలిరోజంతా కార్యకర్తలతోనే గడిపారు. జగన్‌ను కలిసిన పలువురు నేతలు ఇక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని శనివారం పలువురు నేతలు కలిశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి జగన్ వెన్నంటే ఉంటూ కార్యకర్తల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వచ్చారు. ఎంపీతో పాటు రాజంపేట, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, చంద్రశేఖర్.. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, ‘మండలి’ మాజీ డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్‌రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అనేక విషయాలపై వారు సుదీర్ఘంగా మాట్లాడారు. టీడీపీ దాడులపై జగన్ ఆరా మరోవైపు.. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ మున్సిపల్ కౌన్సిలర్లపై టీడీపీ రౌడీమూకలు చేసిన దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. రాయచోటి 4వ వార్డు కౌన్సిలర్ హరూన్ బాషా, స్థానిక మైనార్టీ నేతలు దాడి సంఘటనను ఆయనకు వివరించారు. ఈ దాడిలో 7వ వార్డు కౌన్సిలర్ భర్త ఇర్ఫాన్ బాషా కత్తిపోట్లకు గురికాగా, హరూన్ బాషా ఇంటి ముంగిట ఉన్న బైకును బండరాళ్లతో బాది ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్ దాడిలో గాయపడిన వారికి ధైర్యాన్నిచ్చారు. త్వరలో బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా నిలుస్తామన్నారు. కాన్వాయ్‌లో వాహనాల ఢీ అవాస్తవం.. ఇదిలా ఉంటే.. కడప విమానాశ్రయంలో దిగిన జగన్ తన కాన్వాయ్‌లో పులివెందులకు బయల్దేరారు. రామరాజుపల్లె వద్ద వేచి ఉన్న అభిమానులను కలిసేందుకు ఆయన వాహనాన్ని ఆపమన్నారు. అదే సమయంలో కాన్వాయ్‌తో సంబంధంలేని వ్యక్తి తమ కుటుంబ సభ్యులతో వేరే కారులో పులివెందుల వైపు వెళ్తున్నారు. ఈ కారు డ్రైవర్ నిర్లక్ష్యంతో కాన్వాయ్‌లో చివరగా ఉన్న అగ్నిమాపక వాహనాన్ని వెనుకవైపు ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, కేవలం కారు ముందు భాగం పాక్షికంగా దెబ్బతిందని కడప డీఎస్పీ ఎండీ షరీఫ్ తెలిపారు. కానీ, మాజీ సీఎం కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్నాయని వెలువడిన వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు సమగ్రంగా విచారిస్తున్నారన్నారు. పచ్చ మీడియాలో దుష్ప్రచారంమాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూసేందుకు, ఆయన్ను పలకరించేందుకు పెద్దఎత్తున ప్రజానీకం పులివెందుల చేరుకున్నారు. మ.2 గంటలకు పులివెందులకు వస్తారనుకున్న ఆయన ఐదు గంటలకు చేరుకున్నారు. అప్పటికే పెద్దఎత్తున అభిమానులు అక్కడకు తరలివచ్చారు. బారులు తీరిన జనాన్ని కలుస్తూ, వారిని ఊరడిస్తూ అధినేత వైఎస్ జగన్ ఉండిపోయారు. అంతేకాక.. తమ అభిమాన నేతను కలిసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. ఈ క్రమంలో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో నగిరిగుట్టకు చెందిన ఓ యువకుడు క్యాంపు కార్యాలయం కిటికీ అద్దాలపై పడ్డాడు. అద్దాలు పగిలి చేతికి గాయం కూడా అయ్యింది. వాస్తవం ఇలా ఉంటే, జగన్‌కు పులివెందులలోనే ప్రతిఘటన.. జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలంటూ పచ్చమీడియాలో తెగ దుష్ప్రచారం చేశారు. దీనిపై పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌రెడ్డి వివరణ ఇస్తూ.. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజాదర్బార్ నిర్వహిస్తున్న సమయంలో కార్యకర్తల తోపులాట జరిగి కిటికీ అద్దాలు పగిలాయి కానీ, ఎలాంటి రాళ్లదాడి జరగలేదని, ఎవరూ నినాదాలు చేయలేదని స్పష్టంచేశారు. కేవలం వైఎస్ జగన్‌ను చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపడంతో ఒకరిపై ఒకరు పడి తోపులాట మాత్రమే జరిగిందన్నారు. -
తరగని అభిమానం
సాక్షి ప్రతినిధి, కడప: ఐదేళ్లు మహిళామణులకు అన్నీ తానై అండదండగా నిలిచారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిశలు తపించారు. ప్రతి పథకంలోనూ మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఆ అభిమానం నారీలోకంలో గూడు కట్టుకుపోయింది. అయితే ఐదేళ్లకోసారి లభించే ప్రజా తీర్పులో ఆ అభిమాన నేత ఓటమిపాలయ్యారు. అయినా వారిలో ఉన్న మమతానురాగాలు చెక్కు చెదరలేదు. తామెంతో అభిమానించే జననేతను చూడగానే ఉబికి వస్తున్న కన్నీళ్లను పంటిబిగువన ఆపుకునే వారు కొందరైతే, బోరున ఏడ్చేవారు మరికొందరయ్యారు. ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించే ఈ దృశ్యాలు శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప నుంచి పులివెందులకు వెళ్లే మార్గంలోని ప్రధాన రహదారిపై కనిపించాయి.👉 ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తొలిసారిగా శనివారం పులివెందుల పర్యటనకు వచ్చారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కడపకు చేరుకున్నారు. వైఎస్ జగన్ కాన్వాయ్ వెంట అనుసరించారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవునా కార్ల కాన్వాయ్ కొనసాగింది. ప్రతి చోటా కాన్వాయ్ ఆపడం, తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ మాజీ సీఎం ముందుకు కదిలారు.పులివెందుల చేరేందుకునాలుగు గంటల సమయం..కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు వీఐపీ కాన్వాయ్ గంట లేదా గంటన్నర సమ యం పడుతుంది. కాగా, శనివారం కడప నుంచి పులివెందుల చేరుకునేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి 4 గంటల సమయం పట్టింది. కాన్వాయ్‌లో వాహనాలు సుమారు 2 కిలోమీటర్ల పొడువునా బారులు తీరాయి. రోడ్డుపైకి వచ్చిన గ్రామీణులకు అభివాదం చేస్తూ, మహిళలను ఓదారుస్తూ వైఎస్ జగన్ కదిలారు. బేస్తవారిపల్లెలో చిన్నారులను భుజానికెత్తుకుని లాలించారు. ఈ దృశ్యం అభిమానులకు కనువిందు చేసింది. ఇలా ప్రజల ప్రేమాభిమానాల మధ్య పులివెందుల చేరుకునేందుకు నాలుగు గంటలు పైగా సమయం పట్టడం విశేషం.బోరున విలపించిన మహిళలు..పులివెందుల రోడ్డు మార్గంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్తున్నారని తెలుసుకున్న గ్రామీణులు ఆయా గ్రామాల వద్ద రోడ్డుపైకి వచ్చి చేరారు. రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా మహిళలు జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఈ క్రమంలో వైఎస్ జగన్‌ను చూడగానే మహిళలు బోరున విలపించారు. వెల్లటూరులో ఆరు పదుల వయస్సు దాటిన ఓ మహిళ అందరూ కూడబలుక్కుని అన్యాయం చేశారే కొడుకా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇలా గ్రామ గ్రామాన మహిళలు తండోపతండాలుగా రోడ్డుపైకి వచ్చి, అభిమాన నాయకున్ని చూడగానే వారిలో ఉన్న ప్రేమాభిమానాలు గుప్పించారు. గుర్రాలచింతలపల్లె, ఇందిరానగర్, కొత్తూరు, వేంపల్లె, తాళ్లపల్లె, వి.కొత్తపల్లె, వేముల, వేల్పుల, బేస్తవారిపల్లె ఇలా దారి వెంబడి మహిళలు ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఆయా జంక్షన్లలో పిట్టగోడలు ఎక్కి జగన్ కోసం ఎదురు చూశారు. వేంపల్లె హన్మాన్ జంక్షన్లో మస్తాన్‌బీ అనే మహిళ తన ఆవేదనను ఆపుకోలేక ఒక్కమారుగా కన్నీరు పెట్టుకున్నారు. నాయనా...నువ్వు బాగుండాలి.. మా పాలిట దేవుడివి అంటూ అభిమానాన్ని చాటుకున్నారు. వేల్పులలో మహిళలు మూకుమ్మడిగా రోడ్డుపైకి వచ్చి మేమంతా నీ వెంటే అంటూ నినాదాలు చేశారు. -
పులివెందుల పర్యటన.. వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం (ఫొటోలు)