గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
చుండూరు(వేమూరు): డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలబాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి 6వ తేదీ వరకు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పరీక్షలు ఏప్రిల్ 6వ తేదీన ఉంటాయని తెలిపారు. మార్కుల శాతం, రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయిస్తారని తెలిపారు.
జోరుగా పొట్టేళ్ల పందేలు
మేదరమెట్ల: కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో నిషేధిత కోడి పందేలు, పొట్టేళ్ల పోటీలు జోరుగా సాగుతున్నాయి. తమ్మవరంలో మంగళవారం పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. నెల్లూరు, భీమవరం నుంచి తెప్పించిన పొట్టేళ్లతో స్థానిక నాయకులు బరులు ఏర్పాటు చేశారు. భారీ మొత్తంలో పందేలు వేశారు. పోలీసులు సైతం కన్నెత్తి కూడా చూడలేదు. యర్రబాలెం, అనమనమూరు తమ్మవరం గ్రామాల్లో నిత్యం కోడి పందేలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వీటిని అరికట్టాలని కోరుతున్నారు.
హైవేలో ప్రమాద స్థలాల పరిశీలన
రొంపిచర్ల: పల్నాడు జిల్లాలోని శ్రీ కాసుబ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్‌వేపై జరుగుతున్న ప్రమాదాలను నివారించేందుకు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం మంగళవారం పర్యటించింది. దాచేపల్లి టోల్‌గేట్ వద్ద నుండి సంతమాగులూరు అడ్డరోడ్డు వరకు ఉన్న రాష్ట్ర రహదారిలోని ప్రమాద స్థలాలను బృందం పరిశీలించింది. ఎక్కువ ప్రమాదాలు జరిగిన ప్రత్యేక ప్రాంతాలను పరిశీలించి, ప్రమాదాలకు గల కారణాలను వారు పరిశీలించారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో రొంపిచర్ల ఎస్‌ఐ మణికృష్ణతో పాటు ఎంఐఈ అధికారులు, హైవే అధికారులు, జిల్లా ఎస్పీ నియమించిన ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఉన్నారు.
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment