ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
బాపట్ల టౌన్: వైద్యారోగ్య శాఖలో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కూరపాటి సత్యంరాజు గురువారం రాష్ట్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. సత్యంరాజు మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అన్ని క్యాడర్స్‌లో వారికి వంద శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు, అవుట్ సోర్స్ ఉద్యోగులకు బదిలీల సౌకర్యం కల్పించాలన్నారు. జీవో 143 సరళతరం చేసి, తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్‌లను మానవతా దృక్పథంతో తిరిగి నియమించాలని పేర్కొన్నారు. ఆర్థికపరమైన అంశాలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవకాశం ఉన్నంతవరకు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ సభ్యులు వైవీ శేషయ్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment