ఎన్నికల విధుల్లో అశ్రద్ధ వద్దు
రేపల్లె రూరల్: ఎన్నికల విధుల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి చెప్పారు. పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులపై పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం పోలింగ్ అధికారులు(పీవోలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారులు (ఏపీవో), సెక్టారు ఆఫీసర్లు, మైక్రో అబ్జ ర్వర్‌లకు రెండో విడత నిర్వహించిన శిక్షణ తరగతులలో ఆమె మాట్లాడారు. ఎన్నికల విధుల్లో పీవో, ఏపీవోల విధులే కీలకమని తెలిపారు. ఓటర్లు స్వచ్ఛందంగాఓటు హక్కును వినిగించుకునేలా చూడాలని చెప్పా రు. ఓటు గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించటంతో పాటు పోలింగ్ కేంద్రంలో దొంగ ఓట్లు అరికట్టంలో సమర్థంగా పని చేయాలని ఆదేశించారు. పోలింగ్ రోజున కేంద్రాలలోకి ఆయా పార్టీల నుంచి గుర్తింపు పొందిన ఏజెంట్లను మాత్రమే అనుమతించాలని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలును మైక్రో అబ్జర్వర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఆమె సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా సెక్టారు ఆఫీసర్లు పర్యవేక్షించాలని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మాస్టర్ ట్రైనర్ వెంకటేశ్వ రరావు ఎన్నికల విధులు, ఓటువేసే విధానం, పోస్టల్ బ్యాలెట్, ఓట్లు లెక్కింపులపై అవగాహన కల్పించారు.
ఆర్డీవో నేలపు రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment