విద్యుత్ తీగలు తగిలి రైతుకు తీవ్రగాయాలు
ఈపూరు(శావల్యాపురం): మండలంలోని బొమ్మరాజుపల్లె గ్రామానికి చెందిన రైతు చీదా సుబ్బారావు తాను సాగు చేసిన కంది పంటకి కాపలాగా వెళ్ళి పంట పొలాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం ఎస్సై ఎం.ఉమామహేశ్వర రావు కథనం ప్రకారం.. చీదా సుబ్బారావుకు చెందిన కంది పొలం భధ్రుపాలెం–ముప్పాళ్ళ గ్రామాల మధ్య ఉంది. అయితే అడవి జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు విద్యుత్ తీగలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గమనించని చీదా సుబ్బారావు బహిర్భూమికి వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలి సంఘటన స్థలంలో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంత సమయం గడిచిన తర్వాత స్పృహలోకి వచ్చి పడుతూ లేస్తూ వెళ్ళగా ఆ చుట్టుపక్కల పొలంలో ఉన్న రైతు ఆంజనేయులు గమనించి జరిగిన సంఘటన గురించి సెల్‌ఫోను ద్వారా సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. సుబ్బారావుకు విద్యుత్‌తీగలు తగిలి తలకు, కాలికి శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వినుకొండ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యసేవలు నిమిత్తం గుంటూరు తరలించారని ఎస్సై తెలిపారు. క్షతగాత్రుడిని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment