breaking news
Onion farmers
-
ఆశలు 'కుళ్లిపోతున్నాయి'
కర్నూలు(అగ్రికల్చర్): కూటమి ప్రభుత్వ హయాంలో మిరప, పత్తి, మామిడి, టమాట తదితర పంటలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. ఇప్పటికే యూరియా కొరత సతమతం చేస్తున్న సమయంలో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ఉల్లి ధర కన్నీళ్లు పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఉల్లి పండించే జిల్లాల్లో కర్నూలుదే అగ్రస్థానం. మహారాష్ట్రలోని పునే తర్వాత అత్యధికంగా ఉల్లి సాగవుతున్నది ఇక్కడే. అయితే ఇప్పుడున్న ధరలతో రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 19,288 హెక్టార్లుకాగా (హెక్టార్ దాదాపు 2.5 ఎకరాలు) 15,704 హెక్టార్లలోనే సాగయింది. ఉద్యాన శాఖ గణాంకాల ప్రకారం హెక్టారుకు 150 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. దీని ప్రకారం చూస్తే, జిల్లా మొత్తంగా ఉల్లి ఉత్పాదకత అంచనా 23,55,600 క్వింటాళ్లు. అయితే ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన దిగుబడి 2,52,000 క్వింటాళ్లు. అంతంత మాత్రం మార్కెట్లోకి వచ్చిన ఉల్లిగడ్డలనే కొనేవారు లేరు. పూర్తి స్థాయి పంట మార్కెట్లోకి వస్తే పరిస్థితి ఏమిటని రైతులు వాపోతున్నారు. క్వింటాకు తక్షణ నష్టం రూ.550 అప్పులు, పంట చేతికి వచ్చి అమ్ముకోవడానికి పట్టే నాలుగు నెలల కాలంలో వడ్డీల భారం వెరసి ఉల్లి రైతుకు పెను భారమవుతోంది. మొత్తంగా క్వింటా ఉల్లిగడ్డలు పండించి మార్కెట్‌కు తీసుకురావడానికి రూ.1,750 వరకు (కేజీకి రూ.17.50 చొప్పున) ఖర్చవుతోంది. కూటమి ప్రభుత్వం ఉల్లికి ఇస్తున్న మద్దతు ధర రూ.1,200 మాత్రమే. అంటే పెట్టుబడిలోనే క్వింటాపై రైతులు రూ.550 నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని మద్దతు ధరను కనీసం రూ.2,000కు పెంచాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస ధర లేక నష్టాలు మూట కట్టుకుంటున్న రైతులు గిట్టుబాటు ధర కోసం వలస బాట పడుతున్నారు. ప్రభుత్వం రూ.1,200 మద్దతు ధర ప్రకటించినప్పటికీ పెట్టుబడి కూడా దక్కకపోవడంతో అనేక మంది రైతులు చిత్తూరు, తిరుపతి, గంటూరు తదితర ప్రాంతాలకు ఉల్లిగడ్డలు తీసుకెళ్లి ప్రధాన రహదారులు, నగరాల్లోని ప్రధాన కూడళ్లలో అమ్మకాలు సాగిస్తున్నారు. రీటైల్ మార్కెట్లో కిలో రూ.20 ప్రకారం విక్రయిస్తున్నారు. ఇద్దరు, ముగ్గురు రైతులు లారీ తీసుకెళ్లి అమ్మకాలు చేస్తుండటం గమనార్హం. జగన్ హయాంలో ఐదేళ్లూ హ్యాపీవైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్న ఐదేళ్లలో ఉల్లి రైతులు ఏ ఒక్క రోజు రోడ్డెక్కిన దాఖలాలు లేవు. ఉల్లి సాగు ఎక్కువగా ఉండటంతో పాటు వర్షాలు విస్తారంగా పడటం వల్ల దిగుబడి కూడా పెరిగింది. బంగ్లాదేశ్‌తో పాటు వివిధ దేశాలకు ఎగుమతులు అయ్యాయి. జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులకు ధర లభించింది. రికార్డు స్థాయిలో క్వింటా ఉల్లికి రూ.13,500 వరకు ధర లభించింది. ఆ ఐదేళ్లలో ఉల్లి సాగు చేసిన రైతులకు నష్టాల మాటే తెలియదు. బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25పైనే.. ఇక జిల్లాలోనే బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.25పైగా ఉంది. రోడ్లపై రూ.100కు నాలుగు కిలోల ఉల్లి బోర్డుపై రాసి అమ్మకాలు సాగిస్తున్నారు. రైతు బజార్లలోనే కిలో రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు. సూపర్ మార్కెట్లు, మాల్స్‌లో కిలో ధర మరింత ఎక్కువే ఉంటోంది. ఉల్లి పండించే జిల్లాలోనే బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు ఇలా ఉంటే, ఉల్లి పండించని జిల్లాల్లో ధరలు ఏ విధంగా ఉంటాయే ఊహించుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర మాత్రం కిలోకు రూ.12 మాత్రమే కావడం గమనార్హం. మద్దతు ధర ఎప్పుడు అందుతుందో..? ఒకటిన్నర ఎకరాలో ఉల్లి సాగు చేశా. విత్తనాలు కొనడం మొదలు.. పంటను మార్కెట్‌కు తెచ్చే వరకు పెట్టుబడి వ్యయం దాదాపు రూ.2 లక్షల వరకు వచ్చింది. గ్రేడింగ్ చేయగా.. దిగుబడి మాత్రం 100 క్వింటాళ్లు వచ్చింది. ఉల్లిలో నాణ్యత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, వ్యాపారులు క్వింటా రూ.550 ధరతో కొన్నారు. ప్రభుత్వం మాత్రం మద్దతు ధర రూ.1,200 మాత్రమే నిర్ణయించింది. వ్యాపారులు రూ.550 ప్రకారం కొనగా.. మిగిలిన రూ.650 ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. అదీ ఎప్పటికి పడుతుందో తెలియని పరిస్థితి. మద్దతు ధర రూ.1,200 ఏ మాత్రం గిట్టుబాటు కాదు. రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.1.20 లక్షలు చేతికి వస్తోంది. కనీసం రూ.2,000 మద్దతు ధర ఉండాలి. – గోవిందు, బోగోలు, వెల్దుర్తి మండలం పెట్టుబడిలోనే రూ.40 వేల నష్టం రెండు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఎకరాకు రూ.1.10లక్షల ప్రకారం రూ.2.20 లక్షలు పెట్టుబడి పెట్టాం. దిగుబడి రూ.150 క్వింటాళ్లు వచ్చింది. మార్కెట్‌కు తీసుకరాగా.. వ్యాపారులు క్వింటా రూ.320 ప్రకారం కొన్నారు. మద్దతు ధరలో గ్యాప్ అమౌంటు రూ.980 ప్రభుత్వం చెల్లిస్తుందని చెబుతున్నారు. ఎప్పటికి పడుతుందో తెలియని పరిస్థితి. పెట్టుబడి రూ.2.20 లక్షలు పెడితే ప్రభుత్వ మద్దతు ధరతో లెక్కించినా రూ.1.80 లక్షలు మాత్రమే వస్తోంది. పెట్టిన పెట్టుబడిలోనే రూ.40 వేలు నష్టం వస్తోంది. – పాపన్న, దేవనకొండ -
కర్నూలు: ఉల్లి రైతు కంట కన్నీరు
సాక్షి, కర్నూలు: జిల్లాలో రైతులకు ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తోంది. గిట్టుబాటు ధర లేదంటూ ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్నారు. పత్తికొండ రూరల్‌లో పులికొండ రైతు పొలాన్ని దున్నేశారు. టమోటా, ఉల్లి పంటలు తమ కొంప ముంచాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థానికులు ఉల్లి దోపిడీ చేస్తున్నారు. మార్కెట్లోనే రైతులు ఉల్లినివదిలేసి వెళ్తున్నారు. రైతులు వదిలేసి వెళ్లిన ఉల్లిని స్థానికులు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. బైకులపై ఆటోలలో ఉల్లిగడ్డ మూటలను స్థానికులు ఎత్తుకెళ్తున్నారు.పత్తికొండ టమోటా మార్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు టమోటాకు ధర లేక రైతులు బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా లేదని శ్రీదేవి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విత్తనం నుండి విక్రయం దాకా రైతాంగానికి అండగా జగనన్న ఉండేవారని.. రైతులు టమోటాలను రోడ్డుపై పారవేస్తున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గాని స్పందించిన దాఖలాలు లేవంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా టమోటాకు గిట్టు బాటుధర కల్పించాలని శ్రీదేవి డిమాండ్ చేశారు.రైతుల ఆవేదనను పట్టించుకోకుండా గిట్టుబాటు ధర ప్రకటించడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మితే కోత ఖర్చులు కూడా రావంటూ పొలాన్ని రైతులు దున్నేస్తున్నారు. 1200 గిట్టుబాటు ధర సరిపోదంటూ మరింత నష్టాల్లో కూరుకుపోకుండా పత్తికొండ రైతులు.. పంటను దున్నేస్తున్నారు. కనీసం 2500 రూపాయల గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని కొనుగోలు చేయాలని రైతలు డిమాండ్ చేస్తున్నారు. పొలంలో ఉల్లి పంటలు దున్నివేస్తున్న రైతులను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరామర్శించారు. కంగాటి శ్రీదేవితో రైతులు తమ బాధలు వెళ్లబోసుకున్నారు. -
నీకు ఓటేసినందుకు.. మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి
-
చంద్రబాబుపై ఉల్లి రైతులు సంచలన వ్యాఖ్యలు
-
ఉల్లి రైతుకు వాత..మద్దతు ధరకు కోత!?
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి రైతులను నిలువునా ముంచేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అరకొరగా ఉన్న మద్దతు ధరకూ కోత పెడుతూ వారికి తీరని అన్యాయం చేస్తోంది. క్వింటా రూ.1,200 మద్దతు ధరతో నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తామని ప్రకటించిన మూడు రోజులకే చేతులెత్తేస్తోంది. ఈ నెల 1 నుంచి 3 వరకు మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేసింది. ఆ తర్వాత.. ప్రతి లాట్‌ను వ్యాపారులు కొనాల్సిందేనని, వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంతవరకు ఒక్క రైతు బ్యాంకు ఖాతాకు కూడా ఆ వ్యత్యాసం మొత్తం జమ అయిన దాఖలాల్లేవు. పైగా.. ఇప్పుడు మద్దతు ధరను తగ్గించే కుట్రకు శ్రీకారం చుట్టింది. నాణ్యత తక్కువుందన్న సాకుతో మద్దతు ధరను క్వింటాకు రూ.800కు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాణ్యత బాగున్న ఉల్లిని రూ.1,200, నాణ్యతలేని ఉల్లిని రూ.800 ధరతో కొనుగోలు చేయాలనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రానున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెం తీసుకెళ్లండి.. మరోవైపు.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకురావడానికే రవాణా చార్జీల భారంతో రైతులు అల్లాడుతుంటే అధికారుల పిడుగులాంటి వార్త ఉల్లి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడేనికి ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలని అధికారులు సూచించడం వారిని తీవ్రంగా కలవరపెడుతోంది. నిజానికి.. తాడేపల్లిగూడెం మార్కెట్ పూర్తిగా ప్రైవేటుది. రవాణా ఖర్చులు భారీగా పెరుగుతాయి.అన్నీ భరించి తీసుకెళ్లినా అక్కడ రైతులకు అన్యాయం జరిగినా పట్టించుకునే దిక్కుండదు. అదే కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నిత్యం కలెక్టర్, జేసీ, జిల్లా ఎస్పీలతో పాటు విజిలెన్స్, మార్కెటింగ్ శాఖాధికారుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తీసుకెళ్లాలని అధికారులే సూచించడం ఉల్లి రైతుల్లో కలకలం రేపుతోంది. భారీగా కుళ్లిపోతున్న ఉల్లి.. ఇక మద్దతు ధరతో ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ 4,500 టన్నుల ఉల్లి మాత్రమే కొనుగోలు చేసింది. ఇందులో రెండువేల టన్నుల వరకు వివిధ జిల్లాలకు తరలించారు. ఇంకా 2,500 టన్నుల ఉల్లి మార్కెట్ యార్డు, వివిధ గోదాముల్లో నిల్వ ఉంది. ముందస్తు ప్లానింగ్ లేకపోవడంవల్ల ఉల్లి భారీగా కుళ్లిపోతోంది. వివిధ జిల్లాలకు తరలించిన రెండువేల టన్నుల ఉల్లిలో నాణ్యతలేదనే కారణంతో దాదాపు 500 టన్నులు పారబోసినట్లు తెలుస్తోంది. -
'మద్దతు'లేని ఉల్లి రైతు
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లికి మద్దతు ధర దక్కకపోతే ఆ తేడాను తాము రైతుకు ఇస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ రైతుల్లో నమ్మకం కలిగించటంలేదు. ఈ రకంగానే గతంలో మాటలు చెప్పిన చంద్రబాబు రూ.6.5 కోట్లు రైతులకు ఎగ్గొట్టారని వారు గుర్తుచేసుకుంటున్నారు. మరోవైపు మార్కెట్లో వ్యాపారులు ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి వ్యయం కూడా రావడంలేదని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సిండికేట్ అయిన వ్యాపారులు చెప్పిందే ధరగా చలామణి అవుతోంది. మద్దతు ధర రూ.1,200 ఉండగా.. వ్యాపారులు అతి తక్కువ ధరకు మాత్రమే కొంటున్నారు. సోమవారం కర్నూలు మార్కెట్‌కు 157 లాట్ల ఉల్లి వచ్చింది. ఇందులో వ్యాపారులు 20 లాట్లకు మాత్రమే ఈ–నామ్లో ధరలు వేశారు. గరిష్ట ధర రూ.1,089 నమోదైంది. ఒకటి, రెండు లాట్లకు మాత్రమే రూ.వెయ్యికిపైగా ధర వేశారు. కొన్నింటికి కేవలం రూ.500 నుంచి రూ.600 మధ్య ధర వేశారు. 130 లాట్లకు రీటెండరు నిర్వహించారు. రీటెండర్లో కనీస ధర రూ.100గా నిర్ణయించారు. అయినా.. వ్యాపారులు కొన్ని లాట్లు మాత్రమే కొనుగోలు చేశారు. రూ.1,200 ధర గిట్టుబాటు కాదుప్రభుత్వం ప్రకటించిన రూ.1,200 మద్దతు ధర గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఎకరాకు పెట్టుబడి వ్యయం రూ.లక్ష అవుతోంది. ఉల్లిపాయల్ని మార్కెట్‌కు తరలించే ఖర్చు దీనికి అదనం. అధిక వర్షాల వల్ల కుళ్లిపోవడంతో చాలవరకు ఉల్లిని పారబోశారు. ఎకరాకు మిగిలింది 30 క్వింటాళ్ల నుంచి 75 క్వింటాళ్ల వరకు మాత్రమే. వ్యాపారులు రూ.300 నుంచి రూ.600 ధరతో కొంటుండటంతో పెట్టుబడిలో 20–30 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. మద్దతు ధర రూ.2 వేల నుంచి రూ.2,500 వరకు ఉంటేనే కనీసం పెట్టుబడి చేతికొస్తుందని రైతులు చెబుతున్నారు. నాటి మోసం ఎలా మర్చిపోగలం?2016, 2017 సంవత్సరాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి మాదిరిగానే ఉల్లి ధరలు పడిపోయాయి. అప్పట్లో క్వింటాకు కనీస మద్దతు ధర రూ.700గా నిర్ణయించారు. ఈ మద్దతు ధర కంటే తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు గరిష్టంగా రూ.300 బోనస్ చెల్లిస్తామని చెప్పిన అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. వేలాదిమంది రైతులకు ఈ బోనస్‌ను ఎగవేసింది. ఉల్లి రైతులకు ఎగ్గొట్టిన మొత్తం రూ.6.50 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఈ తేడాను బోనస్ రూపంలో ఇస్తామని చెబుతుంటే రైతులు నమ్మలేకపోతున్నారు. గతంలో ఎగవేసిన చంద్రబాబు ఇప్పుడు ఇవ్వడం అనుమానమేనని పేర్కొంటున్నారు. వ్యాపారులతో సంబంధం లేకుండా మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా ప్రభుత్వం కొనుగోలు చేస్తేనే న్యాయం జరుగుతుందని ఉల్లి రైతులు చెబుతున్నారు. 160 ప్యాకెట్ల ఉల్లి పారబోశాం నాలుగెకరాల్లో ఉల్లి సాగుచేశాం. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి ఖర్చయింది. అధిక వర్షాల వల్ల కుళ్లిపోవడంతో పొలంలోనే 160 ప్యాకెట్లు పారబోశాం. 136 క్వింటాళ్లు మార్కెట్‌కు తెచ్చి అమ్మకానికి పెట్టాం. ఉల్లిలో నాణ్యత బాగా ఉంది. అయితే వ్యాపారులు ఉల్లిగడ్డలను కొనుగోలు చేయనేలేదు. ఈ ప్రభుత్వం ఉల్లి రైతులను పూర్తిగా విస్మరించింది. రూ.1,200 ధర ఏమాత్రం గిట్టుబాటు కాదు. – కె.లక్ష్మన్న, కున్నూరు గ్రామం, గోనెగండ్ల మండలం కొనేవారి కోసం ఎదురుచూపులు రెండెకరాల్లో ఉల్లి సాగుచేశాం. ఎకరాకు కోయడానికి రూ.14,500, నాట్లు వేయడానికి రూ.25 వేలు, విత్తనాలకు రూ.10 వేలు.. రసాయన ఎరువులు, పురుగుమందులు, కూలీ, రవాణా చార్జీలు కలిపి ఎకరాకు రూ.లక్షకుపైనే పెట్టుబడి అయింది. మార్కెట్‌కు 255 ప్యాకెట్ల ఉల్లిగడ్డలు తెచ్చి అమ్మకానికి పెట్టగా వ్యాపారులు కొనలేదు. రూ.1,200 ధర గిట్టుబాటు కాదు. మద్దతు ధర కనీసం రూ.2 వేలు ప్రకటించాలి. – రామలింగడు, దైవందిన్నె గ్రామం, ఎమ్మిగనూరు మండలంఉల్లి రైతు కంట కన్నీరు దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో 1,100 నుంచి 1200 ఎకరాల్లో ఉల్లి సాగయింది. మార్కెట్లో ఉల్లి రేటు కనీసం క్వింటా రూ.500–600 కూడా లేకపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొద్ది మంది రైతులు ఉల్లి పంటను పొలాల్లోనే వదిలేస్తుండగా మరికొందరు వేరే పంట వేసేందుకు ఉల్లిని తీసి గట్లపై వేస్తున్నారు. మండలంలోని తెర్నెకల్ గ్రామానికి చెందిన రాముడు అనే రైతు ఉల్లి ధర అమాంతం పడిపోవడంతో దాన్ని గ్రేడింగ్ చేసి మార్కెట్‌కి తరలించాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని, వేరే పంట వేసేందుకు ఉల్లి పీకి గట్లపై వేస్తున్నాడు. ఉల్లి పంట ఎకరాకు తనకు రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా రాలేదని, అప్పులు మిగిలాయని వాపోయాడు. -
ధర లేక దిగాలు
చంద్రబాబు కూటమి సర్కారు బహిరంగంగానే దళారులకు వత్తాసు పలుకుతోంది. ఫలితంగా అటు ఉల్లి, టమాటా, చీనీ రైతులకు పంట కోత ఖర్చులు సైతం రాని దుస్థితి నెలకొనగా, ఇటు బహిరంగ మార్కెట్లో మాత్రం అధిక ధరల మోత మోగుతోంది. రైతు బజార్లలో సైతం ఉల్లి, టమాటా ధరలు మండిపోతున్నాయి. ఇదేం వైపరీత్యం అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు రైతులు, ఇటు వినియోగదారులకు ఏమాత్రం మేలు జరగకపోగా మధ్య దళారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. అయినా ప్రభుత్వం చోద్యం చూస్తోందంటే.. ఇది దళారి రాజ్యం కాక మరేమవుతుంది?సాక్షి, అమరావతి/కర్నూలు (అగ్రికల్చర్): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్, ఇంటర్నేషనల్ కేపిటల్.. ఎయిర్పోర్ట్, ఐకానిక్ బ్రిడ్జ్లంటూ పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేర్లు చెబుతూ డాబుసరి మాటలతో కాలం గడుపుతున్న చంద్రబాబు కూటమి సర్కారు కనీస విషయాలను గాలికొదిలేసి అటు రైతులు, ఇటు ప్రజలను నిలువునా ముంచేస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకుండా దళారులకు వంత పాడుతోంది. ఫలితంగా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులు పండించిన పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కరువైంది.మిరప మొదలుకొని టమాటా వరకు ఏ పంటకూ మద్దతు ధర దక్కక రైతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాభావం, అధిక వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులు ఆదిలోనే ధరలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అదునుకు విత్తనాలతో పాటు యూరియా అందించడంలో విఫలమైన టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధరలు పతనమైనప్పుడు మార్కెట్ ఇంటర్ వెన్షన్ స్కీమ్ కింద జోక్యం చేసుకొని రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోకుండా అసలేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది.సీజన్ ఆరంభంలోనే ఉల్లితో పాటు టమాటా, బత్తాయి (చీనీ) పంటలకు మద్దతు ధర దక్కక రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారు. ఉల్లి, టమాటా రైతులకు కిలోకు రూ.5–8 కూడా దక్కని దుస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి రూ.25–35.. టమాటా రూ.50కి పైగానే పలుకుతోంది. చీనీ రైతుకు కిలోకు రూ.10 లోపే అందుతుండగా.. మార్కెట్లో మాత్రం రూ.50 పలుకుతోంది.పరిస్థితి ఇంత దారుణంగా మారడంతో కష్టాల సుడిగుండం నుంచి ఎలా బయట పడాలో తెలియక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉల్లి రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చావు బతుకుల మధ్య కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.మూణ్ణాళ్ల ముచ్చటగా ఉల్లి కొనుగోళ్లుఉల్లి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం ఆదిలోనే చేతులెత్తేసింది. కర్నూలు మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని క్వింటా రూ.400–500కు మించి కొనే పరిస్థితి లేకపోవడంతో పలువురు రైతులు పంటను మేకలు, గొర్రెలకు మేతకు వదిలేశారు. మరికొంత మంది రైతులు మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని మద్దతు ధర లేదని తెలుసుకుని రోడ్ల పక్కన పారబోసిపోతున్నారు. ఉల్లి రైతుల వెతలపై ఇటీవల ‘సాక్షి‘లో ప్రచురితమైన వరుస కథనాల నేపథ్యంలో చంద్రబాబు నేరుగా సమీక్ష చేసి క్వింటా రూ.1200 చొప్పున కొనుగోలు చేస్తామని గొప్పగా ప్రకటించారు.రైతులు గిట్టుబాటు కాదని మొత్తుకున్నా అదే ధర ఇచ్చారు. రైతులు మార్కెట్‌కు తెచ్చే పంటకు ధర పెరిగే వరకు ఇదే ధరతో కొనుగోలు చేయాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆ ధరకు కూడా మూడు రోజుల పాటు తూతూ మంత్రంగా కొంత మేర మాత్రమే పంట కొనుగోలు చేసి.. తర్వాత చేతులెత్తేశారు. దీంతో ఉల్లికి కనీస మద్దతు ధర కల్పన మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది. రోడ్డునపడ్డ టమాటా మరో వైపు టమాటా రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సగటున కిలోకు రూ.8 కూడా రావడం లేదు. మార్కెట్ ధర మాత్రం భగ్గుమంటోంది. రైతు బజార్లలోనే రూ.35–40తో అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా ప్యాపిలిలో టమాటా రైతులు రవాణా ఖర్చులు కూడా రావడం లేదని రోడ్డు పక్కన పారబోసి పోయారు. డోన్, గుత్తి, అనంతపురం, ప్యాపిలి, పత్తికొండ ప్రాంతాల్లో ఈసారి దిగుబడి పర్వాలేదనిపించినా, ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 30–40 వేల బాక్సులు (ఒక్కో బాక్స్‌లో 25 కిలోలు) ప్యాపిలి మార్కెట్‌కు వస్తుంటాయి.అంటే రోజుకు 500 నుంచి 1,000 టన్నుల వరకు సరుకు వస్తుంది. శుక్రవారం బాక్స్ రూ.150 పలికింది. అంటే కిలో రూ.6కు మించి పలకలేదు. దీంతో రైతులు తెచ్చిన పంటను రోడ్లపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. శనివారం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. శనివారం దాదాపు 20 వేల బాక్సులు మార్కెట్‌కు రాగా, రూ.150 చొప్పున ధర లభించింది. అయితే క్వాలిటీని బట్టి నిర్ధారించిన ధరలో తరుగు పేరిట కనీసం 10 శాతం కోత పెట్టి చెల్లిస్తుండడంతో రైతులు వ్యాపారులపై మండిపడుతున్నారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లోని టమాటా మార్కెట్లలో శనివారం సగటున కిలోకు రూ.10లోపే ధర లభించింది.బత్తాయి రైతు డీలాబత్తాయి రైతుల పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. వైఎస్సార్ కడపతో పాటు అనంతపురం జిల్లాల్లో బత్తాయికి కనీస మద్దతు ధర దక్కడం లేదు. వైఎస్సార్ జిల్లాలో ఫస్ట్ క్వాలిటీ బత్తాయికి మాత్రమే క్వింటాకి రూ.1,520 దక్కుతుండగా, రెండో రకానికి రూ.900, థర్డ్ క్వాలిటీకి రూ.600కు మించి ధర లభించడం లేదు. అనంతపురం మార్కెట్లో ఫస్ట్ రకానికి రూ.1,600 దక్కుతుండగా, సెకండ్ క్వాలిటీకి రూ.1,200, థర్డ్ క్వాలిటీకి రూ.600–800 మధ్య ధర పలుకుతోంది.మార్కెట్‌కు వచ్చే బత్తాయిలో మూడింట రెండొంతుల సరుకుకు క్వాలిటీ లేదనే సాకుతో క్వింటా రూ.600–800కు మించి చెల్లించని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఏ పట్టణంలో చూసినా బహిరంగ మార్కెట్లో బత్తాయి కిలో రూ.50కి తక్కువ లేదు. కానీ రైతుకు మాత్రం కిలోకు రూ.6–8 మధ్యే ధర లభించడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చింది 20 వేల క్వింటాళ్లు.. కొన్నది 4 వేల క్వింటాళ్లేప్రభుత్వ ఆధ్వర్యంలో ఉల్లి క్రయవిక్రయాలు జరిగే ఏకైక మార్కెట్ కర్నూలు మాత్రమే. రాష్ట్రంలో పండించే ఉల్లిలో 90 శాతం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ప్రతి లాట్‌కు వ్యాపారులు ఈ–నామ్లో ధరలు కోట్ చేస్తారు. ఎవరు ఎక్కువ ధర వేస్తే వారికి లాట్ ఇస్తారు. ఉదాహరణకు క్వింటాకు రూ.800 ధర లభిస్తే.. మద్దతు ధరతో గ్యాప్ అమౌంటు రూ.400 ప్రభుత్వం రైతుల ఖాతాలకు విడుదల చేయాలి. అయితే ప్రభుత్వమే నేరుగా మార్క్‌ఫెడ్ ద్వారా రూ.1,200 ధరతో కొనుగోలు చేస్తే రైతులకు కమీషన్ భారం తగ్గుతుంది. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దిక్కు లేకుండా పోయింది.దీంతో క్వింటా ఉల్లిని దళారులు రూ.400 ధరతో కొనేందుకు ముందుకొచ్చారు. ఈ ధరతో అమ్మితే ఎకరం పంటకు వచ్చే మొత్తం రూ.16 వేలు మాత్రమే. పెట్టుబడి మాత్రం ఎకరాకు రూ.80 వేలు అయ్యింది. ఈ లెక్కన పెట్టుబడిలో 20 శాతం కూడా రావడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. శనివారం 302 మంది రైతులు 20 వేల క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు తెచ్చారు. ప్రభుత్వ అనధికార ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ ద్వారా ఉల్లి కొనుగోళ్లు ఆపేసింది. దీంతో వ్యాపారులు కేవలం 54 లాట్లకు సంబంధించిన 4,127 క్వింటాళ్లకు మాత్రమే తక్కువ ధరతో టెండర్లు వేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై రైతులు కర్నూలు మార్కెట్ యార్డు ఎదుట పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.అయ్యో ఎంత కష్టం.. ఎంత నష్టం!కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం ఎరుకలచెరువు గ్రామానికి చెందిన మొలక బజారి అనే రైతు రెండు ఎకరాల్లో ఉల్లి పంటను సాగు చేశాడు. చీడపీడల నుంచి కంటికి రెప్పలా కాపాడుకుని పంట పండించాడు. పంట కోశాక.. మార్కెట్లో కనీసం కిలోకు రూ.5–6 కూడా రావడం లేదని తెలుసుకుని ఆందోళనకు గురయ్యాడు. రవాణా ఖర్చులు కూడా దండగ అని భావించి పంటను పొలంలోనే వదిలేయడంతో గొర్రెలకు ఆహారంగా మారింది. పంటసాగు కోసం పెట్టిన పెట్టుబడులు మట్టిలో కలిసిపోయాయి. – కృష్ణగిరివైఎస్ జగన్ హయాంలో అన్నదాతకు భరోసా⇒ వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడమే కాకుండా, ధర లేని ప్రతీసారి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకొని ఆ పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఉల్లికి కనీస మద్దతు ధరను ప్రకటించింది. ⇒ బహిరంగ మార్కెట్లో ధర లేని సమయంలో ప్రభుత్వమే దాదాపు రూ.65 కోట్లు ఖర్చు చేసి దాదాపు 9025 టన్నుల ఉల్లిని సేకరించింది. ఈ ఉల్లిని రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ధరలపై విక్రయించి అటు రైతులకు, ఇటు వినియోగదారులకు అండగా నిలిచింది. మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లి కొనుగోలు చేసి, సబ్సిడీపై రైతు బజార్ల ద్వారా సరఫరా చేసి వినియోగదారులకు ఊరట కలిగించింది.⇒ ఇదే రీతిలో దాదాపు రూ.5.50 కోట్ల విలువైన 4,109 టన్నుల బత్తాయిని కొనుగోలు చేసి డ్వాక్రా సంఘాల సభ్యులకు సబ్సిడీ ధరకు పంపిణీ చేయించింది. రూ.18.02 కోట్ల విలువైన 8,460 టన్నుల టమాటాను సైతం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచింది.⇒ ఇలా ఐదేళ్లలో 6.20 లక్షల మంది రైతుల నుంచి రూ.7,796.47 కోట్ల విలువైన 21.73 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి అన్నదాతకు భరోసా కల్పించింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1,789 కోట్ల విలువైన పత్తిని సైతం కొనుగోలు చేసింది.ఉల్లి.. సర్కారు లొల్లి⇒ సీఎం డౌన్ డౌన్ అంటూ అన్నదాతల రాస్తారోకో ⇒ క్వింటాకు రూ.1,200 అని మాట తప్పిన ప్రభుత్వం⇒ మద్దతు ధర కల్పించకపోవడంపై వెల్లువెత్తిన ఆగ్రహం⇒ మద్దతు పలికిన వైఎస్సార్సీపీ నేతలుకర్నూలు (అగ్రికల్చర్) : కూటమి ప్రభుత్వం ఉల్లిని మద్దతు ధరతో కొనుగోలు చేయలేక చేతులెత్తేయడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కర్నూలులో వందలాది మంది రైతులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డెక్కారు. మార్కెట్ యార్డు ఎదురుగా ప్రధాన రహదారిలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడం లేదంటూ రోడ్డుపై ఉల్లిపాయలు పారబోసి బైఠాయించారు. ఇటు ప్రభుత్వం మద్దతు ధరకు కొనక పోవడం, అటు వ్యాపారులు సైతం రేటు పెంచక పోవడంతో అన్నదాతలు తీవ్రంగా మండిపడ్డారు. మద్దతు ధరతో కొనుగోళ్లకు ప్రభుత్వం మంగళం పాడడంతో వ్యాపారులు కొనడానికి ముందుకు రాలేదు.36 మంది వ్యాపారులు ఉండగా.. కేవలం 10 మంది మాత్రమే అదీ క్వింటా రూ.600తో కొనుగోళ్లు చేపట్టారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి సీఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు చేశారు. కూటమి పార్టీలకు ఓట్లు వేసి గెలిపించినందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని ధ్వజమెత్తారు. రైతుల ఆందోళనకు వైఎస్సార్సీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు ఎస్వీ మోహన్‌రెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి మద్దతు పలికారు. రైతులతో పాటు రోడ్డుపై బైఠాయించి ఉల్లి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ప్రభుత్వ ప్రకటనతో తీవ్ర వ్యయ ప్రయాసలకు లోనై మార్కెట్‌కు వచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. క్వింటా రూ.2500తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఉల్లిని ప్రభుత్వం కొనలేదు.. వ్యాపారులతోనే కొనిపించండి’ అంటూ ప్రభుత్వం మార్కెట్ కమిటీకి ఆదేశాలు ఇవ్వడాన్ని బట్టి చూస్తే రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం అవుతోందన్నారు. కాగా, ఆదివారం కొనుగోళ్లు కొనసాగేలా చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.చెప్పేదొకటి.. చేస్తోంది మరొకటికర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం ఈర్లదిన్నె గ్రామానికి చెందిన జమ్మన్న మూడు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. ఎకరాకు పెట్టుబడి రూ.లక్ష వరకు పెట్టారు. ప్రభుత్వం క్వింటా రూ.1,200 చొప్పున కొంటుందని ప్రకటించడంతో మార్కెట్‌కు 249 ప్యాకెట్ల ఉల్లి తెచ్చారు. ఈ ధరతో కాదు కదా.. ఇందులో సగం ధరతో కూడా కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక్కడికొచ్చిన రైతులందరిదీ ఇదే దుస్థితి. ఎవరిని కదిలించినా ఈ ప్రభుత్వం చెప్పేదొకటి.. చేస్తోంది మరొకటని కన్నీటిపర్యంతమవుతున్నారు.అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్యవెల్దుర్తి/రుద్రవరం: రాష్ట్రంలో అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. శనివారం వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం ఎస్.పేరేములకు చెందిన ముంత మద్దిలేటి(50) తన 2 ఎకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది పంట సాగు చేస్తున్నాడు. పెట్టుబడుల కోసం మొత్తం రూ.6 లక్షలు అప్పులు చేశాడు. గతేడాది పత్తి, ఆముదాలు వేసి దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే దారి కానరాకపోవడంతో శుక్రవారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.ఇదిలా ఉండగా, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం కోటకొండకు చెందిన జంగిటి నారాయణ(46) తన ఐదెకరాలకు తోడు, మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా దిగుబడులు సరిగా రాక, వచి్చనా ప్రభుత్వం గిట్టబాటు ధర కలి్పంచకపోడంతో రూ.20 లక్షల దాకా అప్పు అయ్యింది. దీంతో తీవ్ర మనోవేదనతో గతనెల 28న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.ఇద్దరు ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నంసి.బెళగల్: ఉల్లి పంటకు కనీస ధర కూడా దక్కని దుస్థితిలో కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలం పోలకల్‌లో ఇద్దరు రైతులు ఆత్మహత్యకు యత్నించారు. గ్రామంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న గుండ్లకొండ కృష్ణ (34) తన రెండెకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఒక ఎకరంలో 120 బస్తాల పంట గత వారం చేతికి వచ్చింది. అయితే మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని తెలిసి ఆవేదన చెందాడు. అప్పటికే పెట్టుబడికి చేసిన అప్పులు అధికమవడంతో మరో ఎకరంలోని పంట కోత చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పొలంలోనే వదిలేశాడు. దాదాపు రూ.8 లక్షల వరకు అప్పులు పెరగడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.ఇదే గ్రామానికి చెందిన మరో రైతు వెంకట్‌నాయుడు (25) తనకున్న రెండు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాడు. ఎకరం పంట కోతకు రావడంతో గత వారం కోతలు చేపట్టి, తన సమీప బంధువు కృష్ణ దిగుబడులు ఉంచిన దగ్గరే నిల్వ చేశాడు. ధరలు లేక మరో ఎకరం పొలంలో కోతకు వచ్చిన పంటను అలానే వదిలేశాడు. ఇప్పటికే దాదాపు రూ.6 లక్షల వరకు అప్పులు ఉండగా, పంట నష్టాలతో రూ.7 లక్షలకు పైగా అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు.సీఎం చంద్రబాబు ఉల్లి రైతులను ఆదుకోవడం లేదని అందుకే తాము ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అనంతరం పురుగుల మందు తాగారు. ఇరు కుటుంబాల వారు బాధితులిద్దరినీ వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి బాధిత రైతులను శనివారం ఆస్పత్రిలో పరామర్శించారు. -
ఆదేశాలు సరే... విధివిధానాలేవి?
కర్నూలు (అగ్రికల్చర్): ఇదుగో ఉల్లి రైతులను ఆదుకుంటున్నాం.. వెంటనే క్వింటా రూ.1,200కు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నానని ఈనెల 28న మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఇది జరిగి మూడ్రోజులైనా ఉల్లి కొనుగోలుపై జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఆదేశాలుగానీ, విధి విధానాలుగానీ రాలేదు. దీంతో రైతులు ఉసూరుమంటున్నారు. ఆగస్టు నెల మొత్తం వర్షాలు కురవడంతో ఉల్లి పంట భారీగా దెబ్బతింది. ఫలితంగా నాణ్యతలేదనే కారణంతో వ్యాపారులు కొనుగోలు చేయడంలేదు. దీంతో.. రైతులు ఉల్లిగడ్డలను పొలాల్లోనే పశువులు, గొర్రెలు, మేకలకు వదిలేస్తున్నారు. ఇలా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజూ 150 క్వింటాళ్లపైనే ఉల్లి కుళ్లిపోతోంది.మిర్చి, పొగాకుపైనా సీఎం ఇదే హంగామానాలుగైదు నెలల క్రితం కూడా మిర్చిని కొంటామని ముఖ్యమంత్రి హంగామా చేశారు. మిర్చి రైతులు, వ్యాపారులతో గంటల తరబడి సమీక్ష నిర్వహించారు. మిర్చి కొనుగోలుపై కేంద్ర మంత్రితోనూ చర్చించామన్నారు. అనంతరం క్వింటాకు రూ.12వేల మద్దతు ధరతో కొంటామన్నారు. కానీ, ఇందుకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు, జీఓలు రాలేదు. ఫలితంగా ఒక్క మిర్చి రైతుకు కూడా న్యాయం జరగని పరిస్థితి. విధిలేని పరిస్థితుల్లో రైతులు అతితక్కువ ధరకే అమ్ముకుని నష్టపోయారు.అలాగే, మొన్నటికి మొన్న పొగాకు రైతులను ఆదుకుంటామని, మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని హడావుడి చేశారు. అయినా ఒక్క క్వింటా పొగాకు కూడా కొనలేదు. దీంతో.. 2024–25లో పండించిన పొగాకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 46 వేల క్వింటాళ్లు రైతుల దగ్గర ఉండిపోయింది. మరోవైపు.. రైతుల కోసం సీఎం కష్టపడుతున్నారని అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటారు. కానీ, విధి విధానాలు, జీవోలు మాత్రం రావడంలేదు. ఇప్పుడు ఉల్లి రైతుల వంతు వచ్చింది. వచ్చే వారం పదిరోజుల్లో దాదాపు 6 వేల టన్నుల ఉల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యమంత్రి చెప్పారు కదా.. రెండు, మూడ్రోజులు చూద్దాం అని కొందరు రైతులు కోతలు వాయిదా వేస్తున్నారు. కనీసం రూ.2 వేల ధరతోనైనా కొంటేనే రైతులకు పెట్టుబడి దక్కుతుందని వారంటున్నారు. కానీ క్వింటాకు రూ.1200పైనే అని ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఇది కూడా బాబు డ్రామానే అని రైతులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. శనివారం మార్కెట్‌కు 38 మంది రైతులు 1,289 క్వింటాళ్ల ఉల్లిగడ్డలు తెచ్చారు. ఇలా అతి తక్కువగా వచ్చిన ఉల్లిని కూడా నాణ్యత బాగోలేదని వ్యాపారులు కొనకపోవడంతో రైతులు ఉసూరుమంటున్నారు.క్వింటాకు రూ.708 వచ్చింది.. ఈసారి ఒకటిన్నర ఎకరాల్లో ఉల్లి సాగుచేశాం. పెట్టుబడి రూ.1.20 లక్షల వరకు పెట్టాం. అర ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి అయింది. బస్తా ఎరువు ధర రూ.1,900. ప్రస్తుతం అర ఎకరాలో ఉల్లి గడ్డలు తెంపుకుని మార్కెట్‌కు వచ్చాం. 31.50 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మార్కెట్‌కు తీసుకొస్తే క్వింటాకు రూ.708 మాత్రమే లభించింది. పంటను అమ్మగా రూ.22,302 వచ్చింది. ఇందులో హమాలీ ఖర్చులు, కమీషన్ ఏజెంటు కమీషన్ మినహాయిస్తే రూ.20 వేల వరకు మాత్రమే మిగులుతోంది. అంటే.. రూ.20 వేల వరకు నష్టం. – చంద్రయ్య, పెనుమాడ, క్రిష్ణగిరి మండలం -
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి
సాక్షి, అమరావతి: ఉల్లి ధరలు రోజురోజుకీ పతనమవుతున్నాయి. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి బస్తాల మేటలు పేరుకుపోతుండగా.. కోత ఖర్చులు కూడా రాక అనేకమంది రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లోని పంటను మేకలు, గొర్రెలకు మేతగా వదిలేస్తున్నారు. నాలుగు రోజులుగా మార్కెట్‌కు వస్తున్న ఉల్లిని కొనేవారు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. మార్కెట్‌కు వస్తున్న పంటలో నాలుగో వంతు సరుకును కూడా కొనేవారు లేరు. గురువారం కర్నూలు మార్కెట్‌కు 3,980 క్వింటాళ్ల ఉల్లి రాగా.. వెయ్యి టన్నుల కూడా ట్రేడర్లు కొనుగోలు చేయలేదు. దీంతో మార్కెట్‌కు తెచ్చిన పంటను తిరిగి తీసుకెళ్లలేక అక్కడే వదిలేస్తున్నారు. గురువారం కనిష్ట ధర క్వింటా రూ.520 పలకగా.. గరిష్టంగా రూ.1,149 లభించింది. అమ్ముడైన లాట్లలో 95 శాతం ఉల్లికి క్వింటాల్‌కు రూ.500–600 మించి ధర దక్కలేదు. క్వాలిటీ లేదనే సాకుతో వ్యాపారులు ధఱ తగ్గించేస్తున్నారు. కాగా.. రాష్ట్రంలోని రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.24–26 తక్కువకు దొరకడం లేదు. కర్నూలు మార్కెట్ యార్డులో మాత్రం రైతులకు కిలో రూ.2 నుంచి రూ.4 మాత్రమే ఇస్తున్నారు. రూ.1,200 తక్కువ కాకుండా కొనండి: సీఎం రైతుల నుంచి క్వింటాల్ ఉల్లిని రూ.1,200కు తక్కువ కాకుండా తక్షణమే కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించిన సీఎం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ నుంచి నష్టాన్ని భరించాలని, కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఆరబెట్టి రైతు బజార్లకు పంపిణీ చేయాలన్నారు. ఉల్లికి మంచి ధర వచ్చేవరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలన్నారు. ఉల్లి రైతులను గాలి కొదిలేస్తారా?తాడేపల్లిగూడెం: కర్నూలు ఉల్లి రైతులు ధర దక్కక సంక్షోభంలో కూరుకుపోతే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి అన్ని రకాలుగా ఆదుకుందని గుర్తు చేశారు. కర్నూలు ప్రాంత ఉల్లి రైతులు పంటను మార్కెట్‌కు తీసుకొచ్చినా కనీస ధర కూడా దక్కడం లేదన్నారు. దీంతో ఉల్లి పంటను పశువులకు మేతగా వదిలేస్తున్నారన్నారు.మార్కెటింగ్ శాఖ ద్వారా ప్రభుత్వం కర్నూలు ఉల్లికి కనీస మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర దక్కేవరకు ఉల్లి రైతుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. -
ఉల్లి రైతుల గోడు పట్టదా చంద్రబాబూ: ఎస్వీ మోహన్‌రెడ్డి
సాక్షి, కర్నూలు: ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు. కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించి కనీస ధర లేక అల్లాడుతున్న ఉల్లి రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా పలువురు ఉల్లి రైతులు తమ కష్టాలను ఆయనకు వివరించారు.వారం రోజులుగా మార్కెట్లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు వాపోయారు. రైతులకు వైఎస్సార్సీపీ తరుఫున అండగా ఉంటామని, ఈ ప్రభుత్వం మెడలు వంచి అయినా సరే ఉల్లి కొనుగోళ్ళు జరిగేలా చూస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు. ఉల్లి రైతులతో కలిసి ప్రభుత్వం తక్షణం స్పందించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కర్నూలు మార్కెట్ యార్డ్‌లో ఉల్లి రైతులు తమ పంటను అమ్మకునేందుకు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. గతంలో క్వింటా రూ.3 వేల నుంచి రూ.5 వేల రేటు పలికేది. తక్కువ నాణ్యత ఉన్న పంట క్వింటా కనీసం రూ.1800 నుంచి రూ.2000 పలికేది. కానీ ఈ ఏడాది వంద రూపాయలు కూడా పలకడం లేదు. రైతులకు ఒక్కో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు పెట్టుబడి వ్యయం అవుతోంది. ఎకరాకు వంద క్వింటాళ్ళు దిగుబడి వస్తే, క్వింటాకు రూ.100 చొప్పున కనీసం రూ.10 వేలు కూడా వారికి దక్కడం లేదు. ఒక్కో రైతు దాదాపుగా లక్ష రూపాయలు ఎకరానికి నష్టపోతున్నారు...వారం రోజుల నుంచి ఒక్కో రైతు ఉల్లిగడ్డలతో వచ్చి కొనేవారు లేక నిరీక్షిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ ఏ పంటకైనా రేటు లేకపోతే ప్రభుత్వం తరుఫు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేశారు. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో కనీసం రైతును పరామర్శించే వారు లేరు. అప్పులు చేసి ఉల్లి సాగు చేసిన రైతులు, అప్పుల తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. దయచేసి రైతులు ఇటువంటి పనులు చేయవద్దని, వారి తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలియచేస్తున్నాం...రైతులకు కష్టం వచ్చినప్పుడు స్పందించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదా? గతంలో మిర్చి, మామిడి, పొగాకు ఇలా ఆయా పంటల కోసం రైతుల కోసం వైఎస్ జగన్ నిలబడ్డారు. వైఎస్సార్సీపీ తరుఫున దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్ప వారిలో చలనం రాలేదు. నేడు కూటమి ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులకు రైతుల గోడు పట్టదా? కనీసం మార్కెట్ యార్డ్‌కు వచ్చి రైతు కష్టాన్ని తెలుసుకునే తీరిక కూడా వారికి లేదా? బయట మార్కెట్లో కిలో ఉల్లి రూ.30కి అమ్ముతున్నారు. కానీ రైతుల నుంచి మాత్రం క్వింటా రూ.100కి కొంటామని వ్యాపారులు చెబుతుంటే ఎలా ఉపేక్షిస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. తక్షణం ప్రభుత్వం స్పందించి, మద్దతుధరకు ఉల్లి కొనుగోళ్ళు చేపట్టాలి. లేనిపక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం. -
కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళన
కర్నూలు: కర్నూలు వ్యవసాయం మార్కెట్లో ఉల్లి రైతులు ఆందోళన చేపట్టారు. తమక కనీస మద్దతు ధర కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టారు. ఉల్లికి సరైన గిట్టుబాట ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తెచ్చిన ఉల్లిని క్వింటాకు రూ. 200 నుండి రూ. 400 వరకూ మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆందోళనకు దిగారు. తమ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి మద్దతు ధర లేక అప్పులు పాలు అవుతున్నామని రైతులు వాపోతున్నారు. కనీస మద్దతు ధర రూ. 2 వేలు కల్పించాలని అంటున్నారు. దాంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లి కొనుగోలు ప్రారంభం కాలేదు. తక్షణమే ఉల్లి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరొకవైపు ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి గ్రామంలో ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లికి మద్దతు ధర లేదని కన్నీరు పెట్టుకుంటున్నారు. -
Andhra Pradesh: ఉల్లి రైతు గుల్ల!
సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన పంటను దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి రావడం... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో హతాశులవుతున్నారు. ఒకపక్క బయట మార్కెట్లో ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మరోపక్క రైతన్నలు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నాడు. వెరసి అటు వినియోగదారులకు ఇటు అన్నదాతలకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి పంటకు పేరుపొందిన కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేక నష్టపోతుంటే వైఎస్సార్ కడప జిల్లాలో గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్నారు.1.72 లక్షల ఎకరాల్లో సాగు..రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 70 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఆ తర్వాత వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది. ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఖరీఫ్ సీజన్లో కర్నూలు, అనంతపురం జిల్లాలలో మినహా మిగిలిన చోట్ల అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి. అలాగే ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో రైతులు తమకు మంచి ధర వస్తుందని ఆశగా ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగుచేశారు. తీరా పంట మంచిగా ఎదిగే సమయంలో వర్షాభావంతోపాటు భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురై 30 నుంచి 40 శాతం వరకు దెబ్బతిన్నది. అయినా మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర ఉండటంతో మిగిలిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూశారు. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటం, సౌకర్యాల లేమితో మార్కెట్‌కు తీసుకువెళ్లిన పంట దెబ్బతినడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. కోతలు మొదలైనప్పటి నుంచి కష్టాలుకోతకొచ్చిన పంట మార్కెట్‌కు రావడం మొదలైన దగ్గర నుంచి ఉల్లి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన విస్తీర్ణం, దిగుబడులను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈనామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు తోడు కాటాలు, కూలీల కొరత ఉల్లి రైతుల ఆశలను దెబ్బతీసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రోజుకు 26 వేల క్వింటాళ్ల పంట వస్తుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్లో పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. సర్వర్ సమస్యల కారణంగా టెండర్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో టన్నుకు 50–100 కేజీల వరకు ఉల్లి దెబ్బతినడంతో ఆ మేరకు నష్టపోయారు. కర్నూలు యార్డు పరిధిలో ఈ సీజన్లో గరిష్టంగా క్వింటాకు రూ.4,300 ధర లభించగా, సగటున రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున ధర లభించింది.రోజు విడిచి రోజు విక్రయాలుఈనామ్లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు వారం పట్టింది. అదేవిధంగా వాహనాలు, కాటాలు సమకూర్చలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజు విడిచి రోజు ఉల్లి విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైఎస్సార్ జిల్లాలో 15 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగవుతోంది. వర్షాల వల్ల పంట దెబ్బతింది. క్వాలిటీ లేదనే సాకుతో ఇక్కడ క్వింటాకు గరిష్టంగా రూ.1,500 ధర లభించగా, సగటున రూ.వెయ్యికి మించి దక్కడం లేదు.ఉల్లి రైతుకు అండగా జగన్ సర్కారుఒక జిల్లాలో ఒక పంట పథకం కింద ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీ యుటిలిటీ కేంద్రాలను నిర్మించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ఉత్పత్తిదారుల సంఘాలకు 75% సబ్సిడీతో సోలార్ పాలీ డ్రయర్లు, వాహనాలు, 50% సబ్సిడీపై ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, ఉల్లి సీడ్ డిబ్లర్స్తో 40% సబ్సిడీపై సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లను గత ప్రభుత్వం సమకూర్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధర ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంది. ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా అండగా నిలిచింది. గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.13 వేలకు పైగా ధర లభించింది. కిలో రూ.2 నుంచి రూ.4 మించి ధర లేని సమయంలో కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ లెక్కన టన్నుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా వెచ్చించింది. ఇలా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, 2014–19 మధ్య టీడీపీ హయాంలో కేవలం రూ.6.38 కోట్లు వెచ్చించి 4,900 టన్నుల ఉల్లిని మాత్రమే కొన్నారు. -
పెట్టుబడి ఖర్చులూ రాకపాయె..ఇలాగైతే బతికేదెట్టా సారూ..?
సాక్షి ప్రతినిధి, కడప: సార్...! మీరేమని దిగిపోయారో...! రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. ఈసారి ఉల్లి దిగుబడి బ్రహ్మాండంగా ఉంది. కానీ వచ్చే డబ్బులు పంట కోత ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వీరపునాయునిపల్లె మండలం ఈర్లపల్లెకు చెందిన రైతు బైరెడ్డి ఉత్తమారెడ్డి ఇటీవల తాడేపల్లెగూడెం మార్కెట్లో 22 టన్నులు విక్రయించగా రూ.42 వేలు వచ్చాయి. అందులో రూ.36 వేలు రవాణా ఖర్చే అయింది. దారి ఖర్చులకు మిగిలిన మొత్తం అయిపోయింది. చేసేది లేక ఉత్తమారెడ్డి కన్నీళ్లతో ఇల్లు చేరుకున్నాడు. మా అందరి పరిస్థితి ఇలాగే ఉంది.సరిగ్గా ఏడాది క్రితం అదే 22 టన్నులు విక్రయిస్తే ఉల్లి రైతుకు రూ.4.5 లక్షలు లభించేవి. ఇప్పుడు ఇటు మాకు, అటు వినియోగదారులకు కూడా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తున్నా జోక్యం చేసుకుని ఆదుకోవాలన్న స్పృహ కూటమి సర్కారులో కానరావడం లేదు... అంటూ బుధవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వీరపునాయునిపల్లె మండలానికి చెందిన ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.వారి దుస్థితి చూసి చలించిపోయిన వైఎస్ జగన్, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, రైతులను ఆదుకోవాలన్న స్పృహ అంతకంటే లేదని మండిపడ్డారు. మన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నామని, అవస్థలు ఎదుర్కొన్న టమోటా రైతులకు కూడా భరోసా కల్పించామని గుర్తు చేశారు. ధైర్యంగా ఉండాలని, మళ్లీ మంచి రోజులు రానున్నాయని రైతులను ఊరడించారు.పట్టించుకునేవారు లేరుఉల్లి రైతుల గోడు పట్టించుకునేవారే లేరు. ఒకపక్క ధరలు లేవు. మరోపక్క నిల్వ చేసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా పరిషత్ మీటింగ్‌లో అభ్యర్థించినా ఎలాంటి స్పందన లేదు. రైతులకు లారీ బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. – కె రఘునాథరెడ్డి, జెడ్పీటీసీరైతులు కుంగిపోతున్నారునాలుగు నెలల పాటు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. దళారీ వ్యవస్థ మార్కెట్‌ను శాసిస్తోంది. క్వింటా రూ.వెయ్యికి మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. దళారీల చర్యలతో రైతులు కుంగిపోతున్నారు. ప్రభుత్వమే ఉల్లిగడ్డలు సేకరించి వినియోగదారుడికి సరఫరా చేయాలి. రైతులను తక్షణమే ఆదుకోవాలి. – ప్రతాప్‌రెడ్డి, మిట్లపల్లెపెట్టుబడి రాయితీ ప్రకటించాలి ఇటీవల వర్షాల వల్ల ఉల్లిగడ్డలకు కుళ్లు సోకుతుందని రైతులంతా పంట నూర్పిడి చేశారు. మార్కెట్లో ధరలు దారుణంగా తగ్గిపోయాయి. నెల క్రితం వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం అమాంతం పడిపోయాయి. పెట్టుబడులు అటుంచితే నూర్పిడి ఖర్చులు కూడా రాలేదు. రైతుల శ్రమ వృధాగా మారింది. ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ప్రకటించి ఆదుకోవాలి. – వీరయ్య, ఓబుళరెడ్డిపల్లె -
ఉల్లి రైతుకు ప్రోత్సాహకాలు ఇవ్వడంలేదంటూ ఈనాడు అసత్య కథనం
-
ఉల్లి రైతుకు మేలు చేస్తున్నా కంటగింపు రాతలేనా?
కర్నూలు (అగ్రికల్చర్): ఉల్లి రైతుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా రామోజీరావుకు కనబడటంలేదు. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విషం చిమ్ముతూ.. చంద్రబాబును ఆహా, ఓహో అని పొగిడేస్తూ ‘ఉల్లిరైతుకు వెన్నుపోటు’ అంటూ అసత్యాలతో నిండిన కథనాన్ని ఈనాడు అచ్చేసింది. చంద్రబాబు హయాంలో తాము పడిన ఇబ్బందులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమకు ఇస్తున్న ప్రోత్సాహం ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే వెల్లడిస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఒక్క పైసా ప్రీమియం చెల్లించనక్కర్లేకుండానే బీమా మొత్తం తమకు అందిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి పంటతో తాము నష్టపోలేదని స్పష్టం చేస్తున్నారు. 2014–15 నుంచి 2018–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి 3.10 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయించడం ఒట్టి అబద్ధమని ఈనాడు రాతలను కొట్టిపారేస్తున్నారు. ఇక వర్షాభావం వల్ల పంట సాగు ఆలస్యమైతే.. రైతులే సాగును మానేస్తున్నారని రాయడాన్ని వారు తప్పు పట్టారు. రూ. 118.05 కోట్ల బీమా చెల్లింపు టీడీపీ హయాంలో బీమా కోసం 5 శాతం ప్రీమియం చెల్లించి, ఉల్లి సాగు చేసినట్లు మండల వ్యవసాయాధికారి నుంచి సాగు ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి వచ్చేది. అయినా ఉల్లి రైతులకు టీడీపీ పాలనలో ఒక్క రూపాయి కూడా బీమా లభించలేదు. కానీ ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రెండేళ్లలో ఒక్క రూపాయి ప్రీమియం లేకుండానే ఈ–క్రాప్‌లో నమోదును ప్రామాణికంగా తీసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉల్లి పంటకు రూ.118.05 కోట్ల బీమా రైతులకు అందింది. మొదటి సారి బీమా పొందామని ఉల్లి రైతులు సంతోషంగా చెబుతున్నారు. ఏటికేడు పెరుగుతున్న సాగు.. ♦ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2019–20 నుంచి 2023–24 వరకు పరిశీలిస్తే ఉల్లి సాగు ఏటికేడు పెరుగుతూనే ఉంది. 2019–20లో 75,525, 2020–21లో 73,708, 2021–22లో 80,719, 2022–23లో 87,453 ఎకరాల్లో ఉల్లి సాగు కావడం విశేషం. దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 41,382 ఎకరాల్లో ఉల్లి సాగు అయింది. వర్షాలు పడుతుండటంతో సాగు ముమ్మరమైంది. ♦ గత మూడేళ్లుగా రైతులు లాభాలనే ఆర్జించారు. 2022–23లో రెండు, మూడు నెలలు మినహా అన్ని నెలల్లో మద్దతు ధర రూ. 770 కంటే ఎక్కువ ధరలే లభించాయి. ♦ ఉల్లి నిల్వ కోసం గోదాములు నిర్మిస్తున్నారు. రాయితీపై విత్తనాలు సరఫరా చేస్తున్నారు. ఎంఐడీహెచ్ కింద 75 శాతం సబ్సిడీతో ఉల్లి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కలెక్షన్ సెంటర్లు మంజూరు చేస్తోంది. ♦ 35 శాతం సబ్సిడీతో సోలార్ డ్రైయర్ల ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 120 పనిచేస్తున్నాయి. వచ్చే మూడు నెలల్లో మరో 3 వేలు ఏర్పాటు కానున్నాయి. రూ. 30,600 బీమా లభించింది గతేడాది మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. ఈ–క్రాప్‌లో నమోదు అయింది. ఒక్క రూపాయి ప్రీమియం లేకుండానే బీమా అమలైంది. దిగుబడి తగ్గడం వల్ల ఎకరాకు రూ. 10,200 ప్రకారం 3 ఎకరాలకు రూ. 30,600 బీమా లభించింది. గతంలో బీమా చేసుకోవాలంటే 5 శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉండేది. గతంలో ఎపుడూ బీమా లభించలేదు. మొదటిసారిగా బీమా లభించడం పట్ల ఆనందంగా ఉంది. ఇక పంటకు సరాసరి రూ. 900 ప్రకారం ధర లభించింది. బీమా వల్ల నష్టం నుంచి బయటపడ్డాం. – దిన్నె మహేశ్వరరెడ్డి, ఏ.గోకులపాడు, కల్లూరు మండలం -
ఉల్లి,పత్తి రైతులకు సముచిత పరిహారం
కడప సెవెన్‌రోడ్స్: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జిల్లాలో ఉల్లి, పత్తి పంటలు కోల్పొయిన రైతులకు సముచిత పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించారు. ఎన్యుమరేషన్ నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని ప్రభుత్వానికి నివేదించనున్నట్లు జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి తెలిపారు. వేసవిలో గ్రామాలకు తాగునీరు రవాణా చేసినందుకు రూ. 7.57 కోట్ల నిధులు విడుదల చేయాలనితీర్మానించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై జెడ్పీ సభ్యులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి సచివాలయాన్ని మొబైల్ యూనిట్లు నెలలో రెండుసార్లు సందర్శిస్తాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న జగనన్న ఇళ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ రహదారుల ఏర్పాటు, మరమ్మతులపై చర్యలు చేపడతామన్నారు. జిల్లా పరిధిలోని సమస్యలను అధికారులు పరిష్కరిస్తారని, అలా కాని వాటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. సీఎం సొంత జిల్లా గనుక అందరి దృష్టి ఇక్కడే ఉంటుందన్నారు. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు తీసుకు రావాలని కోరారు. వ్యవసాయరంగంపై జరిగిన చర్చలో వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథ్ మాట్లాడుతూ తమ మండలంలో రైతులు ఉల్లిసాగు చేయగా, భారీ వర్షాలకు మొలకలు వచ్చాయన్నారు. చెన్నైకి తీసుకెళ్లి విక్రయిద్దామనుకుంటే క్వింటా కేవలం రూ. 400లకే అడుగుతున్నారని పేర్కొన్నారు. వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలోని నాలుగు పంచాయతీల్లో ఉల్లికి భారీ నష్టం వాటిల్లిందన్నారు. ∙జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా మాట్లాడుతూ ఎరువుల కొరత తీవ్రంగా ఉందని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. రైతులకు మినీ కిట్స్ పంపిణీ చేయాలని కోరారు. ∙చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తమ మండలంలో కొన్ని గ్రామాల్లో డీకేటీ పట్టాలు ఆన్లైన్లో నమోదు కానందున రైతులు పంట రుణాలు పొందలేకపోతున్నారని చెప్పారు. ∙తాళ్లపల్లి పీహెచ్సీ నుంచి వైద్యులను డిప్యుటేషన్‌పై పంపవద్దని వేంపల్లె జెడ్పీటీసీ కోరారు. వేంపల్లెలో 60 వేల జనాభా ఉన్నప్పటికీ గైనకాలజిస్టు లేరన్నారు. పోరుమామిళ్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ తమ మండలంలో గైనకాలజిస్టులను నియమించడంతోపాటు బద్వేలులో డయాబెటిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. గాలివీడు ఎంపీపీ మాట్లాడుతూ హెడ్ క్వార్టర్లో మరో వైద్యుడిని నియమించాలన్నారు. మెరుగైన వైద్యసేవలందేలా చర్యలు:కలెక్టర్ విజయరామరాజు వైఎస్సార్ కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో కూడా సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.జేసీ సాయికాంత్‌వర్మ మాట్లాడుతూ పీహెచ్సీలలో గైనకాలజిస్టుల కొరత ఉన్న మాట నిజమేనన్నారు. ఎవరైనా వైద్యులు ముందుకు వస్తే వెంటనే అపాయ్మెంట్ ఆర్డర్స్ ఇస్తామన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సగంలో ఆగిపోయిన అంగన్వాడీ భవనాలను నాడు–నేడు కార్యక్రమంలో చేర్చాలని సూచించారు. వీఎన్ పల్లెను పాడా కిందికి చేర్చాలని మండల సమావేశంలో తీర్మానించామని, జెడ్పీలో కూడా ఆ మేరకు తీర్మానం ఆమోదించాలని కోరారు. యంత్రాల సాయంతో చెరువుల్లో మట్టి తవ్వి పొలాలకు తీసుకు వెళ్లేందుకు రైతులకు అనుమతి ఇవ్వాలన్నారు. ∙బ్రహ్మంగారిమఠం ఎంపీపీ వీర నారాయణరెడ్డి మాట్లాడుతూ తమ అంగన్వాడీ కేంద్రంలో వంట గ్యాస్ లేనందువల్ల కట్టెల పొయ్యినే ఉపయోగిస్తున్నారని తెలిపారు. ∙జెడ్పీటీసీ గోవిందరెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డిలు మాట్లాడుతూ తమ మండలంలోని 40 గ్రామాలకు సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్న మాటల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. ఒక్క గ్రామానికి తాగునీరు ఇస్తున్నట్లు అధికారులు నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. ∙మొయిళ్ల కాల్వ–రంపతాడు కల్వర్టు ఏర్పాటు చేయాలని జెడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య కోరారు. ∙తాగునీటి రవాణా బిల్లులు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చెల్లించి ఆదుకోవాలని గాలివీడు ఎంపీపీ కోరారు. వారం, పది రోజుల్లో ఈ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నమయ్య జిల్లా కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. ∙హైవేలో ఇళ్లు కోల్పొయిన వారికి స్థలాలు ఇవ్వాలని, సచివాలయాలకు విద్యుత్ సమస్య తీర్చాలని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్‌యాదవ్ కోరారు. ∙తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరు 150 ఎకరాల భూములను ఆక్రమించారని, దీనిపై విచారణ జరిపి భూములను స్వాధీనం చేసుకోవాలని పుల్లంపేట జెడ్పీటీసీ కోరారు. ఆ భూములను అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని కోరారు. భూ ఆక్రమణపై ఆర్డీఓతో విచారణ: అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా కలెక్టర్ గిరీషా స్పందిస్తూ ప్రభుత్వ భూమి దురాక్రమణపై ఆర్డీఓతో విచారణ చేయిస్తామని తెలిపారు. కబ్జాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామన్నారు. భూములను అర్హులైన పేదలకు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడతామని హామి ఇచ్చారు. సోలార్ ప్రాజెక్టు కింద భూములు కోల్పొయిన వారికి పరిహారం ఇవ్వాలని, ఇందులో చుక్కల భూముల సమస్యను పరిష్కరించాలి గాలివీడు ఎంపీపీ కోరారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, రమేష్ యాదవ్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగపెంట రమణమ్మ, జెడ్పీ సీఈఓ ఎం.సుధాకర్‌రెడ్డి, వివిధ శాఖల అ«ధికారులు పాల్గొన్నారు. 104 వాహనాలు హెడ్ క్వార్టర్స్‌లో ఉంచాలి: ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వైద్య, ఆరోగ్యంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ 104 వాహనాలు సచివాలయాల హెడ్ క్వార్టర్స్‌లో ఉంచాలని కోరారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న మారుమూల గ్రామాలకు వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్స్‌రే ప్లాంటు వంటి వైద్య పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించే సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. చాలా పీహెచ్‌సీల్లో గైనకాలజిస్టులు, ఇతర స్పెషలిస్టుల కొరత వేధిస్తోందని, వైద్యుల నియామకానికి చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంపై సభ్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య సిబ్బంది తరుచూ పీహెచ్‌సీలను సందర్శించి అక్కడ అమలవుతున్న వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ సేవలను పరిశీలించాలన్నారు. 24 గంటలు గ్రామీణ హెల్త్ క్లినిక్స్ ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. హెల్త్ క్లినిక్స్‌లలో ఏఎన్ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు, ఆశాలను అందుబాటులో ఉంచాలని కోరారు. సబ్సిడీ స్టోరేజీ యూనిట్లు మంజూరుకు చర్యలు: ఇన్చార్జి మంత్రి ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో 16 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారని పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల చాలామంది రైతులు నష్టపోయినట్లు తెలుస్తోందన్నారు. కనుక ఎన్యుమరేషన్ నిర్వహించి పరిహారం అందించేందుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకోవడానికి వీలుగా సబ్సిడీ స్టోరేజీ యూనిట్లు మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన ఉల్లి, పత్తి పంటలను ఎన్యుమరేషన్ చేయించి రైతులకు పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం ఆమోదించాలని సూచించారు. ఆయన సూచనకు జెడ్పీ చైర్మన్ అంగీకరించారు. -
ఉల్లి రైతుకు ఊతం
సాక్షి, అమరావతి: ప్రతి సీజన్లోనూ అకాల వర్షాల వల్ల సరైన దిగుబడి రాక.. చేతికి వచ్చిన కాస్త పంటను దాచుకునే పరిస్థితి లేక ఉల్లి రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి చేయూతనిస్తోంది. రైతులు అధిక దిగుబడులు సాధించేలా సాగులో మెళకువలు నేర్పిస్తోంది. ఉత్పత్తి నష్టాలు తగ్గించేలా నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పిస్తోంది. ‘ఒక జిల్లా–ఒక పంట’ పథకం కింద ఉల్లి పంట ఎక్కువగా సాగయ్యే కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇతర జిల్లాల్లోనూ రైతులకు ఆర్థిక చేయూత నందిస్తోంది. ఉత్పాదకత పెంచేలా.. రాష్ట్రంలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఒక్క కర్నూలు జిల్లాలోనే 71,397 ఎకరాల్లో పండిస్తున్నారు. ఆ తర్వాత అనంతపురం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఎక్కువగా సాగవుతోంది. మూడు నెలల్లో చేతికొచ్చే ఈ పంటకు ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుంటుంది. ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. అయితే వీటిని నిల్వ చేసేందుకు తగిన సదుపాయాలు లేకపోవడంతో పంట చేతికి రాగానే రైతులు అయినకాడికి అమ్ముకునేవారు. దీంతో ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు నష్టాన్ని చవిచూసేవారు. దీన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం.. నాణ్యమైన విత్తనాల నుంచి నిల్వ కేంద్రాల వరకు అన్నింటినీ సమకూరుస్తోంది. 10 నుంచి 12 శాతం ఉత్పాదకతను పెంచే నాణ్యమైన ఎల్–883, రెడ్–3, రెడ్–4 ఎఎఫ్ఎల్ఆర్ రకాల విత్తనాలను 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. 10 నుంచి 15 శాతం నాణ్యత పెంచేలా ఉత్తమ యాజమాన్య పద్ధతులపై ఆర్బీకేల ద్వారా అవగాహన కల్పిస్తోంది. డ్రిప్, మల్చింగ్‌తో రైజ్డ్ బెడ్ సేద్యం తదితర సాంకేతిక పద్ధతులపై శిక్షణ ఇస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో.. ప్రస్తుత రబీలో పెద్ద ఎత్తునే ఉల్లిసాగవుతోంది. ఎకరాకు రూ.30 వేలు అదనపు లబ్ధి.. నాకు మూడున్నర ఎకరాలుంది. మరో 6 ఎకరాలు కౌలుకు చేస్తున్నా. ఉల్లి, వేరుశనగ, శనగలు సాగుచేసే వాడిని. ఏటా పంట చేతికొచ్చే సమయంలో కురిసే వర్షాల వల్ల ఉల్లి కొంత దెబ్బతినేది. పంట చేతికి వచ్చిన తర్వాత.. మంచి ధర వచ్చే వరకు ఉల్లిపాయలు దాచుకునే సదుపాయం లేక వెంటనే అమ్ముకోవాల్సి వచ్చేది. దీని వల్ల పెట్టుబడి దక్కడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో 25 టన్నుల ఉల్లిపాయలు దాచుకునేలా నిల్వ కేంద్రాన్ని నిర్మించుకున్నా. 50 శాతం సబ్సిడీతో పాటు ఎస్సీ కేటగిరిలో మరో 25 శాతం సబ్సిడీ కలిపి రూ.1.31 లక్షలు జమయ్యాయి. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లిని దాచుకొని మంచి ధర వచ్చిన తర్వాత అమ్ముకోవడం వల్ల ఎకరాకు రూ.30 వేలు అదనపు లబ్ధి కలిగింది. – హెచ్.ఏసన్న, కల్లపారి, కర్నూలు జిల్లా 50 శాతం సబ్సిడీతో యంత్రాలు.. రైతులకు రూ.8.03 లక్షల విలువైన ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, రూ.20 వేల విలువైన సీడ్ డిబ్లర్స్ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇస్తోంది. వీటివల్ల కూలీల ఖర్చు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సమగ్ర సస్యరక్షణ పథకం కింద హెక్టారుకు రూ.5 వేల ఆర్థిక చేయూతనిస్తున్నారు. ఉల్లిని కనీసం 3, 4 నెలల పాటు నిల్వ చేసుకునేందుకు 25 టన్నుల సామర్థ్యంతో రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీయుటిలిటీ నిల్వ కేంద్రాలను నిర్మిస్తోంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే మొత్తం 600 నిల్వ కేంద్రాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది కనీసం 100 కేంద్రాలకు ఆర్థిక సహకారం అందించనుంది. ఇతర జిల్లాల్లోనూ రైతులకు వీటిని మంజూరు చేస్తామని ప్రకటించింది. ఉల్లిని ఆరబెట్టడానికి రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఒక్కొక్కటి రూ.6.10 లక్షల విలువైన 15 సోలార్ పాలీడ్రయర్లను 75 శాతం(రూ.4.57 లక్షలు) సబ్సిడీపై సమకూరుస్తోంది. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ద్వారా ఉల్లిని ప్రాసెస్ చేసి.. ఉల్లి రేకులు, డీహైడ్రేటెడ్ పొడి, పేస్ట్, నూనె తయారు చేసి మార్కెట్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 50 టన్నుల నిల్వ కేంద్రాన్ని నిర్మించుకున్నా.. నేను ఎడెకరాల్లో ఉల్లి సాగు చేస్తున్నా. ప్రభుత్వం నుంచి 50 శాతం సబ్సిడీపై 50 టన్నుల సామర్థ్యం కలిగిన ఉల్లి నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పండిన ఉల్లిని నిల్వ చేసుకొని మంచి ధరకు అమ్ముకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతోంది. – రామల్లకొట మధు, కర్నూలు సోలార్ డ్రయ్యర్ ఇచ్చారు. 5 ఎకరాల్లో ఉల్లి పంట వేశాను. ఇప్పటికే మూడెకరాల్లో పంట తీస్తే 11 టన్నులొచ్చింది. మార్కెట్లో కూడా మంచి రేటు వస్తోంది. ప్రభుత్వం మా పొలంలో సోలార్ డ్రయ్యర్ పెట్టింది. ఉల్లి నిల్వ కేంద్రం, సోలార్ కోల్డ్ స్టోరేజ్ కోసం గ్రూప్‌గా ఏర్పడితే 75 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. వీటిని కూడా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎం.మోదిన్సాహెబ్, పాలకుర్తి, కర్నూలు -
కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి
ఎన్నో ఏళ్లుగా విదేశాలకు ఎగుమతి అవుతూ, ప్రత్యేకతను సంతరించుకున్నా అభివృద్ధిలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్న కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భౌగోళిక గుర్తింపు లభించింది. దీంతో పంట అభివృద్ధికి బంగారుబాట ఏర్పడింది. రైతులకు కూడా మేలు చేకూరనుంది. కడప అగ్రికల్చర్/మైదుకూరు: కృష్ణాపురం (కేపీ) ఉల్లి పంటకు అరబ్ దేశాల్లో గిరాకీ ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ పంటకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ కల్పించింది. దీంతో రైతులు, రైతు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు సభ్యు లు వైఎస్ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ఎస్. రఘురామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుసార్లు కేపీ ఉల్లికి గుర్తింపు ఇవ్వాలని విన్నవించడంతోనే ఇది సాధ్యమైందని రైతులు అంటున్నారు. బ్రిటీష్ వైశ్రాయ్‌ల పరిపాలనా కాలంలో కేపీ ఉల్లి విదేశాలకు ఎగుమతి అవుతూ వస్తోంది. మద్దతు ధర కల్పించాలని, పంట కనుమరుగై పోకుండా కాపాడాలని రైతు సంఘాలు పోరాటాలు చేశాయి. అయినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో రైతుల కష్టాలను దగ్గ రగా చూశారు. కుదేలైన వ్యవసాయానికి జవసత్వాలు తీసుకురావాలని కంకణం కట్టుకున్నారు. కేపీ ఉల్లి పంటకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) వచ్చేలా సహాయ సహకారాలు అందించారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక విదేశీ ఎగుమతులకు ఢోకా ఉండదని, పంట పండినట్లేనని రైతులు అంటున్నారు. ►మైదుకూరు ప్రాంతం నుంచి కడపకు వచ్చే కేసీ కెనాల్ ద్వారా ఉల్లిగడ్డలు కడప సమీపంలోని కృష్ణాపురం రైల్వేస్టేషన్ వరకు పడవల ద్వారా రవాణా అయ్యేవని పెద్దలు సాహితీ వేత్త విద్వాన్ కట్టా నరసింహులు చెప్పారు. అక్కడి నుంచి నాటి మద్రాసు నేటి చెన్నై ఓడరేవు వరకు రైలులో వెళ్లేదన్నారు.అక్కడి నుంచి బ్రిటీషు వాళ్లు వారి దేశానికి ఎగుమతి చేసుకునే వారన్నారు. కేపీ ఉల్లిగడ్డలను మందులలో ముడి పదార్థంగా వాడతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.గత టీడీపీ ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులను ఛీకొడుతూ వచ్చింది. ఎగుమతులు లేని పంటను ఎందుకు సాగు చేయాలని నాటి సీఎం, నేటి ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అప్పట్లో తెగేసి చెప్పినట్లు రైతులు చర్చించుకుంటున్నారు. బ్రిటీష్ కాలం నాటి నుంచి పంట సాగు.....: బ్రిటీష్ వారి పరిపాలనా కాలం నుంచి కర్ణాటకలో మొదలై అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం జిల్లా మార్కాపురం వరకు ఈ పంట సాగవుతూ చిట్టిబళ్లారి, చిన్న బళ్లారి, రెడ్‌లేడీ, అగ్రిబ్రౌన్ రోజ్గా రూపాంతరం చెందింది. కేపీ ఉల్లిగా పేరు తెచ్చుకుని విస్తరించింది. రాయలసీమ జిల్లాల్లోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో లక్షల హెక్టార్లలో ఏటా సాగవుతూ ఉండేది. అయితే మన ప్రభుత్వాలు పంట దిగుబడిని ఎగుమతులు ఇవ్వకుండా మొండికేస్తూ వచ్చాయి. ధరలు పతనమవుతూ రావడంతో రైతులు పంట సాగు చేయడం తగ్గిస్తూ వచ్చారు. అయితే వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు కేంద్రంగా మైదుకూరు, ఖాజీపేట, దువ్వూరు, బ్రహ్మంగారి మఠం, సింహాద్రిపురం, వీరపునాయునిపల్లె, కలసపాడు, పోరుమావిళ్ల, కాశినాయన మండలాలు, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాలు, ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల్లో మాత్రమే సాగవుతోంది. సంతోషకరం కేపీ ఉల్లి చారిత్రక పంట. బ్రిటిష్ కాలం కంటే ముందే ఈ పంటను రైతులు సాగు చేశారు. అయితే ఎన్నో ఏళ్లు ప్రభుత్వాలు కేపీ ఉల్లి రైతులను పట్టించుకోలేదు. ఇప్పటికైనా ఈ పంటకు భౌగోళిక గుర్తింపు రావడం సంతోషకరం. – లెక్కల వెంకటరెడ్డి, కేపీ ఉల్లి రైతుల సంఘం నాయకుడు, మైదుకూరు రైతు సంఘాల కృషి వల్లే రైతు సంఘాలు ఉద్యమాలు చేయడం వల్లే కేపీ ఉల్లి రైతులకు మేలు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు భౌగోళిక గుర్తింపు వల్ల పంటను అభివృద్ధి చేయాలి. – రాజమోహన్‌రెడ్డి, కేపీ ఉల్లి ఉత్పత్తిదారుల సంఘం నాయకుడు, మైదుకూరు. -
ఉల్లితో లాభాల మూట..
సాక్షి, పత్తికొండ: కష్టానికి తోడు అదృష్టం ఉండాలే కాని కరువు నేలలో కూడా సిరులు పండించవచ్చునని చాటి చెప్పారు హోసూరు రైతులు. ఇప్పటికే బోరు బావుల కింద ఆకు కూరుల సాగు చేస్తూ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రైతులు.. ఈ ఏడాది ఉల్లిలో కూడా వారికి కలిసివచ్చింది. సాధారణంగా మెట్టభూముల్లో వర్షాధారంపై శనగ, జొన్న, వాము, పత్తి తదితర సంప్రదాయక పంటలు మాత్రమే సాగు చేస్తారు. అయితే హోసూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు ఈ ఏడాది వినూత్నంగా ఆలోచించారు. వర్షాధారం కింద మెట్టభూముల్లో ఉల్లి పంటను సాగుచేసి లాభాలు మూట గట్టుకున్నారు. పత్తికొండ వ్యవసాయ సబ్ డివిజన్లోని పత్తికొండ, తుగ్గలి, మద్దికెర, దేవనకొండ మండలాల్లో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో బోరుబావుల కింద రైతులు 9,040 ఎకరాల్లో ఉల్లిని సాగుచేశారు. ఇదే సమయంలో పత్తికొండ మండలం హోసూరు గ్రామానికి చెందిన దాదాపు 120మంది రైతులు 500 ఎకరాల్లో మెట్ట భూముల్లో ఉల్లి వేశారు. సకాలంలో వర్షాలు కురవడంతో వారి పంట పండింది. కొందరు రైతలు సమీప కాల్వల్లో, వంకల్లో నీటిని సద్వినియోగం చేసుకున్నారు. ఎకరాకు 100 నుంచి 200 ప్యాకెట్ల వరకు దిగుబడి సాధించారు. ఇదే సమయంలో ఈ సారి ధర ఉల్లి రైతును సంతోషంలో ముంచెత్తింది. దీంతో క్వింటాల్‌కు కనిష్టంగా రూ.5వేలు నుంచి గరిష్టంగా రూ.12వేల వరకు ధర లభించింది. హోసూరు గ్రామంలో ఉల్లి సాగుచేసిన రైతులకు ఈ ఏడాది కనీసం రూ.5 కోట్లు వచ్చాయి. ఏటా పెట్టుబడి కూడా చేతికందని పంట ఈ సారి కాసులు కురిపించింది. ఎన్నడూ చూడని లాభాలు చూశారు. మార్కెట్లో ఉల్లికి ఉన్న డిమాండ్‌ను చూసి ఇపుడు రబీ సీజన్లోనూ పెద్ద ఎత్తున రైతులు ఇదే పంటను సాగు చేస్తున్నారు. గట్టెక్కించింది.. పట్టువదలని విక్రమార్కుల్లా సాగు చేసిన ఉల్లి రైతుల పంట పండింది. సాధారణంగా ఎకరాకు పెట్టుబడి కనీసం రూ.30 వేలు నుంచి రూ.60 వేలు అవుతోంది. మార్కెట్లో మంచి ధర లభిస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతోంది. లేకపోతే అప్పులపాలే. గత ఏడాది క్వింటాల్ ఉల్లి రూ. 200 నుంచి రూ. 300 దాటలేదు. ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది ఉల్లికి డిమాండ్ రాడంతో మార్కెట్లో ధర ఎన్నడూ లేని విధంగా రికార్డులు బ్రేక్ అయ్యాయి. క్వింటాల్ ఉల్లి ధర రూ.3 వేల నుంచి పెరుగుతూ ఒక దశలో రూ.15 వేలు దాటింది. ప్రస్తుతం రూ. 8వేలు నుంచి రూ. 10వేలుకు పైగా పలుకుతోంది. ఇప్పుడు వచ్చిన లాభాలతో గతంలో చేసిన అప్పుల నుంచి గట్టెక్కే పరిస్థితి ఏర్పడింది. ఉల్లి.. వారికి సిరుల తల్లిగా మారింది. రూ. 8 లక్షలు మిగిలాయి నాలుగు ఎకరాల్లో ఉల్లిపంట వేశా. క్వింటంరూ.6800 ధర వచ్చింది. రూ. 10 లక్షలు వచ్చాయి. పెట్టుబడి పోను రూ. 8 లక్షలు మిగిలాయి. గత నాలుగేళ్లుగా చేసిన అప్పులు తీర్చేస్తాను. భూమి కరుణిస్తే వ్యవసాయాన్ని మించినది ఏదీ లేదు. ఏటా ఇలాగే పంటలు పండితే అందరూ సేద్యం చేస్తారు. – భైరపు పరశురాముడు ఈ ఏడాది బాగుంది నేను 6 ఎకరాలను రూ. 50 వేలకు గుత్తకు తీసుకుని ఉల్లిపంట వేశా. గడ్డ సైజు బాగానే ఉంది. ఇంకో వారం రోజుల్లో పంట కోస్తాం. కనీసం 400 ప్యాకెట్లు దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం. మార్కెట్లో మంచి ధర ఉండటంతో పెట్టుబడి ఖర్చులు పోయినా గిట్టుబాటు అవుతుందనే ఆశతో ఉన్నాం. – కొత్తకాపు రంగారెడ్డి -
వైఎస్ జగన్‌ను కలిసిన కడప జిల్లా ఉల్లి రైతులు
-
ఉల్లి ధర ఢిల్లీకి చుక్కలు చూపెట్టనుందా...!!
హివర్గావ్/ముజాహిద్పూర్ : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అంతటి పోషక విలువలుంటాయి ఉల్లిలో. అంతేకాదు ఉల్లి ధరలు ఢిల్లీ పీఠాన్ని సైతం కదిలించగలవు. ఈ విషయం గతంలో రుజువైంది. ఇప్పుడు అదే ధోరణి పునరావృతం అవుతుందేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఉల్లి, ఆలు ధరలు దారుణంగా పడిపోవడంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో నరేంద్రమోదీ వ్యతిరేక పవనాలు బలపడే అవకాశాలున్నాయి. ఉల్లి ధర కిలో రూపాయికి చేరడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. కిలో ఉల్లిని పండించడానికి రూ.8 ఖర్చవుతుండగా..రూపాయి గిట్టుబాటు కావడంతో అప్పుల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రోడ్లపై పోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటేయమని తేల్చిచెప్తున్నారు. అచ్చేదిన్ అంటూ అధికారంలోకొచ్చిన బీజేపీ.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు. 1998లో ఉల్లి ధర క్షీణించడంతో తర్వాత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి తిరిగి అధికారంలోకి రాలేకపోయింది. ధర పెరిగినా దెబ్బే.. ధరలు క్షీణించడంతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందనుకోవడం పొరబాటే. రైతుల నుంచి కొనుగోలు చేసే ధరలు ఎలా ఉన్నా బహిరంగ మార్కెట్లో మాత్ర వాటిలో తేడా ఉండదు. నాలుగు దశల్లో ఉండే దళారులు తలా ఇంత ధర పెంచడంతో సరుకు వినియోగదారుడికి చేరేసరికి దాని ధర తడిసి మోపెడవుతుంది. ఇక ధరలు నిజంగానే పెరిగితే.. వినియోగదారుల జేబులకు చిల్లులు పడాల్సిందే. అప్పుడు కూడా ఢిల్లీకి సెగ తాకక తప్పదు. 1980 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉల్లి ధర ఆకాశాన్ని తాకడంతో జనతా ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా ప్రతికూల పవనాలు వీచాయి. దాంతో కేంద్రంలో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ 353 ఎంపీ సీట్లలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఉల్లి ధర తోడ్పడిందని భావించవచ్చు. బీజేపీకి మాత్రం ఓటేయం.. ‘లోక్‌సభ ఎన్నిలకు మరికొన్ని నెలలే ఉంది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. మేం దానిని స్వీకరించలేం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీకి మాత్రం ఓటు వేయం. 2014 ఎన్నికలప్పుడు చేసిన తప్పును మళ్లీ చేయం. ఏదేమైనా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తాం’ అని ఓ ఇంగ్లిష్ వార్తా సంస్థ సర్వేలో కొందరు రైతులు కుండబద్దలు కొట్టారు. భవితవ్యాన్ని మార్చేస్తారు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కలిపి 128 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 545 స్థానాలున్న భారత పార్లమెంటులో ఈ రెండు రాష్ట్రాల పాత్రేమిటో తెలుస్తూనే ఉంది. ఇక ఉల్లి, ఆలు ధరల క్షీణత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని గ్రామీణ జనంలో బీజేపీపై వ్యతిరేకత రావడానికి కారణమవుతుందనడంలో సందేహం లేదు. వీరంతా 128 ఎంపీ అభ్యర్థుల భవితవ్యాన్ని తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే నరేంద్ర మోదీకి ప్రతికూల పవనాలు వీస్తుండగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో గనుక బీజేపీకి తక్కువ సీట్లు వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు ఇబ్బందులు తలెత్తవచ్చు. లేదా తిరిగి అధికారంలోకి రాలేకపోవచ్చు. మరోవైపు 2014లో బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టగానే నెమ్మది నెమ్మదిగా రైతులకు సబ్సిడీలను తొలగించడం కూడా వ్యతిరేకత పెంచింది. ఇదే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల పవనాలు వీయడానికి కారణమైంది. రూ. 400 పెరిగింది.. దేశంలో ఆలు పంట అధికంగా పండించే ఉత్తరప్రదేశ్‌లోనూ గిట్టుబాబు ధరలులేక రైతులు ఆందోళన చెందుతున్నారు. 86 శాతం మేర పడిపోయిన టన్ను ఆలు ధర రూ.2500లకు చేరిందని వాపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పంటల నిర్వహణ ఖర్చులు పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డయా అమ్మోనియం ఫాస్పేట్ (డీఏపీ) రూ. 400 పెరిగి 1450 రూపాయలకు చేరిందనీ, కానీ ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పంట పండిస్తే గిట్టుబాటు ధర రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నీ కలిసి ధర పెంచేశాయి.. టన్ను ఉల్లి ధర 83 శాతం మేర పడిపోవడం ఒకవైపు.. అంతర్జాతీయంగా రూపాయి విలువ పడిపోవడం మరోవైపు దిగుబడి ఖర్చులు పెరిగేలా చేశాయి. గతంలో కంటే పంట దిగుబడి ఎక్కువ రావడం, తూర్పు మధ్య ఆసియా, ఆగ్నేయాసియా నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ఎగుమతులు తగ్గి నష్టాలు మరింత ఎక్కువయ్యాయి. అప్పుల్లో ముంచేశారు.. పండించిన పంటలకు గిట్టుబాబు ధరలు కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోవడం లేదు. ‘ధరల స్థిరీకరణ నిధి’ని ఏర్పాటు చేయకపోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల మంది రైతులు దళారీల దయాదాక్షిణ్యాల మీద పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి తలెత్తింది. తమకు పంటలను నిల్వ చేసుకునేందుకు గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వంటి సదుపాయాలు కల్పిస్తే ఇంతటి తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యేవి కాదనీ, అప్పుల్లో మునిగిపోయేవారం కాదని రైతులు అంటున్నారు. అచ్చేదిన్ ఎక్కడ.. ‘మంచి రోజులొస్తాయంటే నమ్మాం. నరేంద్ర మోదీని గెలిపించాం. కానీ, రైతుల పట్ల ఇంత నిర్లక్ష్య పాలన సాగిస్తారని అనుకోలేదు’ అని మాధవ్ పవాసే అనే ఉల్లి రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ధర పడిపోవడంతో రైతులు పంటపొలాల్లోనే ఉల్లిని వదిలేస్తున్నారనీ, పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తే మరింత నష్టం మూటగట్టుకోవాల్సి వస్తుందని వాపోయారు. బీజేపీకి సవాల్.. ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో రైతుల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా తగ్గించడమని బీజేపీలో అంతర్మథనం మొదలైంది. వారిని ఆకట్టుకోవడానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ రైతులకు మేలు చేసే పథకాలు అమలు చేస్తామని చెప్పుకొస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలోనూ రైతు రుణ మాఫీ ప్రకటించిన కాంగ్రెస్.. దేశ వ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేయాలని బీజేపీకి సవాల్ విసురుతోంది. అయితే, రుణాల మాఫీ అన్నది రైతు సమస్యల పరిష్కారానికి మార్గం కాదని నీతి ఆయోగ్ వైఎస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు రైతుల సంక్షేమం కోసం బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ చెప్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని అన్నారు. ప్రస్తుత మార్కెట్ ధరలతో పోల్చి గిట్టుబాబు ధరలు అందించడానికి ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. అయితే, ఈ ప్రక్రియ కొనసాగుతోందనీ, ఇంత పెద్ద దేశంలో నాలుగేళ్లలోనే దానిఫలాలు రావాలనడం భావ్యం కాదని అన్నారు. -
సీఎం సారూ.. రూ.6 సంపాదించా తీసుకోండి!
ముంబై : ‘అయ్యా.. సీఎం సారూ.. నేను 2 లక్షల పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేస్తే నాకు రూ.6 లాభం వచ్చిందయ్యా.. ఈ లాభాన్ని కూడా మీరే తీసుకొండి’ అని ఓ ఉల్లి రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు పంపించాడు. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాకు చెందిన శ్రేయాస్ అభలే అష్టకష్టాలు పడి 2657 కేజీల ఉల్లిని పండించాడు. మార్కెట్లో అమ్మేందుకు తీసుకెళ్లాడు. దళారుల దెబ్బకు పంటకు కనీస మద్దతు ధర కూడా రాలేదు. కేజీ ఉల్లి కేవలం రూపాయే పలికింది. దీంతో అభలే కడపు మండి కంట కన్నీరు ఉబికింది. తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ మొత్తాన్ని రాష్ట్ర సీఎంకు మనీ ఆర్డర్ ద్వారా పంపాడు. ఇలా అబలే నిరసన వ్యక్తం చేయడం దేశ వ్యాప్తంగా ఉన్న ఉల్లిరైతులు దయనీయ స్థితిని తెలియజేస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి రైతు పరిస్థితి కల్లోలంగా మారింది. ఎంతో కష్టపడి పండించిన పంటకు కనీస ధర కూడా రావడం లేదు. రైతులు ఉల్లిని బాగా సాగుచేయడం.. దిగుబడి కూడా ఎక్కవగా రావడంతో ఉల్లి ధరలు అమాంతం పడిపోయాయి. కేజీ ఉల్లి ధర 50 పైసల నుంచి రూపాయి కూడా పలకడం లేదు. అభలే తన పొలంలో పండిన 2657 కేజీల ఉల్లిని కేజీ రూపాయి చొప్పున గత శుక్రవారం హోల్‌సెల్ మార్కెట్లో అమ్మాడు. ట్రాన్స్పోర్ట్, కూలీల ఖర్చులు పోనూ.. అతని ఆరు రూపాయలు మాత్రమే వచ్చింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన అభలే మీడియాతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘2,657 కేజీల ఉల్లిని అమ్మితే నాకు రూ. 2,916 వచ్చాయి. రవాణ ఖర్చులు.. కూలీలు పోను రూ. 6 మిగిలాయి. ఈ ఏడాది రూ.2లక్షల పెట్టుబడితో ఉల్లి పంట సాగు చేశా. లాభాలేమో ఇలా ఉన్నాయి. ఇలా అయితే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.’ అని బాధపడ్డాడు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన సంజయ్ సాథే అనే రైతు కూడా అతనికి వచ్చిన రూ.1064 లాభాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మనియార్డర్ ద్వారా పంపించి నిరసన వ్యక్తం చేశాడు. ఇక మద్దతు ధర లేక నాసిక్ జిల్లాల్లో ఇద్దరు ఉల్లి రైతులు బలవన్మరణం పొందారు. -
గిట్టుబాటు ధరలేక ఉల్లిరైతు విలవిల
-
అశనిపాతం
కడప అగ్రికల్చర్/పెండ్లిమర్రి: రాష్ట్రవ్యాప్తంగా వానలు సరిగా కురవలేదని మార్కెట్‌కు ఉల్లిగడ్డల కొరత ఉంటుందని ఆలోచించిన జిల్లా రైతులు బోరుబావుల ఉల్లి పంట సాగు చేశారు. పంట చేతికందే సమయంలో మార్కెట్లో ధరలు పెరగకపోగా రోజు రోజుకు పతనమవుతూ వస్తున్నాయి. దీంతో రైతన్నల ఆశలు అడియాసలయ్యాయి. పంట సాగు సమయంలో క్వింటాలు రూ.3 వేల నుంచి రూ.4 వేల ధర పలికింది. రైతులు ఎకరం సాగుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష దాకా పెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొచ్చే సరికి క్వింటా రూ.500 కంటే మించి పలకలేదు. ఎకరానికి దిగుబడి కూడా 10–20 క్వింటాళ్ల కంటే మించి రాలేదు. ఈ దిగుబడికి వ్యాపారులు పెట్టిన ధరకు ఎకరానికి రూ.50వేల నుంచి రూ.55 వేల కంటే మించి రాలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లిగడ్డలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు మార్కెటింగ్‌శాఖ తరలించి ఆదుకోవాల్సి ఉన్నప్పటికి ఆ పని చేయలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఏ మాత్రం పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉంటా యని రైతులు భావించారు. నిన్న... మొన్నటి వరకు కిలో రూ.20–25లతో కొనుగోలు చేసిన వ్యాపారులు, నేడు మార్కెట్లో ఉల్లిగడ్డలకు డిమాండ్ తగ్గిందని సాకు చూపుతూ కిలో రూ.5లకు కొనుగోలు చేస్తుండడం రైతులకు ఆశనిపాతం అయింది. ఉల్లిగడ్డలకు మద్దతు ధరలు కరువవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎగుమతులను ప్రోత్సభించడంలేదని రైతు సంఘాలు నిప్పులు చేరుగుతున్నాయి. నాలుగు సంవత్సరాలుగా అతి వృష్టి, అనావృష్టి, విద్యుత్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని, ఈ ఏడాది వర్షాలు సరిగా కురవ లేదని, పంట అధికంగా సాగుకాదని తెలిసి బోరుబావుల నుంచి వచ్చే అరకొర నీటితో పంట సాగు చేశామని రైతులు చెబుతున్నారు. ధరలు వెక్కిరిస్తున్నాయని మదన పడుతున్నారు. 4,345 ఎకరాల్లో ఉల్లి సాగు జిల్లాలోని ఉద్యానశాఖ 1,2 పరిధిలోని కడప, చింతకొమ్మదిన్నె, సిద్ధవటం, పెండ్లిమర్రి, మైదుకూరు, దువ్వూరు, బి మఠం, ఖాజీపేట, వేంపల్లె, ముద్దనూరు, వీరపునాయునిపల్లె, పులివెందుల, తొండూరు, వేముల మండలాల్లో ఉల్లి పంటను 4,345 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణంగా గడ్డలు బాగా ఊరితే మంచి దిగుబడి 50 నుంచి 80 క్వింటాళ్లు వస్తుందని, అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావానికి, ఎండలు అధికం కావడం, తెగుళ్లు, పురుగులు పట్టి పీడించడంతో ఎకరానికి 10 నుంచి 20 క్వింటాళ్ల కంటే మించి దిగుబడి రాలేదని అంటున్నారు.ఇప్పుడు సాగైన 4,345 ఎకరాల ఉల్లి పంట నుంచి ఇప్పటి దిగుబడి ప్రకారం చూస్తే మార్కెట్‌కు 43,450 నుంచి 86,900 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటసాగు నుంచి నూర్పిడి వరకు కంటికి రెప్పలా చూసుకున్నా ధరలు మాత్రం వెక్కిరిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని ప్రతి ఏటా ఆందోళనలు, రాస్తారోకోలు, కలెక్టరేట్ వద్ద ధర్నాలు చేసినా పాలకులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి. పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉల్లిపంట ఎకరం సాగుకు విత్తనాలు, ఎరువులు, నారు నాట్లు, కలుపుతీత, మందుల పిచికారీ, నూర్పిళ్లకుగాను మొత్తం రూ.80 నుంచి రూ.లక్ష పెట్టుబడి అయిందని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో ధరలు ఆశాజనకంగా లేవని వ్యాపారులు అంటున్నారు. దీంతో పంటను నిల్వ చేసుకునేందుకు వీలులేక నష్టానికే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 10–20 క్వింటాళ్ల దిగుబడి ఉన్నా క్వింటా ధర రూ.500 పలుకుతుంటే పెట్టుబడి కూడా తీరే పరిస్థితులు కనిపించలేదంటున్నారు. వ్యాపారులు రైతుల వద్ద కిలో రూ.5లకు కోనుగోలు చేసి మార్కెట్లో రూ.20–25లకు విక్రయిస్తున్నారు. దళారీ, వ్యాపారి ఆదాయం అర్జిస్తున్నా రైతు మాత్రం అప్పులను మూటగట్టుకుంటున్నారు. కోటి ఆశలతో ఉల్లి పంట సాగుచేసిన అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. పెట్టుబడులు తడిసిమోపెడవుతున్నా ధరలు చూస్తే పాతాళంలో ఉన్నాయని రైతులు లబోదిబో అంటున్నారు. మంచి ఆదాయం వస్తుందనుకున్నా.. మార్కెట్లో ఉల్లి ధరలు బాగుంటాయని పంటసాగు చేశాను. ఎకరం పొలంలో ఉల్లి సాగు చేశాను. మంచి ధరలు ఉంటాయి.. కష్టాలు తీరుతాయని అనుకుంటే అది మమ్ములనే చుట్టుకుంది. ఎంత లేదన్నా ఖర్చులన్నీ పోను రూ.లక్ష నుంచి రూ.1.50 లక్ష వస్తుందని ఆశించా...ఆ ఆశలు తీరలేదు. – నారాయణరెడ్డి, ఉల్లి రైతు, నల్లయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం గిట్టుబాటు ధరలు కల్పించాలి నాలుగు సంవత్సరాలుగా ఉల్లిసాగుచేసి నష్టాలను చవిచూశాం. ఈసారైనా మంచి ఆదాయం వస్తుందని ఆశించాం. తీరా పంట చేతికి వచ్చాక ధరలు నట్టేముంచాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. ధరల స్థిరీకరణ పథకం ఏమైందో రైతులకు ప్రభుత్వం చెప్పాలి. ఉల్లి ఎగుమతి అయితేనే ఆశించిన ధరలు వస్తాయి. లేకపోతే పెట్టుబడులు రావు. ఇలాగైతే నష్టపోవాల్సి వస్తుంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉల్లి పంటను ధరలున్న ప్రాంతాలకు ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వానికి విన్నవించాలి. అలా చేస్తేనే గట్టెక్కగలుగుతారు. –భాస్కరరెడ్డి, వైఎస్సార్ సీపీ, రైతు సంఘం మండల అధ్యక్షుడు, వీఎన్‌పల్లె -
ఆత్మహత్యలే దిక్కవుతున్నాయి
పంటలకు మద్దతు ధర లేక ఏటా అప్పులే మిగులుతున్నాయి లక్షలు పెట్టుబడి పెడితే కనీస దిగుబడి రావడం లేదు: ఉల్లిరైతుల ఆవేదన∙ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అన్నదాతలను ఆదుకుంటాం: వైఎస్ జగన్ కోవెలకుంట్ల: గత రెండేళ్లుగా ఉల్లి పంటలో నష్టాలు వస్తున్నాయని డోన్ నియోజకవర్గంలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన ఉల్లిరైతులు వైఎస్జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్జగన్ పాదయాత్రగా బేతంచర్లకు చేరుకోగా గ్రామానికి చెందిన మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డి, గోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మిరెడ్డి, రామచంద్రుడు, జయచంద్రుడు, రాముడు తదితర రైతులు ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్లి ఆయనను కలి శారు. ‘ఉల్లిసాగులో పెట్టుబడుల కోసం ఎకరాకు రూ.లక్ష ఖర్చు చేస్తే ఆరుక్వింటాళ్లకు మించి దిగుబడులు రావడం లేదు.. దీనికి తోడు మార్కెట్లో ధర పడిపోవడంతో మేము నష్టాల ఊబిలో కూరుకుపోయాం. మార్కెట్లో క్వింటా ఉల్లి కనీసం రూ.500 పలకడం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వేరుశనగ, కంది, శనగ పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నామన్నారు. మొన్నటివరకు రూ.8 వేలు ధర పలికిన కంది ప్రస్తుతం రూ.4 వేలకు మించి పలకడం లేదన్నారు. ఏటికేడు అప్పులే మిగులుతుండడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని వారు వైఎస్జగన్ ఎదుట వాపోయారు. పంటలకు మద్దతు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫల మైందని ఆరోపించారు. దీంతో రానురాను వ్యవసాయం భారమవుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. మీరైనా రైతుల తరఫున పోరాడాలని వైఎస్జగన్ను కోరారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. -
ఉల్లి.. తల్లడిల్లి...
- కిలో ఉల్లి 50 పైసలే.. దారుణంగా పడిపోయిన ధర - ఉసూరుమంటున్న ఉల్లి రైతులు హైదరాబాద్: గత ఏడాది ఆకాశాన్నంటిన ధరతో కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధర ఇప్పుడు అమాంతం పడిపోయింది. దీంతో కిలో ఉల్లి ధర రూ.5 నుంచి 50 పైసలకు తగ్గిపోయింది. ఉల్లి దిగుమతి పెరగడం వల్ల ఒక్కసారిగా ధరలు పడిపోవడం ఉల్లి రైతులకు శాపంగా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక, మహబూబ్‌నగర్ నుంచి వారం రోజులుగా నిత్యం 25 వేల నుంచి 32 వేల బస్తాల వరకు ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ఉల్లి ధరలు కిలో రూ.5 నుంచి 50 పైసల వరకు తగ్గింది. దీంతో మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మూడో రకం ఉల్లిని క్వింటాకు రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లో ఉల్లిని నిల్వ చేసేందుకు తగిన స్థలం దొరక్కపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహా రాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుబడి అరుున ఉల్లి రూ.5 నుంచి రూ.10 వరకు(మొదటి రకం) ధర పలికింది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వచ్చిన మొదటి రకం ఉల్లిని ప్రభుత్వం క్వింటాకు రూ.800 నుంచి రైతుల వద్ద కొనుగోలు చేస్తోంది. రెండో రకం ఉల్లిని రూ.500, రూ.300, రూ.200 వరకు కొనుగోలు చేస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో 31 వేల బస్తాల ఉల్లి దిగుమతి అరుునా క్వింటాకు రూ.3 వేలు, కిలో రూ.30 లెక్కన అమ్మకాలు జరిగారుు. దీంతో రైతులు ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో ఉల్లి పంట విపరీతంగా వేశారు. అయితే ఈ ఏడాది ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి పెరగడంతో కొనుగోలు ధర తగ్గిపోరుు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గిట్టుబాటు ధర లేక మలక్‌పేట వ్యవసాయ మార్కెట్లో రైతులు ఉల్లి నిల్వలను పారబోశారు. కాగా, వర్షాలు ఎక్కువగా పడటం, ఉల్లి నిల్వ లేకుండా కుళ్లిపోవటం తదితర కారణాల వల్లే ఈ ఏడాది ఎక్కువ ధర రాలేదని అధికారులు చెపుతున్నారు. అధిక దిగుబడే ధర తగ్గడానికి కారణం ఉల్లి దిగుబడి పెరగడం.. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎక్కువగా రావటం, పచ్చి ఉల్లి తీసుకురావటం మొదలైనవి ఉల్లి ధర తగ్గుదలకు కారణమని, దీనికి తోడు వర్షాలు భారీగా కురవటం కూడా ప్రభావం చూపిందని మలక్‌పేట వ్యవసాయ మార్కెట్ అసిస్టెంట్ ఎస్జీఎస్ వెంకట్‌రెడ్డి తెలిపారు. అరుుతే ప్రభుత్వ ఆదేశానుసారం రైతులకు ఇబ్బందులు లేకుండా ఉల్లి కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. -
ఉల్లి రైతు విలవిల
కందిపప్పును కేంద్రం నుంచి కిలోకు రూ. 55లకే తీసుకుంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం దాన్ని రేషన్ షాపుల్లో కూడా కిలో రూ.120ల ధరకు అమ్ముతుండటాన్ని ఏమనాలి? థానే లోని నా స్వగృహానికి సమీపంలో వ్యాపారం చేస్తూ, టెంపోలో సరుకులను తీసుకువచ్చే ఒక చిల్లర వ్యాపారస్తుడి నుంచి నా రోజువారీ కూరగాయలను కొంటుంటాను. అత డొక రైతు. గత సీజన్లో ఉల్లిపాయలు పండించాడు. ఉల్లిపా యలను కిలోకు రూ.20ల లెక్కన అమ్ముతుండేవాడు. కానీ అతడు పండించేది మాత్రం పొలంలోనే కుళ్లిపోతుండేది . కారణం. దళారీలు అతడు పండించిన ఉల్లికి కిలోకు రూపాయి కూడా చెల్లించడానికి ఇష్టపడేవారు కాదు. కాబట్టే అతడు ఉల్లిపాయలను వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) నుంచి కొని వాటిని నాకు అమ్మేవాడు. పొలంలో అతడికి వచ్చే ధరకు, నేను చెల్లించే ధరకు మధ్య రూ. 19ల తేడా ఉండేది. దీనికి దళారీలే కారకులని అతడు ఆరోపించేవాడు. రవాణా ఖర్చులన్నీ పోగా తనకు మిగిలే లాభం చాలా తక్కువని వాపోయే అతడు తన లాభం గురించి ఎన్నడూ చెప్పేవాడు కాదు. తనకొచ్చే లాభంపై అతడు చెప్పేది నమ్మాలో వద్దో కూడా నాకు తెలీదు. రైతును, వినియోగదారుడిని పణంగా పెడుతూ సాగే ఈ వ్యవహారంలో భారీ స్థాయిలో అక్రమ లాభార్జనకు అవకాశముందనేది స్పష్టం. రైతుకు చెల్లించే ధరకు, విని యోగదారుడు చెల్లించే ధరకు మధ్య ఉన్న తేడా (పైన చెప్పి నట్లు రూ.19ల తేడాకే పరిమి తమవుదాం) రైతుకే ప్రయో జనం కలిగిస్తుందంటూ రెండేళ్ల క్రితం యూపీయే-2 పాలనలో వ్యవసాయ మంత్రి శరద్‌పవార్ చెప్పిన విష యాన్ని చిల్లర వ్యాపారికి గుర్తు చేశాను. ‘అంటే మంత్రి ఇప్పుడు లాభార్జనను చట్టబద్ధం చేశారన్నమాట’ అంటూ ఆ వ్యాపారి చెప్పింది సరైందే. రైతులు తాము పండించిన కూరగాయలు, పళ్ల ఉత్పత్తులను నేరుగా వినియోగ దారులకే అమ్ముకోవడాన్ని అనుమతించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం నిర్ణ యించింది. దీనివల్ల రైతులకు మంచి ధర రావడానికీ, వినియోగదారులు సరసమైన ధరకు వ్యవసాయ ఉత్పత్తులు పొందడానికి సాధ్యపడుతుంది. అయితే లబ్ధిదారులకు మేలు చేకూర్చాలంటే చేయవలసింది ఇంకెంతో ఉంది. ఉదాహరణకు, రైతులు తమ పంటలను ఎక్కడికి తీసుకువచ్చి అమ్మాలనేది సమస్య. వారికి తగు సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ప్రభుత్వం సంస్థల నుంచి వీరికి ఎంత సహకారం అందుతుందన్నది అస్పష్టమే. కానీ, చేయడం కంటే చెప్పడం చాలా సులువు. ముందుగా రైతులు సంఘటిత కావలసిన అవసరముంది. రవాణా సదు పాయాలను, విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. తొలినుంచీ కొనసాగుతున్న పలువురు చిల్లర వ్యాపారులు అన్ని నగర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లను కూడా ఆక్రమించేశారు కాబట్టి రిటైల్ స్థలాలను కనుగొనడం రైతులకు కష్టసాధ్యమే. బలమైన రాజకీయ సంబంధాల దన్ను కలిగి, లాభసాటి బేరగాళ్లతో కూడిన వ్యవ స్థీకృత సంస్థ అయిన ఏపీఎంసీ.. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుకు అందించడం కోసం గాను తమ ప్రత్యేక హక్కును వదులుకోదు. వాళ్లు తమ వద్ద ఇప్పటికే ఉన్న పలుకుబడినీ, శక్తినీ ఉపయోగిస్తారు. జూలై 4న కమిషన్ ఏజెంట్లు తమ షాపులను రోజంతా మూసివేశారు. దీంతో మహారాష్ట్రలో ధరలు చుక్కలనంటాయి. పైగా నిరవధిక సమ్మె చేపడతామని వారు బెదిరించారు. మరోవైపు ప్రభుత్వం వ్యవసాయదారులకు, వినియోగదారులకు సాయపడటం మాటేమిటో గానీ, ఏపీఎంసీలో తిష్టవేసిన కమిషన్ ఏజెంట్ల లాబీలను చీల్చడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. మొదట కాంగ్రెస్, తర్వాత కాంగ్రెస్-నేష నల్ కాంగ్రెస్ పార్టీ కూటమి పాలించడం కారణంగా మార్కెట్ కమిటీలో ఈ రెండు పార్టీలు బలంగా పాతుకుపోయాయి. దీన్ని బద్దలు చేయాలని బీజేపీ తలుస్తోంది తప్పితే, మార్కెట్ క్రమబద్ధీకరణను ఎత్తివేయాలని అది కోరుకోవడం లేదు. అయితే మొజాంబిక్ దేశం నుంచి దిగుమతవుతున్న కందిపప్పును కేంద్రం నుంచి కిలోకు రూ.55లకే తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రేషన్ షాపుల్లో కూడా కిలో రూ.120ల ధరకు అమ్ముతుండటాన్ని ఏమనాలి? వాస్తవానికి ప్రభుత్వమే ఒక దళారీ. ఇలాంటి నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ గురించి బాధ పడటం దేనికి? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ మెయిల్ : mvijapurkar@gmail.com - మహేష్ విజాపుర్కార్ -
ఉల్లి రైతులకు బొనాంజ
రాష్ట్రంలో ఉల్లి సాగు చేసే రైతులకు ఎకరానికి రూ. 5 వేల సబ్సిడీ ఇవ్వాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉల్లి కొరతను ఎదుర్కొనేందుకు ఉద్యానశాఖ చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. బయట నుంచి దిగుబడిని తగ్గించి రాష్ట్రంలోనే ఉల్లి సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుతం 75 శాతం రాయితీతో ఉల్లి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దాంతోపాటు ఉల్లి సాగు చేసే రైతులకు రూ. 5 వేలు సబ్సిడీ ఇవ్వాలని కూడా ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15 వేల హెక్టార్లలో ఉల్లి సాగు చేస్తుండగా... మరో 10 హెక్టార్లకు పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఉల్లి సాగు కోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉల్లి సాగు చేసే రైతులను గుర్తించారు. ప్రస్తుతం ఎకరానికి రూ. 60 వేల వరకు ఖర్చుచేస్తే కేవలం 6 టన్నుల ఉల్లి మాత్రమే పండుతోంది. దీంతో కొత్తగా విత్తనం తీసుకొచ్చారు. అది ఎకరానికి 12 టన్నుల దిగుబడి వస్తోంది. ప్రస్తుతం కిలో ఉల్లి ఉత్పత్తి చేయాలంటే రూ. 10 ఖర్చు అవుతోంది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఉల్లి నిల్వ కోసం రూ. 2 లక్షలు ఖర్చు అవుతుంది. అందులో రూ. లక్ష రాయితీ ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఇలా అనేక రకాలుగా రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఈ ఏడాది స్వయం సమృద్ధి దిశగా ముందుకు వెళ్లాలని ఉద్యానశాఖ సంకల్పించింది. -
ఉల్లి వ్యాపారి లొల్లి
♦ మార్కెట్లో ధరల మోత.. ♦ రైతుకు వాత సిండికేట్‌గా ఏర్పడిన వ్యాపారులు ఉల్లి పంట పండిందని ఆనందంతో ఉన్న రైతుల ఆశలను వ్యాపారులు మొగ్గలోనే తుంచివేస్తున్నారు. కిలో రూ.20 చొప్పున కొంటూ గోదాముల్లో దాచుకుంటున్నారు. బయట మార్కెట్లో మాత్రం ఉల్లి తల్లి బంగారమైంది. కిలో రూ.60-70 పెట్టి కొనలేక సామాన్యుల వంటింట్లో ఉల్లి కరువైంది. నాలుగు గడ్డలను కోసి కూరల్లో వేయడానికి మహిళల చేతులాడటం లేదు. పెండ్లిమర్రి : ఆరుగాలం కష్టపడి శ్రమించిన రైతులకు కష్టాలు, నష్టాలు త ప్పడం లేదు. దళారులు సిండికేట్‌గా ఏర్పడి ఉల్లి రైతు కంట నీరు తెప్పిస్తున్నారు. కష్టపడి ఉల్లి పంట సాగు చేసిన రైతులకు కష్టం తప్ప ఫలితం రావడం లేదు. మార్కెట్లో ఉల్లిపాయల ధర ఆకాశాన్నంటుతుండగా, వ్యాపారులు మాత్రం రైతుల వద్ద నుంచి క్వింటాలు రూ. రెండు వేలు చొప్పున కొనుగోలు చేస్తున్నారు. పెండ్లిమర్రి, వేముల, సికె దిన్నె, మైదుకూరు, వేంపల్లె, ఖాజీపేట, ముద్దనూరు తదిత ర మండ లాల్లో 2500 హెక్టార్లలో ఉల్లి పంటను సాగు చేశారు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే రాష్ట్రానికి కావాల్సినంత సరఫరా కాకపోవడం, మార్కెట్ మాయాజాలం వల్ల ప్రస్తుతం ఉల్లి కిలో రూ.40 నుంచి రూ.70 దాకా విక్రయిస్తున్నారు. ఇదే అవకాశంగా భావించిన కొందరు వ్యాపారులు ఎక్కడికక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి గోదాముల్లో దాచి పెడుతున్నారు. ఉల్లి వ్యాపారులందరూ సిండికేట్‌గా ఏర్పడి.. రాజమండ్రి, తాడేపల్లె గూడెంలో మార్కెట్ ధరలు తగ్గాయని కిలో రూ.20-25 అయితే కొనుగోలు చేస్తాం, లేదంటే లేదని ఒకే మాటపై ఉన్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతుల దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తే తమకు గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. దళారులు సిండికేటయ్యారు ఎకరం పొలం కౌలుకు తీసుకుని ఉల్లిపంట సాగు చేశాను. పంట బాగా పండింది. ధరలు బాగా ఉండడంతో మంచి లాభాలు వస్తాయనే ఆశతో ఉన్నాం. ప్రస్తుతం దళారులు కుమ్మక్కై కిలో రూ.20 చొప్పున అడుగుతున్నారు. మార్కెట్లో మాత్రం కిలో రూ. 50-60 అమ్ముతున్నారు. దళారుల మూలంగా నష్టపోతున్నాం. - లింగాల గోపాల్, రైతు, రామచంద్రాపురం, పెండ్లిమర్రి మండలం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశాను. రెండు ఎకరాల్లో వచ్చిన గడ్డలను కిలో రూ.32 చొప్పున అమ్మాను. ప్రస్తుతం దళారులు, వ్యాపారులు సిండికేటై రూ.20-25 రేటు పెడుతున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలాగైతే మాకు లాభాలు రావు. ప్రభుత్వం రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలి. - సికె బసిరెడ్డి, రైతు, బాలయ్యగారిపల్లె, పెండ్లిమర్రి మండలం -
ఉల్లి రైతుల కన్నీరు
రైతులను దగా చేస్తున్న కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మాయాజాలంతో ధర అంతంత మాత్రమే నష్టాలను మూటగట్టుకుంటున్న ఉల్లి రైతులు కర్నూలు(అగ్రికల్చర్): గిట్టుబాటు ధర రాక ఉల్లి రైతులు క న్నీరు పెట్టుకుంటున్నారు. ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ఎకరాకు దాదాపు రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. మామూలుగా అయితే 60 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది. అనావృష్టి వల్ల ప్రస్తుతం 25 నుంచి క్వింటాళ్లు మాత్రమే వస్తోంది. దీనికితోడు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారుల మాయాజాలం వల్ల ధర పెరగకపోగా మరింత తగ్గుతోంది. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. అనామత్తో నష్టాలు.. కర్నూలు మార్కెట్లో ఉల్లిని వేలంపాట ద్వారా కొనాల్సి ఉంది. అరుుతే వ్యాపారులు అనామత్ కొనుగోళ్లపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వేలంపాట ద్వారా ధర రూ.1000 ఆపైన లభిస్తే అనామత్పైన రూ.800 నుంచి రూ.900 ధరకే కొనుగోలుచేస్తున్నారు. దీనివల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. రైతులు కూడా రోజుల తరబడి మార్కెట్లో ఉండలేక ఏదో ఒక ధరకు అమ్ముకుని నష్టాలపాలవుతున్నారు. ఈ క్రమంలో స్థానిక రైతులు తాడేపల్లి గూడేనికి తరులుతున్నారు. ధరలో వ్యత్యాసం.. కర్నూలు మార్కెట్‌కు రోజుకు 50 లారీల ఉల్లి వస్తుంటే, తాడేపల్లి గూడెం మార్కెట్‌కు 60 లారీల ఉల్లి జిల్లా నుంచి వెళుతోంది. అక్కడ క్వింటాఉల్లికి రూ.1800 నుంచి రూ.2000 వరకు అత్యధిక ధర లభిస్తోంది. మధ్యస్తంగా రూ.1400 నుంచి రూ.1500 వరకు లభిస్తోంది. అదేకర్నూలులో అత్యధిక ధర రూ.1125 ఉండగా, మధ్యస్తంగా రూ.600 నుంచి రూ.800 వరకు పోతోంది. అదనపు చార్జీలతో మోసం రైతు 50 క్వింటాళ్ల ఉల్లిని మార్కెట్‌కు వేస్తే క్లీనింగ్ పేరుతో రెండు క్వింటాళ్ల ఉల్లిని తీసేస్తున్నారు. పైగా కమీషన్ ఏజెంట్లు క్లీనింగ్ చార్జీలను కూడా రైతులపై వేస్తుండడంతో మరింత నష్టపోతున్నారు. తాడేపల్లి గూడెంలో ఉల్లికి క్లీనింగ్ లేదు. లారీల్లో ఉల్లిని తీసుకుపోతే అక్కడక్కడ నాలుగు ప్యాకెట్లు తీసి కింద పోసి వేలంపాట ద్వారా ధర నిర్ణయిస్తారు. ఇక్కడ మాత్రం మొత్తం క్లీన్ చేసిన తర్వాతే కొంటారు. ఇలా చేయడం వల్ల కోత, కుప్ప, క్లీనింగ్ చార్జీలు రైతులపై అదనంగా పడుతున్నాయి. అదేవిధంగా లోడింగ్, సంచులకు నింపి కాటాపై పెట్టేందుకు చార్జీలను వ్యాపారి భరించాలి. కమీషన్ ఏజెంట్లు మాత్రం ఇవి కూడా రైతుల నుంచి వసూలు చేస్తూ దగా చేస్తున్నారు. రైతులు తాము తెచ్చిన సరుకును అమ్ముకున్న తర్వాత కమీషన్ ఏజెంట్లు మార్కెట్ కమిటీ జారీ చేసిన తక్ పట్టీలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో రైతు తెచ్చిన సరుకు, ఎన్ని క్వింటాళ్లు అమ్మారు, ధర ఎంత, కూలీ, హమాలీ చార్జీలన్నీ నమోదు చేసి ఇవ్వాలి. కానీ 50 శాతం కమీషన్ ఏజెంట్లు తక్ పట్టీలు ఇవ్వకుండా కాగితాలపై వివరాలు రాసి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే కమీషన్ ఏజెంట్లు జీరో వ్యాపారానికి పాల్పడుతూ ఇటు ప్రభుత్వానికి, అటు రైతులను మోసం చేస్తున్నారు. ఇటు వ్యాపారుల మాయాజాలం, అటు కమీషన్ ఏజెంట్ల దగా వల్ల ఉల్లి రైతులు నష్టాలపాలవుతున్నాడు. -
అకాల వర్షం.. అపార నష్టం
మోమిన్‌పేట, న్యూస్‌లైన్: అకాల వర్షం వల్ల అపార నష్టం జరిగింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఉల్లి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సోమవారం రాత్రి వడగళ్లకు మండలంలో ఉల్లిపంట పూర్తిగా దెబ్బతిన్నది.మండలంలో మేకవనంపల్లి, కోల్కుంద, రాళ్లగుడుపల్లి, ఏన్కతల, కాసులాబాదు, బూర్గుపల్లి, మోమిన్‌పేట, దేవరంపల్లి, చీమల్‌దరి, చక్రంపల్లి తదితర గ్రామాల్లో సుమారు 800ఎకరాల్లో ఉల్లి పంట సాగుచేశారు. వర్షం పడటంతో ఉల్లిఆకు పూర్తిగా నేలవారింది. ఉల్లిగడ్డ ఊరే దశంలో ఆకులన్నీ విరిగి నేలకొరగడంతో పంట ఆగిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. ఎన్నో కష్టనష్టాలకోర్చి పంటలను సాగుచేస్తే వడగళ్లు దెబ్బతిశాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లినారు వేసేటప్పుడు నానాఇబ్బందులు పడి...పంట ఎదుగుదల బాగుంది అనుకుంటుండగా అకాల వర్షం నిరాశకు గురిచేసిందని వారు వాపోతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టితే వర్షం వల్ల అన్నీ నెలపాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు. శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న వడగళ్లవాన, ఈదురుగాలులకు వందలాది ఎకరాల కూరగాయలు, ద్రాక్ష తోటలు దెబ్బతిన్నాయి. ద్రాక్ష తోటల యజమానులకు లక్షల్లో నష్టం వాటి ల్లింది. మండలంలోని 22 పంచాయతీల పరిధిలో ఈ సీజన్లో వంద ఎకరాల పత్తి, ఏడు వందల ఎకరాల్లో మామిడి, వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉంది. సోమ, మంగళవారాలు కురిసిన భారీ వర్షాలకు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మండలంలోని లాల్గడిమలక్పేట్, శామీర్‌పేట్, బాబాగూడ, అలియాబాద్, పొన్నాల్, బొమ్మరాశిపేట్, కొల్తూర్, అనంతారం, పోతారం, నారాయణపూర్ గ్రామాలు ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. వారం రోజుల క్రితం ద్రాక్ష తోట, మామిడి పూత బాగుండడంతో ఆశించిన మేరకు దిగుబడులు వస్తాయని రైతన్న ఆనందంలో ఉన్నాడు. ఇంతలోనే అనుకోని వర్షాలు వారి ఆశలను గల్లంతు చేశాయి. పోతారంలో 15 ఎకరాలు, తుర్కపల్లిలో 200 ఎకరాలు, కొల్తూర్‌లో 60 ఎకరాలు, లక్ష్మాపూర్‌లో 40ఎకరాల్లో ద్రాక్ష తోటలు పూర్తిగా నాశనమయ్యాయి. వీటితో పాటు 300 ఎకరాల్లో మామిడి తోటలు పాడయ్యాయి. ఆరేళ్లుగా న ష్టాలతో ఉన్న తమపై ప్రకృతి మరోసారి ప్రతాపం చూపిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.