Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు | daily horoscope 18th september 2024 | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు

Published Wed, Sep 18 2024 6:42 AM | Last Updated on Wed, Sep 18 2024 8:32 AM

daily horoscope 18th september 2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు  భాద్రపద మాసం, తిథి: పౌర్ణమి ఉ.8.55 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.12.58 వరకు తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: రా.9.54 నుండి 11.24 వరకు, దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.20 వరకు,అమృతఘడియలు: లేవు, మహాలయ పక్షం ప్రారంభం. 

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

మిథునం: మిత్రుల సలహాలు పాటిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత నిరాశాజనకంగా సాగుతాయి.

సింహం: కార్యక్రమాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కన్య: వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

తుల: సన్నిహితులు సహకరిస్తారు. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తుంది.

మకరం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: నేర్పుగా వ్యవహరించడం మంచిది. అనారోగ్యం. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement