
రాజంపేట : వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ పైనుంచి పల్టీ కొట్టి ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన రాజంపేట పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మన్నూరుకు చెందిన కిరణ్ (30) గతనెల 22న గణేష్ నిమజ్జనంలో ఉత్సాహంగా ట్రాక్టర్‌పై నుంచి విన్యా సం చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తమ ప్రాంత వినాయకుని నిమజ్జనం ర్యాలీ భారీగా వాయ్యిదాలు, బాణసంచాలను కాలుస్తూ పట్టణంలోని పాత బస్టాండుకు చేరుకుంది. ఈ క్రమంలో కిరణ్ ఉన్నఫళంగా ట్రాక్టర్ ఇంజిన్‌పై నుంచి పల్టీ కొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో అదుపుతప్పి పడ్డాడు. దీంతో మెడ, తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
నరాలు దెబ్బతినడంతో లాభం లేదని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి 20రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి అమ్మానాన్నతో పాటు అన్న ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment