పక్కా ఇళ్ల నిర్మాణ లక్ష్యాలు సాధించాలి
బాపట్ల: పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలని జేసీ ప్రఖర్ జైన్ తెలిపారు. గృహ నిర్మాణంపై సంబంధిత శాఖ అధికారులతో బుధవారం ఆయన స్థానిక కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలని చెప్పారు. మొదటి త్రైమాసికంలో జిల్లాకు 4,898 గృహాల నిర్మాణం లక్ష్యం అన్నారు. ప్రస్తుతం 290 మాత్రమే పూర్తి చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. మిగినవన్ని మార్చిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాలలో పని దినాలు కల్పించాలన్నారు. నిర్దేశించిన 90 పని దినాలు చూపి లబ్ధిదారులకు కూలి సొమ్ము చెల్లించాలన్నారు. అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇంటికి ఉండాలన్నారు. అలా నిర్మించుకుంటే త్వరగా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. పేద లబ్ధిదారులకు ఇల్లు నిర్మించి ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
జేసీ ప్రఖర్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment