మహిళల రక్షణపై దృష్టి ముఖ్యం
బాపట్ల టౌన్: మహిళల రక్షణపై దృష్టి సారించాలని రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం రాష్ట్రంలోని ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లా నుంచి ఎస్పీ తుషార్‌డూడీ హాజరయ్యారు. అనంతరం జిల్లాలోని పోలీస్ అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ.. రానున్న లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఐఎస్‌ఐ మార్క్ ఉన్న హెల్మెట్‌లనే ధరించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. కొత్త చట్టాలపై సిబ్బందికి అవగాహన కల్పించాలని, డ్రోన్లను విరివిగా వాడుతూ పట్టణ ట్రాఫిక్ ప్రాంతాల్లో సేవలు ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment