శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి
జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తమ్
బాపట్ల టౌన్: విద్యార్థి దశ నుంచే శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారి పురుషోత్తమ్ తెలిపారు. రాష్ట్ర సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో రూపేష్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో 6 – 9 తరగతు విద్యార్థినులకు కరాటేలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. జీసీడీవో చారులత మాట్లాడుతూ ఆత్మరక్షణ సాహసానికి తొలి మెట్టు అన్నారు. ఈ శిక్షణ 20 రోజులు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, సొసైటీ జిల్లా కో ఆర్డినేటర్ రాము, ట్రైనర్స్ ఇన్‌చార్జి ఉమామహేశ్వరరావు, సమగ్ర శిక్ష ఏఎంఓ మోసేస్, ఐఈడీ జోత్స్న సీఎంఓ శ్రీనివాస రెడ్డి, ఏఎస్‌ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment