నరసరావుపేట: శ్రీ వెంకటేశ్వరుడు నిలయమైన తిరుమల ఆలయంలో మహా ద్వారం వద్ద విధు లు నిర్వహిస్తున్న బాలాజీ సింగ్‌పై టీటీడీ పాలకవర్గ సభ్యుడు నరేష్‌కుమార్ అసభ్యకరమైన పదజాలంతో విరుచుకుపడటాన్ని ఏపీ రాష్ట్ర బొందిలి సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. స్థానిక కార్యాలయంలో గురువారం సంఘ నాయకులు సమావేశమయ్యారు. సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొందిలి శ్రీనివాస సింగ్ మాట్లాడుతూ విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్‌కుమార్ ‘‘నిన్ను ఎవరు ఇక్కడ పెట్టించింది.. ఏమనుకుంటున్నావు.. నీ సంగతి చూస్తా.. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా? నువు ముందు బయటికి పో’’ అంటూ దూషించడం దారుణమని తెలిపారు. వెంటనే నరేష్ కుమార్ క్షమాపణ చెప్పాలని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించి పాలకవర్గ సభ్యుడుగా ఉన్న అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment