Rasi Phalalu: ఈ రాశివారికి ఆస్తి లాభం.. శుభవార్తలు వింటారు | Daily Horoscope Today On July 31 2024 Rasi Phalalu In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు, ఏ రాశివారికి ఎలాగ ఉందంటే..

Published Wed, Jul 31 2024 6:36 AM | Last Updated on Wed, Jul 31 2024 8:33 AM

Daily Horoscope Today On July 31 2024 Rasi Phalalu In Telugu

గ్రహఫలం.. బుధవారం, 31.07.24

మేషం: ప్రయాణాలు చివరిలో వాయిదా. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం. చర్చల్లో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం. వస్తులాభాలు.

మిథునం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక డీలాపడతారు.

కర్కాటకం: కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తి లాభసూచనలు.  ప్రముఖుల పరిచయం. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత రాణింపు.

సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. భూవివాదాల పరిష్కారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కన్య: రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆస్తిలాభం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు. ఆర్థిక ప్రగతి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మకరం: శ్రమ పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఎదురవుతాయి.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త సమస్యలు.

మీనం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement