
మేషం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. రావలసిన బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనలు. దైవదర్శనాలు. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, లేత ఎరుపు రంగులు, శివాష్టకం పఠించండి.
వృషభం
అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని సంఘటనలు. ఆరోగ్య సమస్యలు. ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు, పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
మిథునం
అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు తొలగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం మధ్యలో దుబారా వ్యయం. ఇంటాబయటా చికాకులు. మానసిక అశాంతి. ఎరుపు, బంగారురంగులు, శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం
ఆర్థిక వ్యవహారాలు సాదాసీదాగా ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సోదరులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. కళాకారులు, రాజకీయవేత్తలకు అవకాశాలు నిరాశ కలిగించవచ్చు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. వస్తులాభాలు. చాక్లెట్, ఆకుపచ్చరంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
సింహం
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తు, వస్త్రలాభాలు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. పసుపు, తెలుపురంగులు, గణేశాష్టకం పఠించండి.
కన్య
దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు. అనుకున్న పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు రావచ్చు. కొన్ని ముఖ్య నిర్ణయాలకు వెనుకాడరు. ధన, వస్తులాభాలు ఉంటాయి. శ్రేయోభిలాషులు మీకు చేయూతనిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారస్తులు తగినంత లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి మరింత అనుకూల వాతావరణం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. ఖర్చులు పెరుగుతాయి. తెలుపు, చాక్లెట్‌రంగులు, నవగ్రహస్తోత్రాలు పఠించండి.
తుల
పనులు సకాలంలో పూర్తయి ఊపిరిపీల్చుకుంటారు. శ్రమ ఫలించే సమయం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో కొన్ని వ్యవహారాల్లో రాజీపడతారు. చర,స్థిరాస్తుల వృద్ధి. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు అధిగమిస్తారు. రాజకీయ, కళారంగాల వారికి అనుకోని అవకాశాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. మానసిక ఆందోళన. చాక్లెట్, ఆకుపచ్చ రంగులు, కనకధారాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం
ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లకు అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. దూరప్రయాణాలు సంభవం. ఎరుపు, బంగారు రంగులు, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
ధనుస్సు
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని నిర్ణయాలు కుటుంబసభ్యుల ప్రశంసలు అందుకుంటాయి. భూములు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు రావచ్చు, మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి.. లేతనీలం, నేరేడురంగులు, దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.
మకరం
ఆర్థికంగా మరింత సానుకూలత ఉంటుంది. ఇతరుల నుండి ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు వేగంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. మీ అభీష్టం మేరకు కుటుంబంలో నిర్ణయాలు ఉంటాయి. పరపతి కలిగిన వారు పరిచయమవుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కలసివచ్చే సమయం. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. వృథా ఖర్చులు.. గులాబీ, పసుపు రంగులు, విష్ణుధ్యానం చేయండి.
కుంభం
ముఖ్యమైన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి.. తెలుపు, చాక్లెట్‌రంగులు, కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
మీనం
మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త భాగస్వాములతో వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడుల నుండి విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. అనారోగ్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, శివపంచాక్షరి పఠించండి.
Comments
Please login to add a commentAdd a comment