Weekly Horoscope April 09th TO April 15th 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి వారం మధ్యలో శుభవార్త అందుతుంది, ధనలాభం

Published Sun, Apr 9 2023 6:48 AM | Last Updated on Sun, Apr 9 2023 11:33 AM

Weekly Horoscope Telugu 09-04-2023 To 15-04-2023 - Sakshi

మేషం..
ఏ పని చేపట్టినా ఎవరి సహాయం లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ఇంటి నిర్మాణాలకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం మీలో ఉత్సాహాన్నిస్తుంది. నేర్పు, చాకచక్యంతో దీర్ఘకాలిక సమస్య పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో స్థిరమైన హోదాలు దక్కుతుంది. పారిశ్రామికవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో వృథా వ్యయం. మానసిక ఆందోళన. తెలుపు, ఎరుపు రంగులు. శివాష్టకం పఠించండి.

వృషభం..
పొరపాట్లు సరిదిద్దుకుని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజసేవకు అంకితమవుతారు. మీ సేవలకు మరింత గౌరవం లభిస్తుంది. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. అందరి మనస్సులను ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలలో విశేష పురోగతి ఉంటుంది. కాంట్రాక్టులు దక్కవచ్చు. వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం..
గతానుభవాల ఆధారంగా కొన్ని నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. మిత్రుల సహాయసహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. మీ ఖ్యాతి మరింత పెరిగి అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా మరింత ప్రగతి కనిపిస్తుంది. ఎటువంటి సమస్య ఎదురైనా తేలిగ్గా పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని నడిపిస్తుంది. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో విస్తృత లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మీ అభిరుచికి తగిన మార్పులు చోటుచేసుకుంటాయి. కళారంగం వారు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. స్వల్ప రుగ్మతలు. ఆకుపచ్చ,నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం..
కొత్త వ్యవహారాలు నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుకుంటారు. మీ సేవలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. చిన్ననాటి గుర్తుకు వస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. వివాహాది వేడుకలకు సన్నాహాలలో నిమగ్నమవుతారు. గృహం కొనుగోలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో కళకళలాడతాయి. ఉద్యోగాలలో ఎదుర్కొన్న ఇబ్బందులు తీరతాయి. రాజకీయవర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. తెలుపు, ఎరుపు రంగులు. కనకధారా స్తోత్రాలు పఠించండి.

సింహం..
గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ప్రస్తుతం పూర్తి చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలులో ప్రతిబంధకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత సాఫీగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహణపై పెద్దల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారు పరిచయం కాగలరు. వాహనయోగం. మీ అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. దూరపు బంధువుల రాకతో కుటుంబంలో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. గులాబీ, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కన్య..
ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలలో వెనుకడుగు వేస్తారు. కొందరు మిత్రులు మీ పట్ల వ్యతిరేకత చూపవచ్చు. ఎటువంటి కార్యక్రమం చేపట్టినా నిదానం పాటించండి. కొన్ని విషయాలలో పొరపాట్లు దొర్లి ఇబ్బందిపడతారు. ఆస్తులపై సోదరులతో కొన్ని వివాదాలు రావచ్చు. వ్యాపారాలు అంతంత మాత్రంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త వివాదాలు రావచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో చర్చలు సఫలం. ధనప్రాప్తి. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

తుల..
బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. అందరిలోనూ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.. రాజకీయవర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఆకుపచ్చ, పసుపు  రంగులు, . నవగ్రహస్తోత్రాలు  పఠించండి.

వృశ్చికం..
అనుకున్న పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల నుంచి  ఆహ్వానాలు అందుతాయి.   కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబంలో  వివాదాలు.  ఎరుపు, పసుపు రంగులు,  ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు..
ముఖ్యమైన వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ప్రముఖులను కలుసుకుని కీలక  విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పాత విషయాలు కొన్ని  గుర్తుకు తెచ్చుకుంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. తెలివిగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాల యత్నాలలో  పురోగతి కనిపిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.  ఆకుపచ్చ, నీలంరంగులు. శివపంచాక్షరి పఠించండి.

మకరం..
ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులు,మిత్రులతో ముఖ్య  విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాలలో  ప్రోత్సాహకరంగా ఉంటుంది.  పారిశ్రామికవర్గాలకు శ్రమపడినా ఫలితం దక్కుతుంది. వారం  మధ్యలో వృథా ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు.æనీలం, లేత ఆకుపచ్చరంగులు,  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కుంభం..
దీర్ఘకాలికంగా వేధిస్తున్న  వివాదం నుంచి గట్టెక్కే సూచనలు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సైతం చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం.  నేరేడు, గులాబీరంగులు,  హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

మీనం..
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. యుక్తి, పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి.  బంధువుల నుంచి అందిన సమాచారం. అందుకుంటారు. విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు సజావుగా కొనసాగుతూ లాభాలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు విశేష∙ప్రగతి కనిపిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి.  ఎరుపు,  తెలుపు రంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement