Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే.. | Weekly Horoscope From 22-09-24 To 28-09-24 In Telugu | Sakshi
Sakshi News home page

Weekly Horoscope: ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Published Sun, Sep 22 2024 6:49 AM | Last Updated on Sun, Sep 22 2024 8:42 AM

Weekly Horoscope From 22-09-24 To 28-09-24 In Telugu

మేషం
పట్టుదల, నేర్పరితనం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఏపనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. తీర్థయాత్రలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాల్చే సూచనలు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. బాధ్యతలకు గుర్తింపు లభిస్తుంది.  రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, పసుపు రంగులు.గణేశాష్టకం పఠించండి.

వృషభం
కార్యక్రమాలను నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో చర్చలు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఆదాయం మరింత పెరిగి రుణబాధలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి. నీలం, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం
ఆర్థిక విషయాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం నెలకొంటుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మీ ఊహలు నిజం కాగలవు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు.  నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం
రహస్య విషయాలు తెలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక సంఘటన ఆకట్టుకోవడమే కాదు, మీ ఆలోచనలు మారుస్తుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులు బాధ్యతలపై మరింత శ్రద్ధ వహిస్తారు. కళాకారులకు అనుకూల పరిస్థితులు, ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు,  లాభాలు అందుతాయి. ఉద్యోగులకు వివాదాలు తీరతాయి. పారిశ్రామికవేత్తల యత్నాలు అనుకూలిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, ఆకుపచ్చ రంగులు.  శివస్తోత్రాలు పఠించండి.

కన్య
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి.  పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. విలాసవంతంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం రాగలదు. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. నేరేడు, తెలుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

తుల
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. కొన్ని వ్యవహారాలలో సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు.  గణేశాష్టకం పఠించండి.

వృశ్చికం
అనుకున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. విద్యార్థులు ప్రతిభాపాటవాలు చాటుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, నేరేడు రంగులు. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
కొన్ని పనులు కొంత నెమ్మదిస్తాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. దూరపు బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. మీ అంచనాలు నిజం కాగలవు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, పసుపు రంగులు. గణపతిని పూజించండి.

మకరం
ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరపతి మరింతగా పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి సంఘటనలు కొన్ని జ్ఞప్తికి వస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కే అవకాశం. కళాకారులకు కార్యసిద్ధి, సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం
వ్యవహార విజయంలో ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు రాగలవు. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వివాహయత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగుల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన పరిస్థితి. పారిశ్రామికవర్గాలకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి.

మీనం
ఆర్థిక విషయాలలో చికాకులు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలతో కొంత ఇబ్బంది పడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. సోదరులు, సోదరీలతో అకారణంగా వివాదాలు నెలకొనవచ్చు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిరకాల మిత్రులు కొంత సహాయపడతారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవేత్తల యత్నాలు నత్తనడకన సాగుతాయి. వారం మధ్యలో శుభవార్తా శ్రవణం. విందువినోదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement