సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్‌సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ నేతల సవాళ్లకు ధీటుగా వైఎస్సార్‌సీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే, తిరువూరు అభివృద్ధిపై వైఎస్సార్‌సీపీ నేతలు సిద్దమయ్యారు. టీడీపీ సెల్ఫీ ఛాలెంజ్‌కు ధీటుగా వైఎస్సార్‌సీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో, బోసుబొమ్మ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద చర్చకు ఇరు పార్టీల నేతలు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను విఘాతం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు పార్టీలకు చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు.
తాడేపల్లి: తిరువూరులో జరిగిన అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి పేర్కొన్నారు. అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘రూ.14వందల కోట్లతో చేసిన అభివృద్ధి వారికి కనపడదు. డయాలసిస్ సెంటర్లు నిర్మిస్తున్నాం. సీఎం సభకు వచ్చిన జనాన్ని చూశాక టీడీపీ పని అయిపోయిందని వారికి అర్థం అయింది.
అందుకే మాపై సవాల్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ఎంపి కేశినేని నాని ఈ నాలుగేళ్లలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇక్కడ టీడీపీ లేదని ఆయనకి బాగా అర్థం అయింది. ఇవ్వాళ మా సెకండ్ క్యాడర్ వస్తేనే బోస్ సెంటర్ కిటకిటలాడింది. ఇక నేను కూడా వెళ్తే పరిస్థితి ఇంకోలా ఉండేది. మాపై ప్రజలకు ఉన్న ప్రేమ అలాంటిది. పోలీసులు వారి పని వారు చేసుకుపోతారు. నేను నిత్యం నియోజకవర్గంలోనే తిరుగుతూ ఉంటాను. మేము చేసిన అభివృద్ధి సాక్ష్యాధారాలతో సహా చూపించటానికి ఎప్పుడైనా సిద్దమే అని పేర్కొన్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment