Horoscope today: ఈ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు | Today Telugu Horoscope On April 15th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు

Published Mon, Apr 15 2024 6:18 AM | Last Updated on Mon, Apr 15 2024 10:21 AM

Daily Horoscope: Rasi Phalalu On April 15 2024 In Telugu - Sakshi

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.సప్తమి ప.3.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పునర్వసు పూర్తి (24గంటలు), వర్జ్యం: సా.5.44 నుండి 7.24 వరకు, దుర్ముహూర్తం: ప.12.23 నుండి 1.14 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: రా.3.22 నుండి 5.56 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.49, సూర్యాస్తమయం: 6.11

మేషం: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. బంధువుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. నిర్ణయాలలో పొరపాట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: వివాహయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృశ్చికం: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: స్థిరాస్తి వృద్ధి. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో కలహాలు. దైవదర్శనాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులకు సిద్ధపడాలి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement