ఈ వారంలో వీరికి తండ్రి ద్వారా ధన, ఆస్తిలాభాలు | Weekly Horoscope Telugu 21-08-2022 To 27-08-2022 | Sakshi
Sakshi News home page

ఈ వారంలో వీరికి తండ్రి ద్వారా ధన, ఆస్తిలాభాలు

Published Sun, Aug 21 2022 7:43 AM | Last Updated on Thu, Aug 25 2022 10:44 AM

Weekly Horoscope Telugu 21-08-2022 To 27-08-2022 - Sakshi

మేషం 
(అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని వ్యవహారాలను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి అప్పులు చేస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన నిరాశ పరుస్తుంది. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులతో సతమతమవుతారు.  వ్యాపారాలు మరింత నిదానిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం మీదపడి ఉక్కిరిబిక్కిరి కాగలరు.  వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి.

వృషభం
(కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు రావచ్చు. వాహనాలు, భూముల కొనుగులుపై దృష్టి సారిస్తారు.  వ్యాపారాలలో మీ అంచనాల మేరకు లాభాలు రావచ్చు.  ఉద్యోగాలలో బాధ్యతలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం.  పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం
(మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి పుంజుకుని అవసరాలకు ఆదుకుంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  నిరుద్యోగులకు శుభవార్తలు అందవచ్చు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకునే సమయం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యత అయినా తేలిగ్గా పూర్తి చేస్తారు. రాజకీయవర్గాలకు పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. నీలం,ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి. ఇంటి నిర్మాణయత్నాలు వేగవంతం చేస్తారు. విద్యార్థులకు శ్రమ ఫలిస్తుంది. తండ్రి ద్వారా ధన, ఆస్తిలాభాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగాలలో మీ యత్నాలు సఫలమవుతాయి. పారిశ్రామికవర్గాల వారు తాము అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వారం చివరిలో మాన సిక ఆందోళన. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

సింహం
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.  విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కన్య
(ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. గులాబీ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల
(చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆలోచనలను అమలు చేస్తారు. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.  వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి పురస్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనయోగం. విద్యార్థుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలుగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంతనెమ్మదిగా పూర్తిచేస్తారు. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం  చివరిలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

మకరం
(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
రుణభారాలు కొంత తగ్గుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం  ప్రారంభంలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం
(ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మీనం
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
వీరికి అన్నింటా విజయమే. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహంకొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం  మ«ధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement