సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన రెండో భార్య షమీమ్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ఈ సందర్బంగా సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో షమీమ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో షమీమ్.. సీబీఐకి మూడు పేజీల స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్‌మెంట్‌లో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు లేకపోవడం గమనార్హం. ఇక, స్టేట్‌మెంట్‌లో వివేకా హత్యకు ముందు జరిగిన పరిణామాలను షమీమ్ వివరించారు.
షమీమ్ తన స్టేట్‌మెంట్‌లో 2010 అక్టోబర్ 3న వివేకాతో తనకు వివాహం జరిగిందన్నారు. 2015లో తమకు షేహన్ షా(కొడుకు) జన్మించినట్టు స్పష్టం చేశారు. వివేకాకు దూరంగా ఉండాలని సునీతా రెడ్డి బెదిరించేది. హత్యకు కొన్ని గంటల ముందు వివేకా.. నాతో ఫోన్‌లో మాట్లాడారు. బెంగళూరు భూ సెటిట్‌మెంట్‌లో 8 కోట్లు వస్తాయని వివేకా చెప్పారు. మా వివాహం వివేకా కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు, మమ్మల్ని దూరం పెట్టారు. షేహాన్ షాను రాజకీయంగా పైకి తీసుకొస్తా అని వివేకా చెప్పేవారు. పలు మార్లు శివ ప్రకాష్ రెడ్డి నన్ను బెదిరించారు. ఆ కారణంగానే చనిపోయాడని తెలిసినా రాలేకపోయాను. అన్యాయంగా వివేకా చెక్ పవర్‌ను తొలగించారు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ‘వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్’
Comments
Please login to add a commentAdd a comment