ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో ఉద్రిక్తత
దాచేపల్లి: ఛత్రపతి శివాజీ శోభాయాత్రలో బుధవారం రాత్రి దాచేపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శోభయాత్ర లైబ్రరీ సెంటర్‌లోకి రాగానే భారీఎత్తున నినాదాలు చేశారు. ఓ వ్యక్తి టిప్పు సుల్తాన్ జెండా చూపుతూ హల్‌చల్ చేయడంతో శోభాయాత్రలో ఉన్న యువకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు శోభాయాత్రలో రాళ్లు విసిరారు. ఘటనా స్థలాన్ని గురజాల డీఎస్పీ జగదీష్ పరిశీలించి, సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుకాణాలన్నింటిని మూసి వేయించారు. డ్రోన్ కెమెరాలతో పలు ప్రాంతాలను చిత్రీకరించారు.
రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి లాఠీచార్జీ చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment