శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.విదియ ప.12.21 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: పునర్వసు రా.3.01 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ప.3.02 నుండి 4.36 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.37 నుండి 9.21 వరకు తదుపరి రా.10.36 నుండి 11.30 వరకు, అమృతఘడియలు: రా.12.35 నుండి 2.11 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.27, సూర్యాస్తమయం: 5.25.
మేషం... ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభం కలుగుతుంది. వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. ఉద్యోగాలలో హోదాలు దక్కుతాయి.
వృషభం...దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.
మిథునం... యత్నకార్యసిద్ధి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
కర్కాటకం...అనుకోని ప్రయాణాలు, బంధువులతో కొద్దిపాటి విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.
సింహం...ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూ, వాహనలాభాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు
కన్య....నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు సత్కారాలు.
తుల...రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.
వృశ్చికం...ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో ఆటంకాలు. శ్రమా«ధిక్యం.
ధనుస్సు...ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
మకరం....కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కుంభం...పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.
మీనం...ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు. అనారోగ్యం.
Comments
Please login to add a commentAdd a comment