శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: బ.అష్టమి ఉ.8.47 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: శతభిషం ఉ.5.50 వరకు, తదుపరి పూర్వాభాద్ర తె.4.08 వరకు (తెల్లవారితే శనివారం), వర్జ్యం: ఉ.11.46 నుండి 1.15 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.04 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.24 నుండి 1.16 వరకు,
అమృతఘడియలు: రా.8.41 నుండి 10.11 వరకు;
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు,
సూర్యోదయం : 5.28,
సూర్యాస్తమయం : 6.26.
మేషం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృషభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తిలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరుల నుంచి ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
మిథునం: చేపట్టిన కార్యాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.
కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.
సింహం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.
కన్య: ఇంటాబయటా అనుకూలం. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. ఉద్యోగలాభం. కార్యసిద్ధి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
తుల: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో స్వల్ప అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: కుటుంబసభ్యులతో కలహాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు మార్పులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: ఆకస్మిక ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు ఉన్నతి.
మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.
కుంభం: కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మీనం: శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
Comments
Please login to add a commentAdd a comment