బంగారం, నగదు స్వాధీనం
నరసరావుపేట రూరల్: జిల్లాలోని పలుచోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువైన బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ పి.రామకృష్ణ వెల్లడించారు. మంగళవారం రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టుకున్న నిందితులతో హాజరై వివరాలను వెల్లడించారు. యడ్లపాడు మండలం చెంఘీజ్‌ఖాన్‌పేటకు చెందిన పోతురాజు బాలకృష్ణ, యద్దల నరేంద్రసాయిలను అరెస్టు చేశామన్నారు. వీరు పగలు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ బయట, ఇళ్లల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కొని ఉడాయిస్తుంటారన్నారు. గతేడాది సెప్టెంబరు 15న నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో సాయంత్రం సమయంలో ఊరిచివర గంగమ్మ దేవాలయం వద్ద సిమెంట్‌బల్లపై కూర్చోని ఉన్న దేవిశెట్టి లక్ష్మమ్మ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వాహనంపై వేగంగా పారిపోయారన్నారు. పెదకూరపాడు, ముప్పాళ్ల మండలం తొండపి, రొంపిచర్ల మండలం పరగటిచర్ల గ్రామాల్లో కూడా ఒంటరి మహిళలపై దాడులు చేసి బంగారు గొలుసులను లాక్కొని పరారయ్యారన్నారు. ఈ నేరాలపై దేవిశెట్టి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఆర్‌కేటీ బైపాస్ వద్ద ఇరువురిని అరెస్టుచేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment