సాక్షి, నెల్లూరు: జనసేన అధినేన పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. తాజాగా అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌కు అంత సీన్ లేదు. ప్యాకేజీ కోసం బాబు బాధ్యతను మోస్తున్న వ్యక్తి పవన్. వచ్చే ఎన్నికల్లో పవన్ తాను పోటీ చేసే సీటులో గెలవాలి. అప్పుడప్పుడు వచ్చి టీడీపీ స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతాడు. వచ్చే ఎన్నికల్లో బాబు, పవన్ కట్టకట్టుకుని రండి. అయ్యా పీకే.. నువ్వేమీ పీకలేవు. అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంగ్‌లు, ఓపెనింగ్ షాట్‌లు, క్లైమాక్స్ పంచ్ డైలాగులు తప్ప నువ్వేమీ పీకలేవు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఎన్నిసార్టు పొత్తుపెట్టుకుని విడాకులు తీసుకుంటారు..
సాక్షి, కృష్ణా: జనసేన అధినేన పవన్ కల్యాణ్‌కు సినిమా షూటింగ్స్ లేనట్టున్నాయి. అందుకే మంగళగిరిలో ఉండి చంద్రబాబు ఏం చెబితే అదే పవన్ నోటి వెంట వస్తుందోంటూ మంత్రి జోగి రమేష్ ఫైరయ్యారు. కాగా, మంత్రి జోగి రమేష్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజలు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే తల కల సాధ్యమవుతుందని నమ్మారు. అందుకే విశాఖ గర్జనను విజయవంతం చేశారు. అది తట్టుకోలేకనే జనసేన బ్యాచ్ సైకోల్లా వ్యవహరించారు. మంత్రులపై ఏవిధంగా దాడులు చేశారో ప్రజలందరూ చూశారు. టీడీపీ, జనసేన పార్టీలు హింసను ప్రోత్సహిస్తున్నాయి.
పవన్ కల్యాణ్‌కు సినిమా షూటింగ్స్ లేవనుకుంటా.. అందుకే మంగళగిరిలో ఉండి చంద్రబాబు ఏం చెబితే అదే మాట్లాడుతున్నాడు. పవన్‌కు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు దొరక్కపోవడంతో ఏడుస్తున్నాడు. ముందు ముసుగులు తీసి మాట్లాడటం నేర్చుకోండి. మొసలి కన్నీరు కార్చడం మానుకోండి. ఎన్ని సార్లు పొత్తు పెట్టుకుంటారు. ఎన్నిసార్లు విడాకులు తీసుకుంటారు. సింగిల్‌గా పోటీ చేస్తావో.. చంద్రబాబుతో కలిసి వస్తావో నువ్వే చెప్పాలి. పవన్ నువ్వు.. బీజేపీ, బాబుతో కలిసొచ్చినా సాధించేదేమీ లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment