ఆహార భద్రతా శిక్షణ కేంద్రం ప్రారంభం
బాపట్ల టౌన్: ఆహార, కిరాణా, మాంసం, మిఠాయి వంటి షాపుల నిర్వాహకులు శిక్షణ తీసుకొని ధ్రువపత్రాలు పొందాలని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గరికపాటి ప్రభాకరరావు తెలిపారు. పట్టణంలోని విజయలక్ష్మిపురంలో గురువారం ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ కలకండ ప్రవీణ్ కుమార్, బాపట్ల బ్రాంచ్ మేనేజర్ నవీన్, కిరాణా అసోసియేషన్ సెక్రటరీ దిలీప్, ఫ్యాన్సీ అసోసియేషన్ సెక్రెటరీ శ్రీనివాస్, రాధాకృష్ణ, నాగేశ్వరరావు, మువ్వ శ్రీనివాస్, అనిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment