
శ్రీ శోభకృత్æ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి: శు.అష్టమి రా.2.24 వరకు, తదుపరి నవమి. నక్షత్రం: మృగశిర రా.9.15 వరకు. తదుపరి ఆరుద్ర. వర్జ్యం: తె.5.51 నుండి 7.31 వరకు (తెల్లవారితే సోమవారం). దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.17 వరకు.
అమృతఘడియలు: ప.12.22 నుండి 2.01 వరకు
మేషం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
కర్కాటకం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు.
సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
కన్య: బంధుమిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.
తుల: పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
వృశ్చికం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.
ధనుస్సు: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
Comments
Please login to add a commentAdd a comment