మార్టూరు: జిల్లా వ్యాప్తంగా కొందరు రెవెన్యూ సిబ్బందికి గురువారం జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రెవెన్యూ సమస్యలపై దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు ఇటీవల ఎవరైనా మిమ్మల్ని లంచం అడిగారా? తీసుకున్నారా? అంటూ ప్రభుత్వం తరఫున ఫోన్ ద్వారా ఐవీఆర్‌ఎస్ సర్వే చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జిల్లాలో 11 మంది రెవెన్యూ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం. వారిలో అత్యధికంగా మార్టూరు మండలం నుంచి ఐదుగురు వీఆర్వోలు ఉండటం విశేషం. మండలంలో షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ద్రోణాదుల–2, కోలలపూడి, జొన్నతాళి, బొబ్బేపల్లి, మార్టూరు– 3 వీఆర్వోలు కే మోహన్ నాయక్, జి.వీరయ్య, ఎ. ఉమామహేశ్వరరావు, జి.రోశయ్య, కె.మోహనరావులు ఉన్నారు. మిగిలిన ఆరుగురిలో నగరం మండలం ధూళిపూడి గ్రామ సర్వేయర్ ఎం. గోపి నాగకృష్ణ, భట్టిప్రోలు వీఆర్‌ఓ ఎం.లక్ష్మి, అద్దంకి వీఆర్వో ఎం.శ్రీనివాసరావు, ఇంకొల్లు వీఆర్వో ఎం. సురేష్ ఉన్నారు. పర్చూరు మండలం ఉప్పుటూరు వీఆర్వో పి. నాగలక్ష్మి, జే. పంగులూరు మండలం రేణింగివరం వీఆర్వో వి. సుమతి షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. వీరిని మూడు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశిస్తూ కలెక్టర్ గురువారం సాయంత్రం నోటీసులు జారీ చేశారు.
సర్వే లోపాలమయం..
ఇదిలా ఉండగా ఈ విషయమై జిల్లాలోని కొందరు వీఆర్వోలు విలేకరులతో మాట్లాడుతూ ఐవీఆర్‌ఎస్ సర్వే లోపభూయిష్టంగా ఉందన్నారు. దరఖాస్తు చేయని వారికి కూడా ఫోన్ చేసి ఒకటి నొక్కమని ఒత్తిడి చేశారని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బందే బలి పశువులు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైళ్లు రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): చర్లపల్లి–దానాపూర్–చర్లపల్లి రైళ్లను రద్దు చేసినట్లు సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ గురువారం తెలిపారు. చర్లపల్లి నుంచి దానాపూర్‌కు ఈనెల 21 –28వ తేదీ వరకు , దానాపూర్ నుంచి చర్లపల్లి వరకు 21 – 28వ తేదీ వరకు నడపదలిచిన ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు వివరించారు.
ఐవీఆర్‌ఎస్ సర్వేలో అవినీతి
ఆరోపణలే కారణం
Comments
Please login to add a commentAdd a comment