చిన్నారులను తీర్చిదిద్దాలి
డీఈఓ చంద్రకళ
కారెంపూడి: బడిపై ఆసక్తి కలిగేలా అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారులను తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో అంగన్‌వాడీ టీచర్లకు నిర్వహిస్తున్న జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 3,4,5 ఏళ్లలోపు చిన్నారులను బడికి ఆకర్షితులను చేయడం అంగన్‌వాడీల చేతుల్లోనే ఉందని చెప్పారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ ఆటపాటల ద్వారా విద్యపై ఆసక్తి కలిగేలా నర్సరీ బోధన సాగాలని తెలిపారు. అనంతర జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని, పదో తరగతి విద్యార్థుల విద్యా ప్రగతిని తనిఖీ చేశారు. ప్రీ పైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కులను పరిశీలించి, వాటిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఆమె వెంట ఎంఈఓ టి. రవికుమార్, జెడ్పీ హెచ్‌ఎం అనంత శివ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment