Horoscope: ఈ రాశివారికి కార్యజయం.. నూతన ఉద్యోగయోగం | Daily Horoscope In Telugu: February 24, 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope Telugu: ఈ రాశివారికి కార్యజయం.. మిగతా రాశులవారికి ఇలా..

Published Sat, Feb 24 2024 6:33 AM | Last Updated on Sat, Feb 24 2024 8:18 AM

Daily Horoscope In Telugu: Today Feb 24 Astrology - Sakshi

గ్రహఫలం.. శనివారం, 24.03.24

మేషం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పనుల్లో కొన్ని అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

మిథునం: రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉన్నతి.

కర్కాటకం: బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కన్య: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..

వృశ్చికం: కార్యజయం. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

ధనుస్సు: శ్రమ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement