25న శివరాత్రి సమన్వయ కమిటీ సమావేశం
అమరావతి: పుణ్యక్షేత్రమైన అమరావతి శ్రీ మాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల సమన్వయ కమిటీ మూడో సమావేశం ఈ నెల 25వ తేదీన జరగనుంది. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్తెనపల్లి ఆర్‌డీవో రమణకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆలయ ప్రాంగణంలో సమావేశం ఉంటుందని చెప్పారు.
పండ్ల తోటల పెంపకంపై రాయితీ
నరసరావుపేట రూరల్: పండ్లతోటల పెంపకంపై ప్రభుత్వ రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని డాట్ సెంటర్ శాస్త్రవేత్త నాగేష్ తెలిపారు. మండలంలోని పమిడిమర్రులో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త నాగేష్, ఉద్యాన శాఖ అధికారి నవీన్‌కుమార్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం మిర్చి ధర తక్కువగా ఉన్నందున రైతులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ పరిస్ధితుల్లో పండ్ల తోటలు లాభదాయకంగా ఉంటాయని వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వంద శాతం రాయితీలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్‌లో ఉద్యాన పంటలకు ఇచ్చే రాయితీని వచ్చే 2025–26 నుంచి పెంచినట్టు తెలిపారు. రైతులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
రూ.46.60 లక్షల విలువైన 234 మొబైల్స్ రికవరీ
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): పొగోట్టుకున్న మొబైల్‌ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నట్లు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి చెప్పారు. ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు సుమారు రూ.46.60 లక్షల విలువైన 234 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో శుక్రవారం బాధితులకు అప్పగించారు. ఏఎస్పీ మాట్లాడుతూ బాధితులు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేయడం ఆనందంగా ఉందన్నారు. సెల్‌ఫోన్లు పొయినట్లయితే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్ 8688831574 లేదా సీఈఐఆర్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేసి మాట్లాడితే ఆ నంబర్లను బ్లాక్ చేసి, దగ్గర్లోని పోలీస్‌స్టేషన్ లేదా జాతీయ సైబర్ భద్రత టోల్ ఫ్రీ నంబర్ 1930కు సమాచారం అందించాలని సూచించారు. సీఐలు నిషార్ బాషా (ఐటీకోర్), నరేష్‌కుమార్ (పీసీఆర్), హెడ్ కానిస్టేబుళ్లు కిషోర్, రమేష్, కానిస్టేబుళ్లు శ్రీధర్, ఇమాంసాహెబ్, గౌస్ బాషా, మానస, కరీముల్లాను ఏఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment