
ఉల్లి పంటను పరిశీలిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కోట్ల హర్ష, డాక్టర్ సతీష్ తదితరులు
చంద్రబాబు ప్రభుత్వంలో ఇంతకంటే బూటకం ఏం ఉంటుంది...?
పవన్ సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ఉల్లి రైతులపై లేదా?
వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి
వెంకటగిరి గ్రామంలో ఉల్లి పంటను పరిశీలించిన పార్టీ నేతల బృందం
కోడుమూరు రూరల్: ‘‘క్వింటా ఉల్లికి ప్రకటించిన రూ.1,200 మద్దతు ధరను ఎత్తివేసి హెక్టార్ ఉల్లికి రూ.50 వేల నష్ట పరిహారం ఇస్తామని ప్రకటించడం పెద్ద బూటకం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి ఘోరంగా మారింది. కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’’ అని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘కుడా’ మాజీ చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కోడుమూరు సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సతీ‹Ùతో కలిసి కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో ఉల్లి పంటను ఆయన పరిశీలించారు.
ఉల్లి సాగు పెట్టుబడులు, మార్కెట్ పరిస్థితి, ప్రభుత్వం కలి్పస్తున్న మద్దతు ధర తదితరాలపై రైతులతో మాట్లాడారు. రైతులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆందోళన చేయడంతో ప్రభుత్వం కదిలింది. కానీ, కంటితుడుపుగా క్వింటా ఉల్లికి రూ.1,200 మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకొంది. ఈ ధరతో రైతులకు కనీసం పెట్టుబడి కూడా రాలేదు. వారు ఉల్లి పంటను పశువుల మేతగా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఇంతటి దారుణ పరిస్థితులను ఏనాడూ చూడలేదు. రైతులకు మద్దతు ధరతో పాటు నష్టపరిహారం కూడా అందించాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా టికెట్ రేట్ల పెంపుపై ఉన్న శ్రద్ధ ఉల్లి రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి లేకుండాపోయిందని ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. పంటకు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆదిమూలపు సతీ‹Ù, కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ‘‘రైతులకు కనీసం ఒక యూరియా బస్తాను కూడా సవ్యంగా అందించలేకపోతోంది. ఉల్లి కొనుగోళ్లను నిలిపేస్తున్నట్లు ప్రకటించడం దారుణం. ఇలాగే వ్యవహరిస్తే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని హెచ్చరించారు.