గుడారాల పండుగకు ఏర్పాట్లు
అమరావతి: హోసన్న మందిరం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే గుడారాల పండుగను ఈ ఏడాది గుంటూరు శివారులోని గోరంట్ల గ్రామంలో కాకుండా మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో నిర్వహించాలని హోసన్న మందిరం పెద్దలు నిర్ణయించారని పాస్టర్ అనీల్ తెలిపారు. మంగళవారం ఆయన ఏర్పాట్ల గురించి వివరిస్తూ హోసన్న మందిరం వ్యవస్థాపకులు హోసన్న మొదటి చర్చి లేమల్లె గ్రామంలో నిర్మాణం చేసినందు వల్ల ఈ పవిత్ర ప్రదేశంలో 18వ గుడారాల పండుగ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మార్చి 6వ తేదీ సాయంత్రం నుంచి 9వ తేదీ మధ్యాహ్నం వరకు గుడారాల పండుగ నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇచ్చే లక్షలాది మంది హోసన్నా విశ్వాసులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు వెయ్యికి పైగా మరుగుదొడ్లు, వచ్చిన విశ్వాసులందరికీ భోజన వసతి, పార్కింగ్‌తో పాటుగా వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సుమారుగా పదివేల మంది వలంటీర్లు పనిచేస్తారని అలాగే పోలీసు శాఖ వారి సహకారం తీసుకుంటామన్నారు.
గుంటూరు, విజయవాడ, సత్తెనపల్లి నుంచి గుడారాల పండుగ వేదిక వద్దకు ప్రత్యేక బస్సులు అర్టీసీ వారు నడుపుతారన్నారు. అనకాపల్లి నుండి భీమవరం మీదగా ఆ గుడారాల పండుగకు ప్రత్యేక రైతులు విశ్వాసులు తరలివస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుండే కాక ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల నుండి భక్తులు లక్షలాది మంది ఈ పండుగకు తరలి వస్తాన్నారు. ప్రార్ధన వేదిక, ప్రార్ధన మందిరాలను పరిశుభ్రంగా ఉంచటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. హోసన్నా మందిరంకు సుమారు 20ఎకరాల భూమి ఉండగా మిగిలినది రైతుల నుంచి సుమారు వంద ఎకరాలు లీజుకు తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గుడారాల పండుగకు వచ్చు వీఐపీలకు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వేర్వేరు మార్గాలు ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment