Horoscope Today: ఈ రాశివారికి ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది | Daily Horoscope: Rashi Phalalu On April 9th 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశివారికి ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది

Published Tue, Apr 9 2024 7:24 AM | Last Updated on Tue, Apr 9 2024 12:21 PM

Daily Horoscope: Rashi Phalalu On April 9th 2024 In Telugu - Sakshi

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: శు.పాడ్యమి రా.10.06 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: రేవతి ఉ.8.32 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: రా.2.56 నుండి 3.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.19 నుండి 9.07 వరకు తదుపరి రా.10.53 నుండి 11.41 వరకు, అమృతఘడియలు: ఉ.6.20 నుండి 7.55 వరకు, ఉగాది పండగ.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

మేషం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

వృషభం: ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభాలు. మిత్రులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశంసలు.

మిథునం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆకస్మిక  ప్రయాణాలు. వ్యాపారాలు ,ఉద్యోగాలు కొంత ఊరటనిస్తాయి.

కర్కాటకం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. దూరపు బంధువులతో చర్చలు. కీలక నిర్ణయాలు.. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.. దైవదర్శనాలు.

సింహం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య: మిత్రులతో కొంత సఖ్యత. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

తుల: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్య నిర్ణయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. పనుల్లో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధువులు, మిత్రుల కలయిక. అత్యంత ముఖ్య సమాచారం. వ్యాపారాలలో కొంత నిరుత్సాహం. ఉద్యోగులకు పనిభారం తగ్గే సూచనలు..

మకరం: బంధువులతో సఖ్యత. విందువినోదాలు. ఆస్తిలాభం. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

కుంభం: కొన్ని పనులలో జాప్యం. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  ఆర్థిక ఇబ్బందులు కొంత తగ్గవచ్చు. దూరప్రయాణాలు. కొన్ని సమస్యలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.

మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో ఆలస్యం. ఆరోగ్యం కుదుటపడుతుంది.  శ్రమ పడినా ఫలితం కనిపిస్తుంది.. బంధువుల నుండి శుభవార్తలు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఉత్సాహం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement