
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడో రోజు పర్యటించారు. క్యాంప్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఆయన కలిశారు.
పులివెందుల పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు సంకిరెడ్డి భౌతిక కాయానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఇతర నాయకులు నివాళులర్పించారు.

పులివెందులలో ఇటీవల మృతి చెందిన సమీప బంధువు మైఖేల్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment