బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి
మరో యువకుడు పరిస్థితి విషమం
అద్దంకి: బైకును ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పార్వతీపురం గ్రామ శివార్లలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన యెనికపాటి చౌదరి (19) మార్బుల్ కూలీగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన మద్దు అనిల్‌తో కలసి బుధవారం రాత్రి పార్వతీపురం గ్రామం వైపు నుంచి సొంతూరుకు బైక్‌పై వస్తున్నాడు. పార్వతీపురం గ్రామ శివారు దగ్గర మోదేపల్లి వెళ్తున్న కట్టెల ట్రాక్టరు ఢీకొట్టడంతో బైకు వెనుక వైపున కూర్చున్న చౌదరి మృతి చెందాడు. బైకు నడుపుతున్న అనిల్‌కు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ సుబ్బరాజు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కట్టెల ట్రాక్టరు డ్రైవరు పరారీలో ఉన్నాడు. కుమారుడి మరణ వార్త విని తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
బైకును ఢీకొట్టిన ట్రాక్టర్.. ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment