Rasi Phalalu: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది | Today Telugu Horoscope On March 14th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu - Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది

Published Thu, Mar 14 2024 6:19 AM | Last Updated on Thu, Mar 14 2024 9:49 AM

Rasi Phalalu: Daily Horoscope March 14 2024 Telugu - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి: శు.చవితి ఉ.6.40 వరకు, తదుపరి పంచమి తె.4.52 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం: భరణి రా.10.08 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: ఉ.8.24 నుండి 9.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.10 నుండి 10.58 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: సా.5.40 నుండి 7.10 వరకు. సూర్యోదయం :    6.14 సూర్యాస్తమయం    :  6.06 రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుండి 7.30 వరకు 

మేషం: శుభవార్తలు. స్థిరాస్తి వృద్ధి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. కష్టమే తప్పితే ఫలితం కనిపించదు. సోదరులతో మాటపట్టింపులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వాహనసౌఖ్యం. భూవివాదాలు పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యవహారాలు ముందుకు సాగవు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

కన్య: కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆస్తుల వివాదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు: విచిత్ర సంఘటనలు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మీనం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement