
సాక్షి, తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్‌గా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో సారి ఛైర్మన్‌గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వారం, పది రోజుల్లో పాలకమండలి సభ్యుల నియామకం ఉండనుంది.
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2019 జూన్ 21న టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం ఈ ఏడాది జూన్ 21వ తేదీకి ముగిసింది. దీంతో టీటీడీ పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డిని రెండోసారి చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment