ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope From 17-11-24 To 23-11-24 In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Nov 17 2024 3:16 AM | Last Updated on Sun, Nov 17 2024 3:16 AM

Weekly Horoscope From 17-11-24 To 23-11-24 In Telugu

మేషం
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో విభేదాలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు. ఆరోగ్య, కుటుంబసమస్యలతో కుస్తీపడతారు. విద్యార్థులకు కొంతమేర ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు విధులు కత్తిమీదసాముగా ఉంటాయి. క్రీడాకారులు, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. విందువినోదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు, శ్రీరామస్తోత్రాలు పఠించండి.

వృషభం
పనుల్లో అనూహ్య విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో ఆదరణ, పేరు గడిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు కాస్త తీరతాయి. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రశాంతత చేకూరుతుంది. వైద్య, పారిశ్రామికవర్గాలకు సమస్యలు తీరతాయి. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో చిక్కులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం
కొన్ని సమస్యలు, వివాదాలను మనోబలంతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులు తమలోని ప్రతిభ చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. ఆరోగ్యం కొంత ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపారస్తుల అంచనాలు ఫలించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుండి విముక్తి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో ఖర్చులు అధికం. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఎరుపు, లేత పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలను క్రమపద్ధతిలో విస్తరిస్తారు. ఉద్యోగులు శ్రమకు తగిన ఫలితం దక్కించుకుంటారు. టెక్నికల్,  శాస్త్రవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఎరుపు, పసుపు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం
చేపట్టిన కార్యక్రమాలు  సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. పాతమిత్రుల నుంచి  కీలక సమాచారం అందుతుంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఖర్చులు అదుపులో పెడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త భాగస్వాముల చేరికతో విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులు, వైద్యరంగం వారి యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు రావచ్చు.  ఆకుపచ్చ, గులాబీ రంగులు, గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

కన్య
ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. అందరిలోనూ పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు.  బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలను చక్కదిద్ది లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. క్రీడాకారులు, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో మానసిక అశాంతి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పసుపు, నేరేడు రంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.

తుల
ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పర్చినా అవసరాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో చర్చిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో కొంత  పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన సమయం. టెక్నికల్, పరిశోధనారంగాల వారికి శుభవర్తమానాలు. వారం ప్రారంభంలో వృధా ఖర్చులు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. గులాబీ, నేరేడు రంగులు,  నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం
ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఓర్పు, నేర్పుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలను చాకచక్యంగా నిర్వహించి లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి రావచ్చు. వైద్య, రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆప్తులతో విరోధాలు. అనారోగ్యం. నేరేడు, ఎరుపు రంగులు,  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు
ఏ పని చేపట్టినా విజయమే. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి మరింత విస్తరిస్తారు.  ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు ఊహించని ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో మానసిక ఆందోళన. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మకరం
పనులు మరింత వేగంగా  పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో వివాదాలు కొంత తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు. ఐటీ, రాజకీయవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా లభిస్తాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఒప్పందాలను వాయిదా వేస్తారు. నలుపు, చాక్లెట్‌ రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.  కొన్ని కార్యక్రమాలు స్వయంగా పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగులకు పనిభారం తగ్గి ఊరట కలుగుతుంది. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వివాదాలు నెలకొంటాయి. గులాబీ, ఆకుపచ్చరంగులు,  శివాష్టకం పఠించండి.

మీనం
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు ఇబ్బందులు రావు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. విద్యార్థులు అనూహ్యమైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలను అంచనాల మేరకు విస్తరించేందుకు సన్నద్ధమవుతారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు సంభవం. వైద్యులు, కళాకారులకు ఒత్తిడులు తగ్గుతాయి. వారం మధ్యలో లేనిపోని చికాకులు. మాన సిక  ఆశాంతి. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆకుపచ్చ, తెలుపు రంగులు,  ఆంజనేయ దండకం పఠించండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement