నకిలీ బంగారాన్ని పట్టుకున్న బ్యాంక్ అధికారులు
పోలీసులకు వ్యక్తి అప్పగింత
అద్దంకి రూరల్: తాకట్టు పెట్టేందుకు బ్యాంకుకు తెచ్చిన బంగారం నకిలీదిగా గుర్తించి బ్యాంకు అధికారులు ఓ వ్యక్తిని పోలీసులకు అప్పగించిన సంఘటన శుక్రవారం అద్దంకి పట్టణంలో చోటు చేసుకుంది.అద్దంకికి చెందిన వ్యక్తి ఓ బ్యాంక్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టటానికి గాజులు తీసుకువచ్చాడు. వాటి నాణ్యతను అధికారులు పరీక్షించగా, అవి నకిలీవిగా నిర్ధారణ అయ్యాయి. ఇదే వ్యక్తి వారం రోజుల కిందట వేరే బ్యాంకులో కూడా నకిలీ బంగారం పెట్టి రుణం తీసుకున్నాడని తెలియడంతో, రెండు బ్యాంకుల అధికారులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
వలస కూలీల మినీ లారీ బోల్తా
ఆరుగురికి గాయాలు
మేడికొండూరు: వలస కూలీలతో వెళుతున్న మినీ లారీ రోడ్డుపై బోల్తా కొట్టడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని సత్తనపల్లి రోడ్డులో గుళ్ళపాలెం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద శుక్రవారం ఉదయం జరిగింది. పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన వలస కూలీలు 25 మంది గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం కోవెలమూడి గ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో మేడికొండూరు సమీపంలోని గుండ్లపాలెం పెట్రోల్ బంక్ వద్ద మినీలారీ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా కొట్టింది. ఘటనలో లారీలో ఉన్న రాజ్ కుమార్ చంద్రమ్మలకు తీవ్ర గాయాలు అవ్వగా మరో నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి 108 సహాయంతో తరలించారు. ప్రమాద సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
మేడికొండూరు: ఆటోను వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. ఈ ఘటన మండల పరిధిలోని పేరేచర్ల కాల్వ సమీపంలో జరిగింది. పేరేచర్ల నుంచి మేడికొండూరు వైపు వెళ్తున్న ఆటోను గుంటూరు నుంచి సత్తనపల్లి వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
షార్ట్ సర్క్యూట్‌తో టిప్పర్ దగ్ధం
కారంచేడు: షార్ట్ సర్క్యూట్ కారణంగా టిప్పర్ దగ్ధమయిన సంఘటన గురువారం రాత్రి కారంచేడు సమీపంలో జరిగింది. స్థాలస్థానికుల కథనం మేరకు.. వాడరేవు–పిడుగురాళ్ళ 167/ఏ జాతీ య రహదారి పనులకు అవసరమైన చిప్సు, ఇసుక, మట్టి, కంకర లోడ్లుతో టిప్పర్ లారీలు తిరుగుతున్నాయి. వీటిలో కారంచేడు ఉత్తర పొలాల సమీపంలో కల్యాణ మండపం ఎదురు వంతెన పైనుంచి అవతలకు వెళ్లిన లారీ నుంచి ఒక్కసారిగా పొగలు కమ్ముకొచ్చాయి. దీంతో వెంటనే డ్రైవర్ అప్రమత్తమై ఆపేసి కిందకి దిగిపోయా డు. అప్పటికే మంటలు వేగంగా వాహనం చుట్టేశాయని డ్రైవర్ తెలిపాడు. హైవే అథౠరిటీకి చెందిన ట్యాంకర్ అందుబాటులో ఉండటంతో ఆ నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈలోగా చీరాల నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. లారీ ఇంజన్ క్యాబిన్ భాగం పూర్తిగా దగ్ధమయ్యింది. కారంచేడు ఎస్‌ఐ సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఎన్‌హెచ్‌ఏఐ నుంచి ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని చెప్పారు.
నకిలీ బంగారాన్ని పట్టుకున్న బ్యాంక్ అధికారులు
నకిలీ బంగారాన్ని పట్టుకున్న బ్యాంక్ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment