శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు. మార్గశిరమాసం, తిథి: శు.విదియ ప.12.30 వరకు, తదుపరి తదియ నక్షత్రం: మూల సా.4.51 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం: ప.3.14 నుండి 4.50 వరకు, తదుపరి రా.2.38 నుండి 4.14 వరకు,దుర్ముహూర్తం: ఉ.8.32 నుండి 9.20 వరకు, తదుపరి రా.10.35 నుండి 11.23 వరకు, అమృతఘడియలు: ఉ10.05 నుండి 11.34 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.18, సూర్యాస్తమయం: 5.20.
మేషం..దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి. ధనవ్యయం.
వృషభం...కుటుంబంలో చికాకులు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ఆరోగ్య సమస్యలు.
మిథునం....పనులు విజయవంతంగా పూర్తి. సోదరుల నుంచి ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కర్కాటకం...దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు. ఆలయాల సందర్శనం.
సింహం.....కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు.
కన్య.....వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మానసిక అశాంతి. అనారోగ్యం.
తుల....ఆశయాలు నెరవేరతాయి. ధనప్రాప్తి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
వృశ్చికం...వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అప్పులు చేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
ధనుస్సు....కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనుకోని «విధంగా ధనలాభం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం....ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
కుంభం..కాంట్రాక్టులు పొందుతారు. యత్నకార్యసిద్ధి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
మీనం...పరిచయాలు పెరుగుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment