బైకును ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
చెరుకుపల్లి: కావూరు ప్రభుత్వ వైద్యశాల రోడ్డులో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరం మండలం పెదమట్లపూడి శివారు లుక్కావారి పాలెం గ్రామానికి చెందిన ఆట్ల దుర్గాప్రసాద్(25), కేశన గోపి కలసి గురువారం ఉదయం మిరప నారు కొనేందుకు బాపట్ల వెళ్లారు. తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కావూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో జాతీయ రహదారిపై రేపల్లె డిపో ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొంది. దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. గోపీకి తీవ్ర గాయాలు కావటంతో 108 సాయంతో తెనాలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎస్సై టి.అనిల్‌కుమార్ ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment